NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

నోరుజారిన నితీష్ కుమార్.. “మోడీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారంటూ”..

జేడీయూ అధినేత, బీహార్ సీఎం నితీష్ కుమార్ నోరు జారారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అనుకోకుండా ప్రధాని నరేంద్రమోడీ మళ్లీ ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. పాట్నాలో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికల్లో ఎన్డీయే 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ మేము భారత్ అంతటా 400 సీట్లకు పై గెలవాలని అనుకుంటున్నాము. నరేంద్ర మోడీ మళ్లీ ముఖ్యమంత్రి కావాలి, అప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతుంది, బీహార్ అభివృద్ధి చెందుతుంది, ప్రతిదీ జరుగుతుంది’’ అని అన్నారు.

ఏపీ, ఒడిశాలో గెలవబోతున్నాము.. అమిత్ షా ధీమా..

లోక్‌సభ ఎన్నికలు చివరిదశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరిదైన ఏడో విడత ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. ఎంపీ ఎన్నికలతో పాటు ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. లోక్‌సభ ఎన్నికల తో పాటు మూడు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని, అలాగే మిత్రపక్షం చంద్రబాబు నాయుడితో కలిసి ఏపీలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన ఆదివారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే తప్పకుండా 400 సీట్లను దాటుతుందని, ఒడిశా, ఏపీ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అమిత్ షా చెప్పారు.ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాల్లో బీజేపీ మంచి పనితీరు కనబరుస్తుందని, ప్రధాని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పనితీరే కారణమని ఆయన అన్నారు.

ఓర్వ లేక ఉత్తమ్‌పై ఆరోపణలు చేస్తున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజులు పరిపాలన యంత్రాంగం ని గాడిలో పెట్టామని, వంద రోజులు కాకముందే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు. బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్ళ ని మేము మీ అనుభవాలు చెప్పండి అని కోరినమని, పరిపాలన లో మీరు చేసిన పొరపాట్లు మేము చేయొద్దు అని సలహా ఆడిగామన్నారు. మేడిగడ్డ పోయినప్పుడు కూడా సీఎం.. అందరిని రమ్మన్నారని, చూసి సలహాలు ఇవ్వండి అని ఆడిగామన్నారు. ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఏదంటే అది మాట్లాడారని, కేసీఆర్.. కేటీఆర్..హరీష్ లు..సమాధానం చెప్పండని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. 2018 లో అధికారం ఇస్తే.. 40 రోజుల తర్వాత mla ప్రమాణ స్వీకారం చేశారని, కానీ మేము 40 రోజుల్లో మేము హామీల అమలు మొదలుపెట్టినమన్నారు శ్రీధర్‌బాబు.

నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం.. గోడ కూలి నలుగురు కార్మికులు మృతి

నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈదురుగాలుల బీభత్సానికి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో గోడ మీద పడటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. రెండు గంటలుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఏపీలో ఎండలు దంచి కొడుతున్నాయి. జనం ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. ముఖ్యంగా ఉదయం పదిగంటలు దాటిన తర్వాత భానుడి భగభగలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేసింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు తోడుగా.. తీవ్రమైన వడగాల్పులు కూడా వీస్తాయని తెలిపింది. ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. రేపు (సోమవారం) 72 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 200 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఎల్లుండి (మంగళవారం) 165 మండలాల్లో తీవ్రవడగాల్పులు,149 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

సివిల్ సప్లై కార్పోరేషన్ అప్పులకు మీ పార్టీ బాధ్యత లేదా

మహేశ్వర్ రెడ్డికి ఇప్పుడు బుద్ది వచ్చిందని, సివిల్ సప్లై కార్పోరేషన్ అప్పులకు మీ పార్టీ బాధ్యత లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరోపణలు చేసి పెద్దోడు ఐపోతా అనుకుంటే ఎలా.. ఆరోపణలు చేయడానికి కొంత ఇంగిత జ్ఞానం ఉండాలన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఇద్దరు ఒక్కటై..ఆరోపణలు చేయడంలో కూడా ఒక్కటయ్యారని, ఆలోచించి మాట్లాడాలన్నారు. పేపర్లో పేరు వస్తుంది అని..మాట్లాడితే ఎట్లా.. మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు చేస్తున్న సంస్థలు కేంద్రం పరిధిలోనివే కదా అని ఆయన అన్నారు. విచారణ చేయించు… ఆరోపణలు చేస్తే పెద్ద లీడర్ కావు.. వాస్తవాలు మాట్లాడితే పెద్ద లీడర్ ఐతవు.. కేటీఆర్..నువ్వు రుణమాఫీ చేయడనికి ఐదేండ్లు పట్టిందన్నారు. మేము ఐదు నెలల్లో మాఫీ చేస్తాం అంటే ఓర్వలేకపోతున్నావని ఆయన మండిపడ్డారు. మతం పేరుతో బీజేపీ ప్రజలను రెచ్చగొడుతోందన్నారు. రిజర్వేషన్లను తొలగించే ప్రయత్నాలు చేస్తోందని, ముస్లింలను బూచిగా చూపి దేశాన్ని చీల్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడే హక్కు ప్రధాని మోదీకి లేదన్నారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాపాడుతామన్నారు. తెలంగాణలో మెజార్టీ లోక్ సభ స్థానాలను కాంగ్రెస్సే గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.