NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

భోజ్‌పురి నటుడు, సింగర్ పవన్ సింగ్‌పై బీజేపీ వేటు

భోజ్‌పురి నటుడు, గాయకుడు పవన్ సింగ్‌పై బుధవారం బీజేపీ సస్పెండ్ వేటు వేసింది. బీహార్‌లో ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినందుకు కమలం పార్టీ సస్పెండ్ చేసింది. పవన్ సింగ్ బీహార్‌లోని కరకత్ స్థానం నుంచి ఎన్డీఏ అభ్యర్థిపై పోటీ చేస్తున్నారు. విత్‌డ్రా చేసుకునేలా బుజ్జగించినా వినకపోవడంతో తాజాగా బీజేపీ అధిష్టానం వేటు వేసింది. ఇదిలా ఉంటే గతంలో పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ టిక్కెట్‌ను తిరస్కరించింది. దీంతో పవన్ సింగ్ బీహార్‌లోని కరకత్ నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగారు.

ఆగ్రహంతో రెచ్చిపోయిన రకుల్ తండ్రి.. అది నా కూతురి కష్టం అంటూ..

సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్స్ పై ఎప్పటికప్పుడు కొత్త రూమర్స్ రావడం కామన్. ముఖ్యంగా హీరోయిన్ సంబంధించిన విషయాలలో ఈ రూమర్స్ కాస్త ఎక్కువనే వస్తాయని చెప్పవచ్చు. అసలేమీ జరగకపోయినా సరే., కొన్నిసార్లు ఎవరో ఒకరు పుకార్లను పుట్టిస్తారు. ఇకపోతే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇలా కల్పించిన కొన్ని రూమర్స్ కు ఇబ్బందులను ఎదురుకొంది. ఆ రూమర్ తో ఆవిడతో పాటు తన ఫ్యామిలీ కూడా అనేక ఇబ్బందులు పడిందని ఆమె తెలిపింది. రకుల్ ఫామ్ లో ఉన్నప్పుడు టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల తాకడితో ఆవిడ కాస్త సినిమా చాన్సులు తగ్గాయి. ఇదిలా ఉండగా ఓసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ కి సంబంధించిన విషయంలో కూడా రకుల్ పేరు గట్టిగా వినిపించింది. అయితే ఆ విషయం పై తర్వాత ఎటువంటి విషయాలు బయటకు రాలేదు. కాకపోతే ఓ రూమర్ మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుంది. ఈ విషయాలు సంబంధించి ఒకసారి రకుల్ మాట్లాడుతూ.. సినీ ఇండస్ట్రీలో ఇలాంటి రూమర్స్ చాలా కామన్. నిజం కాకపోయినా ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటారని., తన ఫ్యామిలీ కూడా తెలుసునని అయితే ఒక్కోసారి అలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తే సహజంగా కోపం వస్తుందని తెలిపింది.

ఈసీకి జనసేన లేఖ.. దాడులపై ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ రోజున మొదలైన గొడవలు ఇంకా చల్లారలేదు. అక్కడక్కడ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఘర్షణలపై సిట్ కూడా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఈసీకి నివేదిక కూడా అందజేసింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న గొడవలపై తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రౌడీయిజం, దాడులు ఎక్కువయ్యాయని చెప్పారు. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి జనసేన లేఖ రాసిందని తెలిపారు.

2.11 లక్షల కోట్ల డివిడెండ్ కు ఆర్బీఐ ఆమోదం..

బుధవారం నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) 2024 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి దాదాపు 2.11 లక్షల కోట్ల రూపాయల డివిడెండ్ ను ఆమోదించింది. ఈ మొత్తం చివరి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 140% పెరుగుదల. FY23 లో, ఆర్బిఐ 87,416 కోట్ల రూపాయలను మిగులుగా కేంద్రానికి బదిలీ చేసింది. నేడు ముంబైలో జరిగిన సెంట్రల్ బోర్డు 608వ సమావేశంలో., సహా ప్రపంచ, దేశీయ ఆర్థిక పరిస్థితులపై బోర్డు చర్చించింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనై

వరంగల్ హంటర్ రోడ్డు లోని నాని గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు బిడ్డ, చదువుకున్న యువకుడు మన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి…. మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవని ఆయన ఆయన పేర్కొన్నారు. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటలు విద్యుత్ నిలిపోయిందని, 2లక్షల రుణమాఫీ కాలేదని, రైతు బంధు రైతులకు రాలే , కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలేనన్నారు. వరికి 500 బోనస్ దక్కాలే… రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతుంది, కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే… రాకేష్ రెడ్డిని గెలిపించాలన్నారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చారని, 24 అంతస్తు ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోయాయని, కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ఉన్న కంపెనీలకు కపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు, తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుందన్నారు కేటీఆర్‌.

