NTV Telugu Site icon

Top Headlines @9PM : టాప్ న్యూస్

Top Headlines @ 9 Pm

Top Headlines @ 9 Pm

ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది..

ఇరిగేషన్ సీఈ, ఎస్ఈలతో మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వ పాపాలు.. రైతుల పాలిట శాపాలుగా మారాయని మండిపడ్డారు. ప్రాజెక్టుల నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసింది.. జగన్ ప్రభుత్వంలో ప్రాజెక్టులు, గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి.. గత ఐదేళ్లల్లో లాకులకు గ్రీజ్ కూడా పెట్టని దుస్థితి అని ఆరోపించారు. ప్రాజెక్టుల నిర్వహణ నిమిత్తం అంచనాలు వేయమని అధికారులను ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గత ప్రభుత్వం కాల్వల్లో సిల్ట్ తీయలేదు.. తట్ట మట్టి కూడా ఎత్తలేదు.. జగన్ నిర్వాకం వల్ల వేలాది ఎకరాలు మునిగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డీసిల్టింగ్ పనులకు అంచనాలు రూపొందించాలని సూచించాం.. పట్టిసీమ నిర్వహణ లేకపోవడం వల్ల పంపులు ఆన్ చేయగానే కొన్ని ఇబ్బందులు వచ్చాయని తెలిపారు.

ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్ట్ మృతి..

పాకిస్థాన్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఐఏ) విమానాన్ని హైజాక్ చేసిన వాంటెడ్ టెర్రరిస్ట్ గజిందర్ సింగ్ (74) మరణించాడు. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. గజిందర్ సింగ్ ఒక పేరుమోసిన ఉగ్రవాది, అతను ఖలిస్తాన్ అనుకూల సంస్థ “దాల్ ఖల్సా” సహ వ్యవస్థాపకుడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-423 హైజాక్‌లో ప్రధాన కుట్రదారుల్లో ఇతను ఒకడు. శ్రీనగర్‌ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం హైజాక్‌కు గురై పాకిస్థాన్‌లోని లాహోర్‌కు దారి మళ్లించారు.

2023-24లో పెరిగిన శిశు మరణాలు

శిశు మరణాల నివారణకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నా జిల్లాలో నవజాత శిశు మరణాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సంబంధిత అధికారులు అందించిన సమాచారం ప్రకారం, జిల్లాలో 2022లో 28 నవజాత శిశువులు , శిశు మరణాలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 56 నవజాత శిశువులు , శిశు మరణాలు నమోదయ్యాయి, ఇది 100 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. ఇది 2021లో 22 మంది, 2020లో 27 మంది, 2020లో 27 మంది, 2019లో 38 మంది నవజాత శిశువులు , శిశువుల మరణాలను నమోదు చేసింది. జిల్లాలో 2019-20 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరాల వరకు మొత్తం 152 మంది నవజాత శిశువులు , శిశువులు మరణించారు.

లోక్‌సభ ఎంపీలుగా అమృతపాల్‌సింగ్, రషీద్ ప్రమాణం

ఖలిస్థాన్ వేర్పాటువాది అమృతపాల్ సింగ్, అవామీ ఇత్తెహాద్ పార్టీ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్ రషీద్ శుక్రవారం ఎంపీలుగా ప్రమాణం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో ఓం బిర్లా వీరిద్దరి చేత ప్రమాణం చేయించారు. పెరోల్‌పై వచ్చి లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. అమృతపాల్ సింగ్, ఇంజనీర్ రషీద్ ఇద్దరూ కూడా ప్రస్తుతం జైల్లో ఉంటున్నారు. జైలు నుంచే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ విజయం సాధించారు. అమృతపాల్ సింగ్(31) పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి గెలవగా.. రషీద్(56) జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా నుంచి విజయం సాధించారు. అయితే వీరిద్దరు ఎంపీలుగా ప్రమాణం చేసేందుకు స్పీకర్ ఓం బిర్లా అనుమతి ఇచ్చారు. దీంతో శుక్రవారం లోక్‌సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. జాతీయ భద్రతా చట్టం కింద అమృతపాల్ అస్సాం జైలులో ఉండగా.. ఉగ్రవాద నిరోధక చట్టం UAPA కింద అభియోగాలు మోపబడి రషీద్ ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు.

సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్

తీహార్ జైలులో ఈ ఉదయం ఎమ్మెల్సీ కవిత తో ములాఖాత్ అయ్యారు కేటీఆర్ , హరీష్ రావు. సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్ చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉంది. బెయిల్ పిటిషన్ వేసే దాకా ఢిల్లీలోనే ఉండి… న్యాయవాదుల బృందంతో సమన్వయం చేయనున్నారు కేటీఆర్, హరీష్. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు ఈ రోజు ఉదయం ములాఖాత్ అయ్యారు.. ఆమెతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని కోరారు.. న్యాయవ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు భరోసా వ్యక్తం చేశారు. హైకోర్టు ఎమ్మెల్సీ కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించిన నేపథ్యంలో…సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ.

