Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌న్యూస్‌

Top Headlines

Top Headlines

నా డబ్బులు నాకు వొచ్చాయి.. ఇక పోయివొస్తా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో కష్టపడకుండా అధికంగా లాభపడిన ఆటగాడు ఎవరైనా ఉన్నారా అంటే..? అది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్ రౌండర్ బెన్‌ స్టోక్స్‌ అని చెప్పొచ్చు.. ఈ 16.25 కోట్ల ఆటగాడు సీజన్‌ మొత్తంలో ఆడింది రెండే మ్యాచ్‌లు. అందులో అతను చేసిన పరుగులు కూడా 16 మాత్రమే. అంటే ఒక్కో పరుగుకు సీఎస్కే యాజమాన్యం కోటి రూపాయలపైగానే చెల్లించింది అన్న మాట. ఇంత ఘనకార్యం వెలగబెట్టిన ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌ ఇప్పుడు స్వదేశానికి బయల్దేరాడు.

స్వదేశంలో ఐర్లాండ్‌తో జరిగే ఏకైక టెస్ట్‌ మ్యాచ్‌ (జూన్‌ 1 నుంచి) ఆడేందుకు స్టోక్స్‌ చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌ను వీడాడు. ఈ విషయాన్ని సీఎస్‌కే యాజమాన్యమే అధికారికంగా ట్వీట్‌ చేసింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు కోట్లు పోసి కొనుక్కున ఫ్రాంచైజీకి అన్యాయం చేసిన స్టోక్స్‌పై సీఎస్‌కే అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏవైనా డబ్బులిచ్చాక లీగ్‌ అయిపోయేంత వరకు ఉండాలని చురకలంటిస్తున్నారు.

మారుపేరుతో పరిచయం.. హిందూ యువతిపై అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్

ఓ వ్యక్తి ఉత్తరాఖండ్ కి చెందిన హిందూ యువతిని మోసం చేశాడు. మహ్మద్ ఇఖ్లాష్ అనే వ్యక్తి మనోజ్ గా తన పేరు మార్చుకుని ఓ హిందూ యువతితో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నట్లు నటిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటి ఆగకుండా అభ్యంతరకర వీడియోలను తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ప్రస్తుతం యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. మహ్మాద్ ఇఖ్లాష్ మనోజ్ గా నటిస్తూ, గురుగ్రామ్ లోని జీడీ గోయెంకా యూనివర్సిటీలో చదువుతున్నట్లు యువతిని నమ్మించాడు.

యువతి ఫిర్యాదు మేరకు మే 18న కొత్వాలీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. వివారాల్లోకి వెళ్తే హిందూ మహిళను ట్రాప్ చేసేందుకు సదరు నిందితుడు మనోజ్ గా పేరు మార్చుకున్నాడు. నెమ్మనెమ్మడిగా యువతితో మాట్లాడుతూ.. ప్రేమిస్తున్నట్లు నటించాడు. యువతి స్వస్థలం ఉత్తరాఖండ్ డెహ్రాడూన్. ఆమెను కలిసేందుకు ఇఖ్లాస్ పలుమార్లు డెహ్రాడూన్ వెళ్లాడు. చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు యువతిని లొంగదీసుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. చాలా సార్లు తనకు డబ్బు అవసరం ఉందని చెబుతూ.. యువతి దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేశారు. తనకు అనారోగ్యంగా ఉందని మరిన్ని డబ్బులు కావాలని ఆమెతో చెప్పేవాడు.

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలో ఆదివారం వర్షం కురిసింది. అయితే.. హైదరాబాద్‌ నగరంలో గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపానికి వాతావరణం హీటెక్కిస్తుంది.. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం వేడిగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత పలు చోట్ల మబ్బులతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. కొద్దిసేపటికే నగరంలో పలుచోట్ల జల్లులు కురుస్తున్నాయి. ఆదివారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కూడిన ఎండాకాల పరిస్థితుల నుంచి స్థానికులకు కొంత ఉపశమనం లభించింది. వాతావరణ సూచన మేరకు రాబోయే రెండు రోజులు హైదరాబాద్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా.. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కొండాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, షేక్‌పేట, గచ్చిబౌలి, ఖాజాగూడ, రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ అరెస్ట్.. తలపై రూ.30 లక్షల రివార్డ్..

ఎన్నో ఏళ్లుగా పోలీసులును, భద్రతా సంస్థల్ని ముప్పుతిప్పలు పెడుతున్న మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ దినేష్ గోపే పట్టుబడ్డాడు. ఇండియా నుంచి పారిపోయి నేపాల్ లో ఉంటున్న గోపేను జార్ఖండ్ పోలీసులు, జాతీయ భద్రత ఏజెన్సీ(ఎన్ఐఏ) జాయింట్ ఆపరేషన్ లో పట్టుబడ్డాడు. అతని తలపై రూ.30 లక్షల రివార్డ్ ఉంది. ఆదివారం నిషేధిత తీవ్రవాద సంస్థ పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎల్‌ఎఫ్‌ఐ) అధినేత దినేష్ గోప్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడిని నేపాల్ నుంచి ఢిల్లీ తీసుకువస్తున్నారు.

