దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక
వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక అని అన్నారు. వివేకా హత్య కేసులో టీడీపీకి చెందిన కొన్ని మీడియా సంస్థలు విష ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని.. సీబీఐ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ కూడా చెత్తగా విచారణ చేస్తుంది అనటానికి వివేకా కేసు చరిత్రలో ఉదాహరణగా నిలిచిపోతుందని సజ్జల పేర్కొన్నారు. మెడకాయ పై తలకాయ ఉండే ఎవరైనా.. ఎన్నికల ముందు పార్టీ నేత వివేకా చనిపోతే నష్టపోయేది వైసీపీనే అని అర్థం అవుతుందని అన్నారు. తమ కార్యకర్తలు డీమోరలైజ్ అయితే చంద్రబాబుకు ఉపయోగం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం సీబీఐకి లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మరోవైపు సీబీఐ మాత్రం టీడీపీ కోణాన్ని బుల్‌డోజ్ చేసుకుంటూ వస్తోందని సజ్జల ఆరోపించారు.
కేసీఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరు
కేసీఆర్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడరని విమర్శించారు బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి గెస్ట్ లెక్చరర్ లకు అన్యాయం చేస్తుండని, KGBV తో పాటు ఇతర గురుకులాల్లో గెస్ట్ లెక్చరర్ లకు వేతనాలు సరిగ్గా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. గెస్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. గెస్ట్ లెక్చరర్స్ రెన్యువల్ చేస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినా అమలుకు నోచుకోవడం లేదని, కోర్టు తీర్పును అమలు చేయకుండా కేసీఆర్ అపహస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో సంపాదిస్తున్న వితిక..
వితిక షేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 11 సంవత్సరాల వయస్సులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటనా జీవితాన్ని ప్రారంభించిన వితిక.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఆ తర్వాత యాంకర్ గా కూడా చేసింది.. 2008లో ఓ కన్నడ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి ఆమె వయసు 15 ఏళ్లే. `ప్రేమించే రోజుల్లో` మూవీతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. కానీ, ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.. తెలుగు అమ్మాయి కావడంతో అస్సలు అవకాశాలు రాలేదని తెలుస్తుంది..
హీరో వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. `పడ్డానండి ప్రేమలో మరి` సినిమాలో వరుణ్ సందేశ్, వితిక జంటగా నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆపై పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. 2019లో బిగ్ బాస్ సీజన్ 3లో ఈ జంట కంటెస్టెంట్స్ గా పాల్గొన్నారు.. విన్నర్ గా నిలవలేదు కానీ.. తమదైన ఆటతీరులో తెలుగు రాష్ట్రాల్లో తమకంటూ మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ తర్వాత వితిక బులితెర ఈవెంట్స్ లో సందడి చేస్తూనే.. మరోవైపు యూట్యూబ్ లో సొంతంగా ఛానెల్ ను ప్రారంభించింది..
ఆ ఛానెల్ త్వరగానే క్లిక్ అయ్యింది..ఆరున్నర లక్షల సబ్‌స్క్రైబర్లు వితికా యూట్యూబ్ ఛానెల్ ను ఫాలో అవుతున్నారు. ప్రతి శుక్రవారం ఈ బ్యూటీ ఒక వీడియోను విడుదల చేస్తుంటుంది. వితిక ఇప్పటివరకు దాదాపు 160 వీడియోను పోస్ట్ చేసింది.. వీడియోకు లక్షల్లో వ్యూస్ ఉన్నాయి. ఇక వితిక షేరు యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుందో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వితిక నెలకు దాదాపు రూ. 5 నుంచి 6 లక్షల వరకు సంపాదిస్తుందట.. ఈ విషయాన్ని స్వయంగా వరుణ్ సందేశ్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు.. మొత్తానికి సినిమాలు చేయకున్నా కూడా బాగానే సంపాదిస్తుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..