శ్రీవారి భక్తులకు అలర్ట్.. 9, 16న బ్రేక్ దర్శనాలు రద్దు

తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. జూలై 9,16వ తేదీలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. 9వ తేదీన మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. 16 వ తేదీన ఆణివార ఆస్థానం సందర్భంగా బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. ఇదిలా ఉంటే.. తిరుమలలో నందలూరు, తాళ్ళపాక ఆలయాల బ్రహ్మోత్సవాల బుక్ లెట్ ని ఈఓ శ్యామలరావు, జేఈఓ వీరబ్రహ్మం విడుదల చేశారు. అంతేకాకుండా.. ఈఓ శ్యామలరావు పోటు కార్మికులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. లడ్డు తయ్యారీలో అనసరించే విధానాలను పిపిటి ద్వారా అధికారులు వివరించారు.

‘భారత్ గౌరవ్’ అయోధ్య-కాశీ రైలు జూలై 9న సికింద్రాబాద్ నుండి ప్రారంభం

ప్రతిస్పందనతో ప్రోత్సహించబడిన ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్‌సిటిసి ) ‘ భారత్ గౌరవ్ ‘ టూరిస్ట్ రైలును పుణ్య క్షేత్ర యాత్ర అని పేరు పెట్టింది: సికింద్రాబాద్ నుండి అయోధ్య-కాశీ ప్రారంభమవుతుంది. ప్రత్యేక రైలు జూలై 9 న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 9 రోజుల ప్రయాణం ప్రారంభమవుతుంది , గయా, వారణాసి, అయోధ్య , ప్రయాగ్‌రాజ్‌తో సహా అనేక పవిత్ర స్థలాలకు యాత్రికులను తీసుకువెళుతుంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్‌లోని రైలు ప్రయాణికులు కొత్తగా నిర్మించిన రామజన్మభూమి (అయోధ్య) , ఆధ్యాత్మిక జ్ఞానోదయం కోసం జ్యోతిర్లింగం (కాశీ విశ్వనాథ దేవాలయం) దర్శనం లేదా పిండ్ ప్రదాన్ ఆచారాలు (నివాళి అర్పించడం) కోసం ఈ పర్యటన ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని కల్పిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. వారి పూర్వీకులకు) గయా వద్ద.

అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన..

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతుంది. బడ్జెట్ కసరత్తును ఓ కొలిక్కి తేలేకపోతోంది ఆర్థిక శాఖ. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టాలా..? రెండు మూడు నెలలకు ఓటాన్ అకౌంట్ పెట్టాలా..? అనే కన్ఫ్యూజన్ లో ఆర్థిక శాఖ ఉంది. ప్రస్తుతం ప్రతిపాదనలకు పూర్తి వివరాల్లేకపోవడంతో పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం కష్టమనే భావన వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండటంతోనే సమస్య అని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారు.

చిరుత మళ్లీ వచ్చింది.. పచ్చర్లలో మహిళ, తిరుమలలో చిన్నారిని చంపింది ఒక్కటే

గతంలో తిరుమల కాలినడక మార్గంలో ఓ చిన్నారిని చిరుత చంపి తిన్న విషయం తెలిసిందే.. లక్షిత అనే ఆరేళ్ల బాలికపై దాడి చేసి అడవిలోకి లాక్కెళ్లి చంపేసింది. అయితే.. భక్తులపై దాడికి పాల్పడటంతో అటవీ అధికారులు దానిని కొన్ని రోజులకు బంధించారు. అనంతరం.. నల్లమల అభయారణ్యంలో వదిలేశారు. అయితే.. ఆ చిరుతే మళ్లీ మనుషులపై దాడి చేస్తుంది. పచ్చర్లలో మెహరున్నీసా అనే మహిళను చంపి తింది. కాగా.. ఈ చిరుతను తిరుమలలో చిన్నారిని చంపి తిన్న చిరుతగా అటవీ అధికారులు నిర్ధారించారు.

నీట్‌పై కౌంటర్.. ఆధారాలుంటే అరెస్ట్ చేయండి

నీట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఇప్పటికే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది. పలువురిని అరెస్ట్ చేసింది. ఇక ఈ వ్యవహారంపై బీహార్‌లో కాకరేపుతోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇక ఇదే అంశంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ స్పందించారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో తనపై చేస్తోన్న ఆరోపణలకు కౌంటర్‌ ఇచ్చారు. తనకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే అరెస్టు చేసుకోవాలని ఎన్డీయే ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు.