Site icon NTV Telugu

Top Headlines@9am : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 9 Am

Top Headlines @ 9 Am

రాహుల్‌ లండన్ ప్రసంగంపై దుమారం.. క్షమాపణ చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్

లండన్‌ వేదికగా భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోయిందంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశంలో ఎంత రాజకీయ దుమారాన్ని రాజేశాయో తెలిసిందే. రాహుల్‌ ప్రసంగంపై పార్లమెంట్‌ ఉభయ సభలు దద్దరిల్లుతున్నాయి. ఇటీవల కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో భారత ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్‌కు చెందిన రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తన దాడిని మరింత ఉధృతం చేసేందుకు సిద్ధమైంది. కాంగ్రెస్‌ నేతపై వ్యాఖ్యలపై అధికార పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. విదేశీ గడ్డపై భారత్ పరువు తీశారని రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాల్సిందేనని కాషాయ పార్టీ నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రాహుల్‌ గాంధీ ప్రకటనలను పరిశీలించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే కోరారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు, ప్రజాస్వామ్యం, దేశ వ్యవస్థలను అవమానించడమేనని బీజేపీ వాదించింది. రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని ముగించేందుకు కమిటీ పరిశీలించాలని దూబే అన్నారు.

పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధర.. ఈ రోజు రేటు ఎంతంటే..

బంగారం కొనాలనుకునే వారికి పసిడి ధరలు షాకిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు హెచ్చు తగ్గులను చూసినప్పటికీ శుక్రవారం మరోసారి బంగారం ధర పెరిగింది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర ఇవాళ మళ్లీ భారీగా పెరిగింది. ఏకంగా రూ. 550 పెరిగింది. శుక్రవారం దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలో పెరుగుదల కనిపించింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 పెరిగింది. దీంతో బంగారం ధర రూ.53, 550కి చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.550 మేర పెరిగి రూ.58,420కి ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం ధర రూ.53, 700కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ.550 పెరుగుదలతో రూ.58, 570 వద్దకు చేరింది.

31వ రోజుకు చేరిన రేవంత్‌ పాదయాత్ర.. ఆర్మూర్‌లో జనసభ

టీపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్‌సే హాత్‌జోడో పాదయాత్ర నిజామాబాద్‌ నియోజక వర్గంలో కొనసాగతుంది. నేడు ఆర్మూర్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయనున్నారు. ఉ 9:00 గంటలకు సిద్దుల గుట్ట ఆలయాన్ని సందర్శిస్తారు. నందిపేట మండలం లక్కంపల్లి SEZను రేవంత్‌ సందర్శించనున్నారు. సాయంత్రం 4:00 గంటలకు పెర్కిట్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మామిడిపల్లి, ఆర్మూర్ కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా పాత బస్టాండ్ కు యాత్ర చేరుకోనుంది. ఆర్మూర్ పాత బస్టాండ్ వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి ఇక్కడితో రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన ముగుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు అనుబంధంగా టీపీసీసీ హాత్ సే హాత్ జోడో యాత్రను చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 6న ప్రారంభించారు రేవంత్‌. రాహుల్ గాంధీ పాదయాత్రపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఈ యాత్ర నిర్వహిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల స్ఫూర్తితో ఈ యాత్ర చేపట్టారు రేవంత్ రెడ్డి.

ట్రెండ్ అవుతున్న మాన్ ఆన్ మాసేస్… కారణం మాస్ కా దాస్

మార్చ్ 5 నుంచి ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎన్టీఆర్ ఆస్కార్స్ కోసం యుఎస్ వెళ్లిన దగ్గర నుంచి ఇప్పటివరకూ ఎన్టీఆర్ పేరుని ట్రెండ్ చేస్తూనే ఉన్న ఫాన్స్… తాజాగా #NTR #ManofMassesNTR అనే టాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆస్కార్ ఈవెంట్ ముగించుకోని హైదరాబాద్ వచ్చేసాడు. అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ తర్వాత నందమూరి అభిమానులతో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వని ఎన్టీఆర్, ఈరోజు బయటకి రానున్నాడు. తనకి అతి పెద్ద ఫ్యాన్ అయిన హీరో మాస్ కా దాస్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం శిల్ప కళా వేదికలో జరగనుంది. ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ ఛీఫ్ గెస్టుగా రానున్నాడు. విశ్వక్ సేన్ కి ఎన్టీఆర్ ఫాన్స్ లో స్పెషల్ క్రేజ్ ఉంది. విశ్వక్ తన ఫేవరేట్ హీరో గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ స్టేజ్ పైన ఎలాంట్ ఎలివేషన్స్ ఇస్తాడు అని నందమూరి అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నా

ముంబైలో వాతావరణ సూచన ఏమిటి?

