NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

హడావుడిగా టూర్ ముగించుకున్న డిప్యూటీ సీఎం పవన్‌:
విజయనగరం జిల్లా గుర్లలో నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. స్థానిక పీహెచ్‌సీలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. వ్యాధి వ్యాప్తి, కారణాలపై అధికారులను ఆరా తీశారు. అయితే గంట వ్యవధిలోనే గుర్ల పర్యటనను డిప్యూటీ సీఎం ముగించారు. మూడు కుటుంబాలతోనే ఆయన మాట్లాడారు. పవన్‌ అభిమానులను పోలీసులు అదుపు చెయ్యలేక చేతులెత్తేశారు.

మాజీ మంత్రి విశ్వరూప్‌ కుమారుడు అరెస్ట్‌:
వైసీపీ నేత, మాజీ మంత్రి పినిపె విశ్వరూప్‌ కుమారుడు శ్రీకాంత్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దళిత యువకుడు, వాలంటీర్‌ జనుపల్లి దుర్గాప్రసాద్‌ హత్య కేసులో శ్రీకాంత్‌ను తమిళనాడులోని మధురైలో ఈరోజు ఉదయం అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వడ్డి ధర్మేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో శ్రీకాంత్ పేరు బయటికి రావడంతో.. తాజాగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. నేడు శ్రీకాంత్‌ను కోర్టులో పోలీసులు హాజరుపర్చనున్నారు.

ఏపీలో జీరో క్రైమ్ ఉండాలి:
ఏ ప్రగతి జరగాలన్నా పోలీసులే కీలకం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ప్రశంసించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఒక పవిత్రమైన కార్యక్రమం అని, ప్రజా సేవ కోసం ప్రాణాలు వదిలిన పోలీసుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఏపీలో జీరో క్రైమ్ ఉండాలని, నేరాలు చేయాలంటే ఎవరైనా బయపడేవిధంగా పోలీసులు ఉండాలని సీఎం పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సీఎంతో పాటు హోంమంత్రి అనిత, ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు కూడా పాల్గొన్నారు.

గ్రూప్‌ 1 పరీక్షలకు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌:
తెలంగాణ గ్రూప్‌ 1 అభ్యర్థులను ఆందోళనకు సుప్రీంకోర్టు తెరదించింది. నేటి నుంచి గ్రూప్‌ 1 పరీక్షలు నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. అభ్యర్థుల తరపున కపిల్ సిబాల్ వాదనలు విన్న సుప్రీంకోర్టు.. చివరకు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ఇంతవరకు వచ్చి ఇప్పుడు వాయిదా వేయడం మంచిది కాదని పేర్కొంది. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, ఇలా చేయడం వలన అభ్యర్థుల ఇంత వరకు ప్రిపేర్‌ అయిన సిలబస్‌ అంతా వ్యర్థం అవుతుందని తెలిపింది. అభ్యర్థుల లేవనెత్తిన అభ్యంతరాలను హైకోర్టు పరిశీలించాలని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 రద్దు చేయాలని కోరుతూ గ్రూప్‌-1 అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పు వచ్చే వరకు పరీక్షలు వాయిదా వేయాలని కోరారు.

కేటీఆర్ ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు:
మధ్యాహ్నం 2 గంటలకు గ్రూప్ 1 పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.ప్రధాన ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసానికి పోలీసులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి వద్ద ఉదయం నుంచి పోలీసులు భారీగా మోహరించారు. గ్రౌప్ 1 అభ్యర్థులతో కేటీఆర్ కలుస్తారనే విశ్వనీయ సమాచారంతో ముందస్తు జాగ్రత్తగా కేటీఆర్ నివాసం వద్ద పోలీసులు చేరుకున్నారు. వందలాది మంది పోలీసులను మోహరించి, పదుల సంఖ్యలో పోలీసు వాహనాలను ఉంచారు. నందినగర్ ప్రాంతమంతా పోలీసు బలగాలతో నిండిపోయింది.

వీర మరణం పొందిన పోలీసు కుటుంబాలకు కోటి పరిహారం:
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. విధుల్లో వీర మరణం పొందిన పోలీస్ కుటుంబాలకు ఇకపై రూ.కోటి నష్ట పరిహారం ఇస్తామని తెలిపారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ కోటి రూపాయలు అందజేస్తామన్నారు. సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ లకు కోటి 25 లక్షలు.. డీఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఎస్పీ లకు కోటి 50 లక్షలు.. ఐపీఎస్ కుటుంబాలకు 2 కోట్లు.. శాశ్వతంగా అంగవైకల్యం పొందిన కుటుంబాలకు ర్యాంక్ అధికారులను బట్టి 50 లక్షల నష్ట పరిహారం చెల్లిస్తామని తెలిపారు. చనిపోయిన కుటుంబ సభ్యులలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తామన్నారు.

కాశ్మీర్‌ పాకిస్థాన్‌గా మారదు:
జమ్మూ కాశ్మీర్‌లోని గందర్‌బల్‌లో ఉగ్రదాడి తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా పాకిస్తాన్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. కాశ్మీర్‌ పాకిస్థాన్‌గా మారదని పాక్ పాలకులకు చెప్పాలనుకుంటున్నామని అన్నారు. ఈ సందర్బంగా ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘ఇది చాలా బాధాకరమైన సంఘటన. ఈ క్రూరమైన వ్యక్తులు దీని నుండి ఏమి పొందుతారు?. దీని వల్ల ఇక్కడ పాకిస్తాన్‌ను సృష్టిస్తుందని వారు భావిస్తున్నారా?, నిజంగా భారత్‌తో స్నేహం కావాలంటే దీన్ని ఆపాలని పాకిస్థాన్ పాలకులకు చెప్పాలనుకుంటున్నా. కాశ్మీర్‌ పాకిస్థాన్‌గా మారదు’ అని అన్నారు.

దేవర లెక్కలేనన్ని రికార్డులు:
యంగ్ టైగర్ ఎన్టీయార్ కొరటాల శివ కాంబో మరోసారి తమది సక్సెస్ ఫుల్ కాంబో అని నిరూపించారు. గతంలో వీరి కలయికలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కాగా తాజాగా వచ్చిన దేవర సెన్సేషనల్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లు గ్రాస్ రాబట్టిన సినిమాగ దేవర నిలిచింది. రిలీజ్ నాటి నుండి కంటిన్యూగా 19 రోజులు పాటు కోటి రూపాయల షేర్ రాబట్టిన ఆల్ టైమ్ సినిమాల్లో నాలుగవ సినిమాగా దేవర రికార్డుక్రియేట్ చేసింది. 2024 భారతీయ సినిమాలు వరల్డ్ వైడ్ టాప్ గ్రాస్ ఓపెనింగ్స్ రూ.172 కోట్లుతో రెండవ సినిమా దేవర నిలిచింది.