Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines

Top Headlines

పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నాం

పదేళ్ల తర్వాత పేదల కళ్లలో ఆనందం చూస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనతో అన్నీ వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగింది, బీఆర్ఎస్ ప్రతిష్ట అథ:పాతాళానికి దిగజారిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఛైర్మన్లు ఆ పార్టీని వీడటం ఆ పార్టీ భవిష్యత్తును చూపెడుతుందని, గతిలేకనే కేసీఆర్ – బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నాడని ఆయన విమర్శించారు. తుంటివిరిగి కేసీఆర్ జ్ఞాపకశక్తి తగ్గిందని, మూణ్ణెళ్లు కూడా పూర్తికాకుండానే నాలుగు నెలలు అంటున్నాడని ఆయన సెటైర్లు వేశారు.

ఐపీఎల్ కోసం జియోతో జతకట్టిన ఎంఎస్ ధోని..

టాటా ఐపీఎల్ 2024 సీజన్‌ అందించే క్రికెట్ విందును ఆస్వాదించేందుకు అభిమానులు సిద్ధమవుతున్న నేపథ్యంలో జియో సినిమా దీన్ని మరో ఉత్తేజకరమైన ఎడిషన్‌గా మార్చేందుకు తన ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో రెండు సినిమాలు ఉండగా మొదటి దానిలో ఎంఎస్ ధోని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ మూడు వాణిజ్య ప్రచార చిత్రాలు టాటా ఐపీఎల్‌ను డిజిటల్‌లో వీక్షించ వచ్చు. గత సీజన్‌లో జియో సినిమాలో రికార్డు స్థాయిలో 449 మిలియన్ల మంది వీక్షించిన టాటా ఐపీఎల్‌తో పాటు డిజిటల్‌లో క్రీడల ప్రత్యక్ష ప్రసారాలను చూడాలని కోరుకుంటున్న వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ఈ క్యాంపెయిన్‌ను రూపొందించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ‌జవాబుదారి తనం

మూడు గంటలపాటు రైతులు చెప్పిన మాటలు విన్నామని, మాటలు తక్కువ చెబుతాం, పని ఎక్కువ చేస్తామన్నారు మంత్రి‌ శ్రీధర్ బాబు. ఇవాళ ఆయన జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మెనిఫెస్టో లో ముత్యంపేట షుగర్ ప్రాజెక్టు తెరిపింఛాలని అన్న అంశం పెట్టించారని, ముందు‌ ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలన్నాడని, ఖజనాలో రూపాయి లేకున్నా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి కట్టుబడి ఉన్నామన్నారు. భోధన్ షుగర్ ఫ్యాక్టరీ ని పరిశీలించామని ఆయన తెలిపారు. 15 వేల ఎకరాలలో చక్కెర పంట పండిస్తే తప్పు పరిశ్రమ ప్రారంభించే పరిస్థితి ‌ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ‌జవాబుదారి తనమన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు. షుగర్ ఫ్యాక్టరీ భూములు బ్యాంకులో‌ తనఖా పెట్టారు.

బీసీ డిక్లరేషన్ సరే.. కాపుల డిక్లరేషన్ ఎప్పుడు..?

జనాభాలో 52 శాతం ఉన్న బీసీ కులాలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు జరపటంతో పాటు విద్య, ఉద్యోగ, రాజకీయాలులో రిజర్వేషన్స్ సౌకర్యం కలుగచేయటం కూడా జరిగింది అని హరిరామజోగయ్య తెలిపారు. ఇక, జగన్ సీఎం అయ్యాక 34శాతం రిజర్వేషన్నీ 24 శాతానికి కుదించటంతో బీసీల విరోధిగా ముద్రపడ్డారు. అయితే, ప్రజారాజ్యం పార్టీ 2009 ఎన్నికలలో బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన 110 అసెంబ్లీలో సీట్లు కేటాయించిన ఘనత చిరంజీవికే దక్కింది అని ఆయన చెప్పుకొచ్చారు. నారా లోకేష్ పోటీచేయబోయే మంగళగిరి నియోజకవర్గం వేదికగా జయహో బీసీ అనే నినాదంతో రాబోయే ఎన్నికల సందర్భంలో టీడీపీ- జనసేనపార్టీల ఆధ్వర్యంలో మహాసభ ఏర్పాటు చేసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ బీసీ డిక్లరేషన్ పేర 10 ఎన్నికల హామీలు ఇస్తూ ప్రకటనలు చేశారు.. బీసీలకు 50 ఏళ్ళుకే పెన్షన్లను 3 వేల నుంచి 4 వేలకు పెంచడంతో పాటు ఏడాదికి 30వేల కోట్ల చొప్పున 5 సంవత్సరాలకు 1లక్షా 50 వేల కోట్ల రూపాయిలు బీసీల సంక్షేమానికి ఖర్చుపెట్టటం చేస్తామని ఈ హామీలన్నీ చంద్రబాబు స్వయంగా ప్రకటిస్తే.. పవన్ కల్యాణ్ బీసీలకు రాజ్యాధికారం దక్కేలా చేస్తామని 11వ హామీ అదనంగా ఇచ్చారని హరిరామయ్య జోగయ్య పేర్కొన్నారు.