పరాయి స్త్రీలతో సహాజీవనం.. ఎస్సై సస్పెండ్‌

పరాయి స్త్రీతో సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న యం. నాగరాజు తో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపి శ్రీ ఎ. వి. రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి…. కొమురేల్లి ఎస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ ఇరువురు తమ భార్యలకు విడాకులు ఇవ్వకుండా పరాయి స్త్రీలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఇరువురు పోలీస్ అధికారులపై ఆరోపణలు రావడంతో పాటు ఎస్. ఐ నాగరాజు భార్య తన పిల్లల కోసం కొమురెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసినట్లుగా వివిధ మీడియా మధ్యమాల్లో ప్రచారం కావడంతో ఈ సంఘటన పై సిద్దిపేట పోలీస్ కమిషనర్ విచారణ జరిపి ఇచ్చిన నివేదికలో ఆరోపణలు నిర్ధారణ కావడంతో పోలీస్ విభాగం కీర్తి ప్రతిష్ట భంగం కలిగించే విధంగా ఎస్. ఐ, కానిస్టేబుల్ పరాయి స్త్రీ లతో సహజీవనం చేస్తున్నందుకు ఎస్. ఐ నాగరాజు, కానిస్టేబుల్ శ్రీనివాస్ సస్పెండ్ చేస్తున్నట్లుగా మల్టీ జోన్ 1 ఐ జి పి శ్రీ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణకు బాబాయ్ విజ్ఞప్తి.. ఏం సలహా ఇచ్చారంటే..!

సార్వత్రిక ఎన్నికల వేళ కర్ణాటక లైంగిక వేధింపుల వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలను లైంగికంగా వేధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం.. సిట్ దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ప్రజ్వల్‌కు లుకౌట్ నోటీసులు జారీ చేసింది. తాజాగా అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. కానీ ఇప్పటి వరకు ప్రజ్వల్ నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు.

కాళేశ్వరం విచారణ.. మేడిగడ్డకు కేంద్ర ఏజెన్సీ

కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ సమస్యలపై తదుపరి అధ్యయనాల బాధ్యతలు చేపట్టిన మూడు కేంద్ర సంస్థల్లో ఒకటైన పుణెలోని సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) తన నిపుణుల బృందాన్ని బుధవారం రాష్ట్రానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన విధినిర్వహణలో అత్యవసర దృష్ట్యా బృందం మేడిగడ్డకు చేరుకుని బ్యారేజీ వద్ద విచారణ ప్రారంభించింది. గురువారం ప్రాథమిక కసరత్తు నిమిత్తం బుధవారం రాత్రికి అన్నారం బ్యారేజీకి చేరుకునే అవకాశం ఉంది . CWPRS బ్యారేజీల స్థిరత్వ విశ్లేషణ, పునాది పరిశోధనలు మరియు రిజర్వాయర్ సామర్థ్యంతో పాటు ఆనకట్టల ఆరోగ్య నిర్ధారణపై పని చేస్తుంది. హైడ్రాలిక్ అధ్యయనాలలో ప్రత్యేకత కలిగిన CWPRS నిర్మాణాల జీవితాన్ని అంచనా వేయడానికి ఈ కీలక అంశాలపై పని చేస్తుంది.

డీహైడ్రేషన్ కారణంగా ఆసుపత్రి పాలైన బాలీవుడ్ బాద్ షా..

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ అహ్మదాబాద్లోని కెడి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ కారణంగా నటుడిని ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. నటుడు షారుఖ్ ఖాన్ హీట్ స్ట్రోక్ కారణంగా కెడి ఆసుపత్రిలో చేరారని అహ్మదాబాద్ (రూరల్) పోలీసు సూపరింటెండెంట్ ఓం ప్రకాష్ జాట్ మీడియాకు తెలిపారు. ఆయన భార్య గౌరీ ఖాన్ ఈరోజు తెల్లవారుజామున అహ్మదాబాద్లోని కెడి ఆసుపత్రికి చేరుకున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు సహ యజమాని కింగ్ ఖాన్ నిన్న కెకెఆర్, ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ లో ఉన్నారు.