కేటీఆర్ మెప్పు పొందేందుకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు దిగజారుతున్నారు
ఐటీ శాఖ మంత్రి, సీఎం కేసీఆర్ తనయుడు కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా నిన్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, పేపర్ యాడ్స్, టీవీ యాడ్స్ ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన విషయం తెలిసిందే. అయితే.. యువ నాయకుడి దృష్టిలో పడేందుకు మరికొందరు వినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఓ చోట ఒకడుగు ముందుకేసి కేటీఆర్ పుట్టిన రోజు వేడుకల్లోకి విద్యార్థులను కూడా లాక్కొచ్చారు. చొప్పదండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో లోకల్ బీఆర్ఎస్ నేతలు వినూత్నంగా కేటీఆర్‌కి విషెస్ చెప్పించారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టేలా కార్యక్రమాలను నిర్వహించారని విమర్శలు వినిపిస్తున్నాయి.
పిల్లలతో చేయించిన యాక్టివిటీస్‌పై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కేటీఆర్ బర్త్‌డేకు విద్యార్థులను ఉపయోగించడమేంటి? అని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ హెచ్చార్సీలో కాంగ్రెస్ నేతలు మహేష్ కుమార్ గౌడ్, దర్పల్లి రాజశేఖర్, తదితరులు ఫిర్యాదు చేశారు. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కేటీఆర్ జన్మదినం సందర్భంగా చొప్పదండి నియోజకవర్గంలో చిన్న పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తూ వారిని కేటీఆర్ అనే పదం వచ్చే విధంగా కూర్చోబెట్టారని, దీనిపై మానవ హక్కుల కమీషన్ కు ఫిర్యాదు చేశామన్నారు. కేటీఆర్ మెప్పు పొందేందుకు స్థానిక బీఆర్ఎస్ నాయకులు దిగజారుతున్నారని ఆయన మండిపడ్డారు. కేటీఆర్ పుట్టిన రోజు పేరుతో హంగు, ఆర్భాటాలు చేశారని, కేటీఆర్ పైన స్థానిక ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమీషన్ ను కోరామన్నారు మహేష్ కుమార్ గౌడ్.
గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు పాత్ర ఎంతో ముఖ్యమైంది
గ్రామీణ వ్యాపార, వ్యవసాయ ఉత్పత్తుల అభివృద్ధిలో నాబార్డు ప్రధాన పాత్ర పోషించిందని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రాజెక్టుల అభివృద్ధి కూడా నాబార్డు ఎంతో తోడ్పడిందని కొనియాడారు. మంగళవారం ఘనంగా నిర్వహించిన నాబార్డు 42వ ఆవిర్భావ దినోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1982 జులై 12వ తేదీన నాబార్డు ఆవిర్భవించిందని, ఈరోజు ఈ సంస్థ 42వ ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకోవడం సంతోషకరమని అన్నారు. నాలుగు దశాబ్దా్లో నాబార్డు 8.01 లక్షల కోట్ల టర్నోవర్‌కు చేరిందని తెలిపారు.
పవన్ కళ్యాణ్‌ని ఫ్యాన్స్ నమ్మొద్దు.. ఆయన్ను సినిమా వరకే చూడండి
వాలంటీర్ వ్యవస్థపై జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సుధాకర్ బాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్.. వాలంటీర్ వ్యవస్థపై హీనంగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలోని కోడుమూరులో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలెవ్వరూ వాలంటీర్ వ్యవస్థ బాగోలేదని చెప్పలేదని తెలిపారు. ప్రజల దగ్గర ఆమోదం పొందిన వ్యవస్థను తీసేయ్యమని చెప్పటానికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎవరు? అని ప్రశ్నించారు. అసలు వాలంటీర్లను తీసెయ్యమని చెప్పే హక్కు ఆ ఇద్దరికి ఎవరిచ్చారు? అని నిలదీశారు. వాలంటీర్లుగా సేవలందిస్తున్న వాళ్లు పేద ప్రజలని, వాళ్లేమీ డబ్బున్నవారు కాదని వివరించారు. పవన్ కళ్యాణ్‌ను ఆయన అభిమానులు నమ్మొద్దని, ఆయన్ను కేవలం సినిమాల వరకే చూడమని హితవు పలికారు.
హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. ఐటీ ఉద్యోగులకు పోలీస్ శాఖ కీలక సూచనలు
వర్షాల కారణంగా హైదరాబాద్ ట్రాఫిక్ జాం అవుతున్న నేపథ్యంలో మంగళవారం, బుధవారం ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు 3 దశలవారీగా లాగ్ అవుట్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీస్ శాఖ సూచించింది. ఫేజ్ – 1 ఐకియా నుండి సైబరాబాద్ టవర్స్ వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. ఫేజ్ – 2 ప్రకారం.. ఐకియా నుండి బయో డైవర్సిటి, రాయదుర్గం వరకు ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలని, ఫేజ్ – 3 ప్రకారం.. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉండే ఐటీ ఆఫీసులు సాయంత్రం 3 గంటలకు లాగ్ ఔట్ చేసుకోవాలన్నారు.
పిల్లి సుభాష్ కీలక వ్యాఖ్యలు.. పార్టీ మార్పుపై క్లారిటీ
రామచంద్రపురం సీటు విషయంలో మంత్రి వేణుగోపాల కృష్ణ, ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య వాగ్వాదం జరుగుతున్న విషయం తెలిసిందే. వేణుకి మరోసారి టికెట్ ఇస్తే తాను రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బోస్ సంచలన ప్రకటన చేస్తే.. సీఎం జగన్ ఉన్నంతవరకూ ఎమ్మెల్యే పదవి తనదేనంటూ మంత్రి వేణు తేల్చి చెప్పారు. ఇలా ఇద్దరు నేతలు తగ్గేదే లే అంటూ.. బహిరంగంగా సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ రంగంలోకి దిగి.. ఈ సమస్యని పరిష్కరించే చర్చలు చేపట్టింది. ఇప్పటికే ఈ వ్యవహారంలో గతంలో మూడుసార్లు రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలుపొందిన ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో మిథున్ రెడ్డి భేటీ అయ్యారు. రామచంద్రపురం రాజకీయ పరిస్థితుల గురించి మిథున్ రెడ్డికి వివరించారు. ఇదే సమయంలో.. పిల్లి సుభాష్ పార్టీ మారొచ్చన్న రూమర్లూ పుట్టుకొచ్చాయి. ఆయన వైసీపీ వీడి, త్వరలోనే జనసేన పార్టీలోకి చేరొచ్చని పుకార్లు ఊపందుకున్నాయి.
చంద్రబాబు ఉంటే.. కరువు రాజ్యమేలుతుంది
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కాకాణి గోవర్ధన్ తాజాగా నిప్పులు చెరిగారు. తాడేపల్లిలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఉంటే కరువు రాజ్యమేలుతుందని, కానీ సీఎం జగన్ హయాంలో నాలుగేళ్లల్లో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదని పేర్కొన్నారు. చంద్రబాబు పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పి, అధికారంలోకి రాగానే మాట మార్చాడని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో రైతులకు అడుక్కుని తినే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. అయితే వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని రైతుల ఆత్మహత్యల్ని జాబితాలో చేర్చలేదని ఆరోపించారు.
మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ.. మోడీ రాజీనామా చేయాలి
మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. మణిపూర్‌లో జరిగిన దారుణాలపై కాంగ్రెస్ పార్టీ మంగళవారం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఏపీసీసీ కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో గిడుగు రుద్రరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరిగిన హింస, అత్యాచారాలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం నివ్వెరపోయే ఈ ఘటనల్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని అన్నారు. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోడీ ఇప్పటిదాకా స్పందించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
సమ్మక్క- సారక్క రీ యూనియన్.. కన్నుల పండుగగా ఉందే
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రోజా , రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు 90వ దశకంలో ఈ నటీమణులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. స్టార్ హీరోల సినిమాలు అంటే .. ముందుగా గుర్తొచ్చేది వీరి పేర్లే. ప్రస్తుతం ఎవరి కెరీర్ లో వారు దూసుకుపోతున్నారు. రోజా.. సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లి.. ప్రస్తుతం ఏపీ మినిస్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఇక రమ్యకృష్ణ.. తన నటనకు బ్రేకులు వేయకుండా వరుస సినిమాలతో కొనసాగుతోంది. ఇక వీరిద్దరూ మంచి స్నేహితులు అన్న విషయం అందరికి తెల్సిందే.. వీరిద్దరి కాంబోలో సుమారు 10 సినిమాలు వరకు వచ్చి ఉంటాయి. అసలు రోజా, రమ్యకృష్ణ కాంబో అనగానే సమ్మక్క- సారక్క సినిమానే గుర్తొస్తుంది. అక్కాచెల్లెళ్లు దేవతులుగా ఎలా మారారు అనే కథతో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమాలు చేసేటప్పుడు.. నిత్యం కలుసుకొనే ఈ స్నేహితులు ఇప్పుడు అప్పుడప్పుడు కలుసుకుంటున్నారు. తాజాగా సమ్మక్క సారక్క రే యూనియన్ అయ్యారు.
కీచక హోంగార్డ్.. పోలీస్ స్టేషన్‌లోనే వివాహితపై..
తమకు ఏదైనా సమస్య వస్తే.. ప్రజలు మొదటగా తట్టేది పోలీస్ స్టేషన్ తలుపులే. కానీ.. ఇప్పుడు ఆ స్టేషన్‌లో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. తమని రక్షిస్తారన్న నమ్మకంతో ఆ రక్షక భటుల్ని ఆశ్రయిస్తే.. వాళ్లే భక్షకులుగా మారుతున్నారు. అందరూ కాదు కానీ, కొందరు పోలీసులు మాత్రం ఈ తరహా దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఓ హోంగార్డ్ కూడా ఇలాంటి కీచక పనే చేశాడు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న భ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ వ్యవహారం ఎక్కడికి దాకా వెళ్లిందంటే.. ఆ వివాహిత అవమానంగా భావించి, ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో ఒక వివాహిత తన ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఓ పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పిన ఆమె.. మళ్లీ తిరిగి ఇంటికి రాలేదు. రాత్రైనా ఇంటికి రావడంతో.. కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఆమె కోసం గాలించడం మొదలుపెట్టారు. అయితే.. ఎక్కడా ఆమె ఆచూకీ దొరక్కపోవడంతో, ఈనెల 12వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకొని, పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కట్ చేస్తే.. ఈనెల 22వ తేదీన స్వయంగా ఆ వివాహితే తిరిగి వచ్చింది. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. దీంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు వచ్చేదాకా స్టేషన్‌లోనే ఉండమని పోలీసులు చెప్పారు. దీంతో ఆమె స్టేషన్‌లోనే కూర్చుంది.
రాబోయే రోజుల్లో రైతుకు మెరుగైన రేటు వచ్చే పరిస్థితి వస్తుంది
ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తిరుపతి జిల్లా శ్రీసిటీలో మోన్‌డలీజ్ ఇండియా పుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌కు, సత్యసాయి జిల్లా ధర్మవరంలో గ్రౌండ్‌నట్ ప్రాసెసింగ్ యూనిట్‌కు శంకుస్ధాపన చేశారు. అలాగే.. చిత్తూరు జిల్లాలో 3, అన్నమయ్య జిల్లాలో ఒకటి చొప్పున మొత్తం నాలుగు పండ్లు, కూరగాయల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో 3 టమోట ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్ల నిర్మాణానికి భూమి పూజ చేసిన సీఎం జగన్.. విజయనగరం జిల్లా ఎల్ కోట మండలం రేగ గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను, కర్నూలు జిల్లా తడకనపల్లెలో 100 మైక్రో యూనిట్స్‌తో ఆనియన్ అండ్ టమోట సోలార్ డీ హైడ్రేషన్ క్లస్టర్‌ను ప్రారంభించారు.