బైక్స్పై రాజమండ్రి నుంచి అయోధ్యకు యువకులు.. ఆల్ దీ బెస్ట్ చెప్పిన ఎంపీ

దక్షిణ కాశీగా పేర్గాంచిన రాజమండ్రి పవిత్ర గోదావరి పుష్కర్ ఘాట్ నుంచి అయోధ్య బాల రాముని దర్శనానికి బైక్స్ పై బయల్దేరుతున్న యువకులిద్దర్నీ ఎంపీ మార్గాని భరత్ అభినందించారు. వారి ప్రయాణం దిగ్విజయంగా కొనసాగాలని కోరారు.. ఆ రాముడే మీ వెంట ఉంటాడని చెప్పుకొచ్చారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ‘జై శ్రీరామ్’ నినాదాల మధ్య ఈ యువకుల బైక్ యాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా యువకులతో ఎంపీ మార్గాని భరత్ పర్యటనకు సంబంధించి వివరాలను ఎంతో ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.

ఆరు గ్యారంటీ లను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు నమ్మకం కల్పించాలి

మంత్రి కొండా సురేఖ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సమక్షంలో 11 మంది వరంగల్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీ లను నమ్మి కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ ను, కొండా దంపతులను నమ్మి కాంగ్రెస్ పార్టీ లో జాయిన్ అవుతామన్న వాళ్ళను brs నాయకులు చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. ఆరు గ్యారంటీ లను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు నమ్మకం కల్పించాలని, మూడు సంత్సరాలుగా పైసా పనిచేయలేకపోయామని కార్పొరేటర్లు బాధ పడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని, పోటీ పడి పని చేయాలన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండ ఉంటదన్నారు. బీఆర్‌ఎస్‌లో చేసిన తప్పులు ఇక్కడ చేయకుండా చూసుకోండని, అందరు ఒక కుటుంబం లాగా కలిసి పనిచేసి ప్రభుత్వాన్ని ముందుకు నడపాలన్నారు మంత్రి కొండా సురేఖ.

ఎంపీ నవనీత్‌ కౌర్‌కు బెదిరింపులు

అమరావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్ రాణాకు (Amravati MP Navneet Rana) బెదిరింపులు మహారాష్ట్రలో కలకలం రేపాయి. చంపేస్తామంటూ వాట్సప్‌లో ఆమెకు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మహారాష్ట్ర (Maharashtra)లోని అమరావతి లోక్‌సభ స్వతంత్ర ఎంపీ (Navneet Kaur Rana)కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు వచ్చాయి. చంపేస్తామంటూ వాట్సప్‌ (Whatsapp)లో ఆడియో సందేశం వచ్చింది. దీంతో ఆమె వ్యక్తిగత సహాయకుడి చేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సందేశం పంపిన వ్యక్తులు ఆమెపై అభ్యంతరకర పదజాలం వాడినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

గత ఆదివారం ఆమెకు మెసేజ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెకు పంపిన ఆడియో క్లిప్‌లో ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌లపైనా అభ్యంతరకర పదాలు ఉపయోగించినట్లు సమాచారం. దీంతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

గురువారం శ్రీనగర్‌లో ప్రధాని మోడీ పర్యటన

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిసిన దగ్గర నుంచి విరామం లేకుండా ప్రధాని మోడీ (PM Modi) దేశమంతా చుట్టేస్తు్న్నారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ.. కొత్త పనులకు శ్రీకారం చుడుతున్నారు. ఇలా నెల రోజుల నుంచి తీరిక లేకుండా ప్రధాని మోడీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం మరో రాష్ట్రంలో మోడీ పర్యటించనున్నారు.

గురువారం ప్రధాని మోడీ జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం ప్రధాని (PM Modi) మొదటిసారి కశ్మీర్ వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనున్న ‘వికసిత్‌ భారత్… వికసిత్‌ జమ్మూకశ్మీర్‌’ కార్యక్రమానికి మోడీ హాజరుకానున్నారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.

చందమామ కాజల్ కు చేదు అనుభవం..తాకరాని చోట తాకిన అభిమాని..

టాలీవుడ్ హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూనే పలు ఈవెంట్స్ మరియు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్తూ ఉంటారు.. అయితే పబ్లిక్ లో అభిమానులతో తీరుతో కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడ్డ సందర్భాలు చాలానే వున్నాయి.వచ్చిన హీరోయిన్లను చూసేందుకు, వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడటం సాధారణంగా జరిగే విషయమే… కానీ అందులో కొందరు ఆకతాయిలు విచిత్ర ప్రవర్తన హీరోయిన్లను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. హైదరాబాద్ లోని ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాజల్ తో ఓ అభిమాని అభ్యంతరకంగా వ్యవహరించారు.చూట్టూ బౌన్సర్లు ఉన్న కూడా అతడు కాజల్ ని తాకరాని చోట తాకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 

Exit mobile version