గోపే తలపై మొత్తం రూ. 30 లక్షల రివార్డు ఉంది. దీంట్లో రూ.25 లక్షలు, ఎన్ఐఏ రూ. 5 లక్షలు ప్రకటించింది. గత 15 ఏళ్లుగా భారతీయ భద్రతా సంస్థలు, సీఆర్పీఎఫ్ ఫోర్స్ నక్సలైట్ దినేష్ గోపే కోసం వెతుకుతున్నాయి. దినేష్ గోపే కొన్నేళ్లుగా జార్ఖండ్‌లో తీవ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అతనిపై 100కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. అతని సహచరుల్లో చాలా మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు. సెంట్రల్ ఏజెన్సీలు, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సహకారంలో ఈ ఆపరేషన్ జరిగింది. దినేష్ గోపే వేరే గుర్తింపుతో నేపాల్‌లో తలదాచుకున్నట్లు తెలుస్తోంది. మొత్తం తన రూపాన్ని మార్చుకుని జీవిస్తున్నట్లు సమాచారం. సిక్కుగా మారువేషంలో తలపాగా ధరించి ఉన్నాడని తెలుస్తోంది.

సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ ఘన విజయం

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ సెంచరీతో అదరగొట్టాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్‌ సెంచరీతో కదం తొక్కి మ్యాచ్‌ గెలిపించడంతో పాటు తొలి ఐపీఎల్‌ సెంచరీని కూడా తన అకౌంట్ లో వేసుకున్నాడు. 47 బంతుల్లో సెంచరీ మార్క్‌ అందుకున్న కామెరాన్‌ గ్రీన్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. కాగా ఎస్‌ఆర్‌హెచ్‌పై విజయంతో ముంబై ఇండియన్స్‌ 16 పాయింట్లతో ప్లేఆఫ్‌ రేసులో ఉన్నప్పటికి.. ముంబై స్ట్రైక్ రేట్ మాత్రం -0.13తో ఉంది. అయితే ఆర్‌సీబీ, గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌ ఫలితంపై ఆధారపడాల్సి ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్‌ రద్దు అయితే ముంబై ప్లేఆఫ్‌కు చేరుకుంటుంది.

కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నిలబెట్టు కోలేదు

మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ మహారాష్ట్రలో బీఅర్ఎస్ బ్రాంచ్ పెట్టుకున్నారన్నారు. మహారాష్ట్రలో పనికి రాని వాళ్ళను జాయిన్ చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారని, తెలంగాణలో రైతులను, నిరుద్యోగులను కేసీఆర్‌ పట్టించుకోవడం లేదన్నారు. పంటల బీమాను అమలు ఎందుకు చేయడం లేదని, మోడీ ప్రభుత్వం ప్రతి ఎకరాకు ఎరువుల పైన 18,254 సంవత్సరానికి సబ్సిడీ ఇస్తున్నామన్నారు. అంతేకాకుండా.. ‘రైతులకు కేసీఆర్ ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పారు ఇంతవరకు ఇవ్వడం లేదు. ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కేసీఆర్‌ ఎందుకు అమలు చేయడం లేదు. కేసీఆర్ రైతులను మోసం చేస్తున్నారు రైతులను వెన్నుపోటు పొడిచారు.

బెంగళూర్‌లో వర్షాలకు కృష్ణా జిల్లా యువతి మృతి.. పరిహారం ప్రకటించిన సీఎం

బెంగళూర్ నగరం భారీ వర్షానికి అతలాకుతలం అయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరాయి. అండర్ పాస్ లు అన్ని నీట మునిగాయి. పలుచోట్ల వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులకు రోడ్లపై చెట్లు నేలకొరిగాయి. ఇదిలా ఉంటే బెంగళూర్ వర్షానికి ఆంధ్రప్రదేశ్ కృష్టా జిల్లాకు చెందిన భానురేఖ(22) అనే యువతి మరణించింది. కృష్ణా జిల్లా నుంచి బెంగళూరుకు వచ్చిన కుటుంబం కారులో వెళ్తుండగా K.R. సర్కిల్ సమీపంలోని అండర్ పాస్ వద్ద కారులో నీళ్లు చేరి మునిగిపోయింది. నీరు కారులోకి వెళ్తున్న విషయాన్ని గమనించి స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అధికారులు నీటిలో చిక్కుకున్న ఆరుగురిలో ఐదుగురిని సురక్షితంగా రక్షించారు. అయితే నీటిని మింగిన భానురేఖ తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే ఆస్పత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సమాచారం తెలుసుకున్న సీఎం సిద్ధరామయ్య బాధితురాలి బంధువులను పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తుకు సిద్ధరామయ్య ఆదేశించారు. మృతురాలు భానురేఖ కృష్ణా జిల్లా తేలుప్రోలుకు చెందినవారు. ఇన్ఫోసిస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు.