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేలో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని గొప్పగా ఆరంభించిన టీమ్‌ ఇండియా అదే జోరు కొనసాగించాలని అనుకుంటోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌లో తమ స్థానాలను దక్కించుకున్న తర్వాత, ఈ ఏడాది 50 ఓవర్ల ప్రపంచ కప్‌కు సిద్ధమవుతున్నాయి ఇరు జట్లు. రెండు సిరీస్‌ల్లోనూ న్యూజిలాండ్‌, శ్రీలంకలతో ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలిచింది. తొలి వన్డేలోనూ బోణి కొట్టాలని ప్లాన్ చేస్తోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ శుక్రవారమే మొదలవుతోంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఎన్టీఆర్-చరణ్ లని మర్చిపోయి ట్రోల్ అయ్యాడు…

కీరవాణి కొడుకుగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన కాలభైరవ, ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా మారి మంచి ఆల్బమ్స్ ఇస్తున్నాడు. జక్కన తెరకెక్కించిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుని గెలిచింది. ఈ పాటని కాలభైరవ రాహుల్ సిప్లిగంజ్ తో కలిసి పాడిన విషయం తెలిసిందే. ఆస్కార్ స్టేజ్ పైన కూడా లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కాలభైరవ, నాటు నాటు సాంగ్ విషయంలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని ట్విట్టర్ లో పెట్టాడు. నాటు నాటు సాంగ్ అద్భుతంగా రావడానికి, ఆస్కార్ వేదికపైన నిలబడి పాట పాడే అవకాశాన్ని తనకి ఇచ్చిన ప్రతి ఒక్కరికీ కాలభైరవ థాంక్స్ చెప్తూ రిలీజ్ చేసిన నోట్ లో రాజమౌళి, కీరవాణి, వల్లిగారు, కార్తికేయ, ప్రేమ్ రక్షిత్ మాస్టర్… ఇలా అందరి పేర్లు ఉన్నాయి కానీ తనతో పాటు పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, ఆ పాటని అంత అద్భుతంగా  రావడానికి ఎంతో కష్టపడిన ఎన్టీఆర్, చరణ్ పేర్లు లేవు.

జగజ్జేత ఇండియాకి తిరిగొచ్చాడు…

కరోనా సమయంలో ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ పూర్తిగా సైలెంట్ అయిపొయింది. థియేటర్స్ లో సినిమాలు లేవు, రెవిన్యూ లేదు. కరోన ప్రభావం తగ్గినా వెంటనే థియేటర్స్ ని ఓపెన్ చెయ్యలేదు. ఇలాంటి సమయంలో ఎప్పుడు థియేటర్ ఓపెన్ అయినా, మేము ఎప్పుడు థియేటర్స్ లోకి వచ్చినా ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తాం అని మాట ఇచ్చాడు జక్కన్న అలియాస్ ఎస్ ఎస్ రాజమౌళి. చరణ్, ఎన్టీఆర్ లని పెట్టి ఆర్ ఆర్ ఆర్ సినిమా రూపొందించిన జక్కన్న ఇండియన్ సినిమా అంటే ఏంటో వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి తెలిసేలా చేశాడు. ఇండియాలో 1200 కోట్లు రాబట్టిన ఈ మూవీ జపాన్ లో 200 రోజులుగా సాలిడ్ నంబర్ ఆఫ్ థియేటర్స్ లో ఆడుతూనే ఉంది. ఒక ఇండియన్ సినిమా చేరుకోలేని ప్రతి చోటుకి ఆర్ ఆర్ ఆర్ సినిమాని చేర్చిన రాజమౌళి, ఎట్టకేలకు ఎవరూ ఊహించనిది నిజం చేశాడు, మన నాటు పాటకి ఆస్కార్ అవార్డ్ వచ్చింది.

వన్డే వార్ మొదలు.. నేడే భారత్‌, ఆస్ట్రేలియా ఫస్ట్‌ మ్యాచ్

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగే తొలి వన్డేతో మాజీ ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా ప్రారంభించనుంది. భారత్, ఆ్రస్టేలియా వన్డేల్లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ వాంఖడేలో భారత్‌, ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రోహిత్‌ దురం కావడంతో ఈ మ్యాచ్‌కు హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన నాలుగు టెస్టుల్లో సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకుంది భారత్‌. ఇప్పుడు అదే ఊపులో వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని చూస్తోంది. టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆసీస్‌.. వన్డేల్లో మరింత బలంగా కనిస్తోంది. కమిన్స్‌ ఈ సిరీస్‌కూ దూరం అయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో జట్టును నడిపించిన స్మిత్‌.. వన్డేల్లోనూ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. గాయాల నుంచి కోలకున్న గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, డేవిడ్‌ వార్నర్‌, మిషెల్‌ మార్ష్‌ రాకతో ఆ జట్టు పటిష్టంగా మారింది. పొట్టి ఫార్మాట్‌లో గత కొంతకాలంగా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పాండ్యా.. సీనియర్లతో కూడిన జట్టును ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరమైన విషయం.

ఇరాన్‌ సరిహద్దులో 11 మంది ఆఫ్ఘన్ శరణార్థులు హతం

ఇరాన్‌లోకి అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన 11 మంది ఆఫ్ఘన్‌ శరణార్థులు ఇరాన్ సరిహద్దు దళాల చేతిలో చంపబడ్డారని ఖామా ప్రెస్ నివేదించింది. ఇరాన్ సరిహద్దు దళాలు శుక్రవారం పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరుల మృతదేహాలను నిమ్రోజ్ సరిహద్దు క్రాసింగ్ వద్ద తాలిబాన్ అధికారులకు అప్పగించారు. నాలుగు రోజుల క్రితం, సిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో అక్రమంగా ఇరాన్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్న పదకొండు మంది ఆఫ్ఘన్ పౌరులను ఇరాన్ భద్రతా దళాలు కాల్చి చంపాయి. మరణించిన ఆఫ్ఘన్ జాతీయులు దాదాపు 20 సంవత్సరాల వయస్సు గలవారు. వీరు ఇద్దరికి 18 సంవత్సరాల వయస్సు ఉన్నట్లు భావిస్తున్నారు. ఇరాన్ అధికారులు, తాలిబాన్ అధికారులు ఈ హత్యలకు సంబంధించి ఇంకా స్పందించకపోవడం గమనార్హం.

Exit mobile version