NTV Telugu Site icon

Top Headlines @1PM: టాప్ న్యూస్!

Top Headlines @1pm

Top Headlines @1pm

వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో జంగా కృష్ణమూర్తి?:
శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ముందు వైసీపీకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. నేడు బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలవనున్నారట. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పల్నాడులోని టీడీపీ కీలక నాయకులతో జంగా కృష్ణమూర్తి భేటీ అయ్యారట. ఈరోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా:
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి పేదలంటే చులకన అని విజయవాడ వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నాని అన్నారు. రాజ్యాంగంలో పేదవాడు ఎమ్మెల్యే, ఎంపీ అవ్వకూడదని ఎక్కడైనా రాసి ఉందా? అని ప్రశ్నించారు. ‘క్యాష్ కొట్టు టికెట్ పట్టు’ అన్నది చంద్రబాబు స్కీమ్ అని ఎద్దేవా చేశారు. తన కోసం, తన కొడుకు కోసం, తన పవర్ కోసం, కేసుల నుండి బయటపడడం కోసం ప్రధాని మోడీ కాళ్లు బాబు పట్టుకున్నాడని కేశినేని నాని ఫైర్ అయ్యారు.

ఎన్నికల ప్రచారం మొదలెట్టిన యార్లగడ్డ వెంకట్రావు:
గన్నవరం నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఎన్నికల ప్రచారం మొదలెట్టారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరు గ్రామంలోని రామాలయంలో వేదపండితులు పూజలు నిర్వహించిన అనంతరం శనివారం సాయంత్రం యార్లగడ్డ తన ప్రచారం ఆరంభించారు. ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియచేస్తూ.. రాష్ట్రంలో టీడీపీ పాలన ఆవశ్యకతను వివరించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గన్నవరం నియోజకవర్గంలోని అర్హులైన 15వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని యార్లగడ్డ హామీ ఇచ్చారు.

కృష్ణ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం:
సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ లో పొగలు వ్యాపించిన ఘటన మరువక ముందే కృష్ణ ఎక్స్ ప్రెస్ ట్రైన్ వెళుతున్న రైల్ పట్టారు విరిగిపోవటం ఘటన సంచలనంగా మారింది. ఆదిలాబాద్‌ నుంచి తిరుపతి వెళ్లే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ ఉదయం సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరిన రైలు యాదాద్రి జిల్లా ఆలేరు స్టేషన్‌ దాటుతుండగా పెద్ద శబ్ధం వినిపించింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు రైలు సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు రైలును నిలిపివేశారు. పట్టాలను పరిశీలించి పట్టాలు విరిగిపోయి మరమ్మతులు చేశారు. అనంతరం రైతుల అక్కడి నుంచి కదిలింది. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

రాజన్న ఆలయంలో ముగియనున్న ఉత్సవాలు:
రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో శివ కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ అర్చకులు, జంగమ అర్చకులు కలిసి స్వామివారికి మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు రోజుల పాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలు ఇవాల్టితో ముగుస్తాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు రోజు కావడంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతుండటంతో భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ఈరోజు, రేపు గర్భాలయంలో భక్తులచే నిర్వహించే ఆర్చిత సేవలను రద్దు చేశారు.

ఒక్కసారి పాలేరు రిజర్వాయర్ కి నీళ్లు వదలండి:
ఒక్కసారి పాలేరు రిజర్వాయర్ కి నీళ్లు వదిలితే పంటలు చేతికి అందుతాయని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు ప్రభుత్వానికి కోరారు. రైతు ఇవాళ కన్నీరు పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు అప్పలపాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి పాలేరు రిజర్వాయర్ కి నీళ్లు వదిలితే పంటలు చేతికి అందుతాయని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. నష్టపోయిన ప్రతి రైతు కూడా ఎకరానికి కనీసం 30 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రైతుని పొట్టలో పెట్టుకొని కాపాడిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు.

పాలిటెక్నిక్ లో చేరాలనుకుంటున్నారా:
తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 10 వ తరగతి తర్వాత చాలామంది విద్యార్థులు పాలిటెక్నిక్ లో చదివేందుకు అప్పుడే ప్రిపరేషన్ మొదలు పెట్టేశారు కూడా. ఇందులో భాగంగా పాలిటెక్నిక్ కాలేజీలో సీటు సంపాదించేందుకు ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్యాశాఖ ప్రతి సంవత్సరం పాలీసెట్ ను నిర్వహిస్తోంది. అయితే ఇందులో వచ్చే ర్యాంకును బట్టి వివిధ కళాశాలలో విద్యార్థులకు సీట్ల కేటాయించడం జరుగుతుంది. ఇక పాలిసెట్ లో మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఏపీ సాంకేతిక విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలో ఉచితంగా కోచింగ్ ఇవ్వబోతోంది. ఈ తరగతులు ఏప్రిల్ ఒకటి నుంచి మొదలు కాబోతున్నాయి. ఇందుకు గాను రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే చాలామంది దరఖాస్తులు చేసుకోగా ఎవరైనా చేసుకుని వారు ఉంటే నేరుగా పాలిటెక్నిక్ కళాశాల వద్దకు వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిస్తే ఉచిత కోచింగ్ కు హాజరు కావచ్చని సాంకేతిక విద్యాశాఖ తెలిపింది.

రష్మిక ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్:
రష్మిక మందన్న ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానమిస్తూ.. ఏప్రిల్ 5న రష్మిక పుట్టినరోజు సందర్భంగా సినిమా టీజర్‌ను రిలీజ్ చేస్తామని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చెప్పారు. ఈ మూవీని ఐదు భాషల్లో రిలీజ్ చేస్తున్నాం అని, ఐదు భాషల్లో రష్మిక స్వయంగా డబ్బింగ్ చెప్పుతుందని చెప్పుకొచ్చారు. మలయాళ సంగీత సంచలనం హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చుతుండగా.. మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై విద్యా కొప్పినీడి మరియు ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.