రేపు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ కీ విడుదల

ఇటీవల తెలంగాణవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ కీ ని రేపు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. అయితే.. సోమవారం వెబ్‌సైట్‌లో కానిస్టేబుల్‌ సివిల్‌, పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్‌, ఐటీ తత్సమాన పోస్టులకు సంబంధించిన ఫైనల్‌ కీ tslprb.inలో కీని ఉంచనున్నట్లు వెల్లడించింది రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు. అభ్యంతరాలు మే 24 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు సూచించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ఫార్మెట్ ను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు నియామక బోర్డు తెలిపింది. అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫైనల్ కీ సమయంలో ఓఎంఆర్‌ షీట్లను వెబ్ సైట్ లో అభ్యర్థుల లాగిన్ లో ఉంచనున్నట్లు పేర్కొంది.

బీజేపీ అధ్యక్షుడి మార్పుకు అవకాశమే లేదు

బీజేపీ అధ్యక్షుడి మార్పుకు అవకాశమే లేదని స్పష్టం చేశారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యక్షుడి మార్పుపై వస్తోన్న వార్తలు బేస్ లెస్ అన్నారు. మేమంతా ఒక కుటుంబమని, మా జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజమన్నారు. కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు. విచారణ పరిధిలోని అంశమన్నారు కిషన్‌ రెడ్డి. అంతేకాకుండా.. ‘ఆధారాలున్నాయి కాబట్టే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్ట్ చేసింది. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను సైతం జైలుకు పంపించాం.

బిగ్ బ్రేకింగ్.. రాజ్- కోటి ద్వయంలో రాజ్ ఇకలేరు

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూశారు. కొద్దిసేపటి క్రితమే ఆయన మృతి చెందినట్ల కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. అయితే ఆయన మరణం ఎలా సంభవించింది అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. రాజ్- కోటి ద్వయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజ్ – కోటి’ ద్వయంలో ఒకరిగా పేరు గాంచిన రాజ్ మరణించడం ఇండస్ట్రీలో షాకింగ్ న్యూస్ గా మారింది. తొంభైల్లో వచ్చిన సినిమాల్లో రాజ్ కోటి కాంబో సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది. వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు ఎన్నో మ్యూజికల్ హిట్స్ సాధించాయి. రాజ్ పూర్తి పూర్తిపేరు తోటకూర సోమరాజు. ఆయన ప్రముఖ సంగీత దర్శకుడు టీవీ రాజు కుమారుడు.

కాంగ్రెస్‌లో నాలుగు స్తంభాల ఆట సాగుతుంది

ప్రభుత్వ కార్యాలయాలకు పేదోళ్ళ భూములను లాకుంటున్నారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్. 33 జిల్లాల్లో ప్రభుత్వ భూములు రూపాయి లీజ్ పేరిట తీసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేబినెట్ మీటింగ్ తరువాత మంత్రి అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. కోకాపేటలో 11 ఎకరాల విలువైన స్థలాన్ని ఓ సంస్థ పేరుమీద తీసుకున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కోకాపేట భూముల మీద కేబినెట్ మీటింగ్ జరిగింది.. కానీ అది చెప్పలేదని, బీఆర్ఎస్ పార్టీ 11 ఎకరాలకు కేవలం 40 కోట్లు మాత్రమే ఇచ్చారని, 550 కోట్ల విలువ ఉంటదని, కానీ 40 కోట్లు కట్టారన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కలసి పని చేస్తారని, అది జానా రెడ్డి కోమటి రెడ్డి చెప్పారని బండి సంజయ్‌ అన్నారు. కలసి పని చేస్తారు కాబట్టి మహేశ్వర్ రెడ్డి బీజేపీలోకి వచ్చారన్నారు. కోకా పేట భూములను స్వాధీనం చేసుకుంటామని, ఆ భూమి పేదోళ్లకు డబుల్ బెడ్రూం కోసం ఇవ్వాలన్నారు.

రేపు కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ కీ విడుదల

ఇటీవల తెలంగాణవ్యాప్తంగా జరిగిన కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ కీ ని రేపు విడుదల చేయనున్నట్లు రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. అయితే.. సోమవారం వెబ్‌సైట్‌లో కానిస్టేబుల్‌ సివిల్‌, పీసీ డ్రైవర్‌, మెకానిక్‌, ట్రాన్స్‌పోర్ట్‌, ఎక్సైజ్‌, ఐటీ తత్సమాన పోస్టులకు సంబంధించిన ఫైనల్‌ కీ tslprb.inలో కీని ఉంచనున్నట్లు వెల్లడించింది రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు. అభ్యంతరాలు మే 24 సాయంత్రం 5 గంటల్లోగా తెలియజేయాలని రాష్ట్ర పోలీస్ నియామక బోర్డు సూచించింది. అభ్యంతరాల కోసం ప్రత్యేక ఫార్మెట్ ను వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు నియామక బోర్డు తెలిపింది. అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ అనంతరం తుది కీని విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఫైనల్ కీ సమయంలో ఓఎంఆర్‌ షీట్లను వెబ్ సైట్ లో అభ్యర్థుల లాగిన్ లో ఉంచనున్నట్లు పేర్కొంది.

 

Exit mobile version