Site icon NTV Telugu

Top Headlines @9PM : టాప్‌ న్యూస్‌

Top Headlines

Top Headlines

చంద్రబాబుపై మరో కేసు నమోదు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేశారనే ఫిర్యాదుతో సీఐడీ అధికారులు నారా చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. అయితే, చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా ఇసుక అక్రమ తవ్వకాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తుంది. ఆయన ఇంటి పక్కనే అక్రమ తవ్వకాలు జరిగినా ఆయన పట్టించుకోలేదు అని సీఐడీ తెలిపింది. 2016-19 మధ్య అక్రమ మైనింగ్ కు వివిధ కేసుల్లో 40 కోట్ల రూపాయల పెనాల్టీ విధించారు.. ఈ విషయాన్ని సీఐడీ ఎఫ్ఐఆర్ లో పొందుపర్చింది. ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం చేకూర్చారని.. మైనింగ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది.

అందుకే ఒంటరిగా వెళ్ళాలని నిర్ణయిం తీసుకున్నాం

కాంగ్రెస్‌తో దోస్తీకి సీపీఎం గుడ్‌ బై చెప్పింది. పొత్తులు, అభ్యర్థులపై కాంగ్రెస్‌కు సీపీఎం డెడ్‌లైన్‌ విధించింది. అయితే… డెడ్‌లైన్‌ దాటిపోవడంతో పోటీ చేసే స్థానాల లిస్ట్‌ సీపీఎం విడుదల చేసింది. 17 మంది అభ్యర్థులతో కూడిన సీపీఎం జాబితాను సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేసిన తాత్సారం కారణంగా సీపీఎం పోటీ చేసే స్థానాల లిస్ట్ ప్రకటిస్తున్నామన్నారు. భద్రాచలంలో గత 8 పర్యాయాలు సీపీఎం గెలిచిందని, భద్రాచలం కోరాము…కానీ ఇవ్వమన్నారు… తరువాత పాలేరు అన్నాము… జాతీయ స్థాయిలో అంగీకరించారు… కానీ అది కూడా ఇవ్వామన్నారన్నారు. ఆ తరువాత వైరా, మిర్యాలగూడ అన్నారు…. అదేదో మేము పట్టు మీదున్నము అని కొన్ని పత్రికల్లో రాయించారు… చర్చ చేయించారన్నారు వీరభద్రం. మీరన్న వైరా, మిర్యాలగూడ కూడా ఇవ్వకుండా ఇప్పుడు మాట మార్చారని, మిర్యాలగూడ ఇస్తారట… మరొక సీట్ హైద్రాబాద్ లో ఇస్తారట… అంటే చంద్రయన గుట్ట ఇస్తారో ఎది ఇస్తారో క్లారిటీ లేదన్నారు.

ముదిగొండ నుంచే భట్టి విక్రమార్క ఎన్నికల ప్రచారం

ఖమ్మం జిల్లాలో ఈనెల 4న ( శనివారం ) ముదిగొండ మండలం యడవల్లి నుంచి మధిర నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి సీఎల్పీ నేత, మధిర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు. తొలుత యడవల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేసి అనంతరం ప్రచారం ప్రారంభం చేస్తారు. ఇక, మొదటి రోజు యడవల్లి, లక్ష్మీపురం(వై), మేడిపల్లి, దనియలగుడేము, కట్టకూరు, సీతారాంపురం, మాధాపురం గ్రామాల్లో భట్టి విక్రమార్క ప్రచారం సాగనుంది. తొలి రోజు ప్రచారానికి భారీ ఎత్తున ముదిగొండ మండల కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నారు.

పింగళి వెంకయ్య మనవడి భార్యపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

భారత జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య మనవడు గోపి కృష్ణ భార్యపై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. మల్కాజిగిరి డీఏపీ స్కూల్‌లో సునీత టీచర్‌గా పని చేస్తుంది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత లిఫ్ట్ దగ్గర ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడంతో.. వెంటనే స్థానికులు స్పందించి దాడి చేసిన వ్యక్తిని పట్టుకుని చితకబాది నేరేడ్‌మెట్ పోలీసులకు అప్పగించారు. ఇక, దాడి చేసిన వ్యక్తిని శ్రీకర్‌గా గుర్తించారు.

ఆ సీన్ కోసం న్యూడ్ గా నటించాను..

సత్యం రాజేశ్‌ , కామాక్షి భాస్కర్ల మరియు బాలాదిత్య ప్రధాన పాత్ర ల్లో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ మా ఊరి పొలిమేర 2.. ఈ మూవీ నవంబర్ 3 న అనగా ఈ శుక్రవారం రిలీజ్ కానున్న నేపథ్యం లో ఈ సినిమా లో కీలక పాత్ర పోషించిన సత్యం రాజేష్ కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేశారు.ఈ సినిమా లో తాను ఓ సీన్ లో నగ్నం గా నటించినట్లు ఆయన చెప్పుకొచ్చారు… పొలిమేర 1 కంటే కూడా ఎక్కువ బడ్జెట్, మరింత ఆసక్తికమైన స్టోరీతో పొలిమేర 2 రానున్నట్లు సత్యం రాజేష్ తెలిపారు.మా ఊరి పొలిమేర 2 మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజై ప్రేక్షకులను భయపెట్టింది. ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు మంచి థ్రిల్ లభిస్తుందని సత్యం రాజేష్ తెలిపారు..

మార్చి తర్వాత ఆసరా పింఛన్ 5 వేలు ఇస్తాం

ఎన్నికల్లో మంచి సాంప్రదాయం రావాలని, అబద్ధపు హామీ లు చెప్పేవారు ఎక్కువయ్యారన్నారు బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌. ఇవాళ ఆయన నిజామాబాద్ వేల్పూర్ లో ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ ల వైఖరేంటో ప్రజలకు తెలుసునని, రైతులు, పేద ప్రజల గురించి పట్టించుకునే పార్టీ లు రావాలన్నారు సీఎం కేసీఆర్‌. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమని, చర్చ జరిపి ఆలోచించి ఓటేయాలన్నారు. 50 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సబ్ స్టేషన్ల కోసం మూడేళ్లు తిరగాల్సి వచ్చేదని, దేశంలో ఎక్కడా 24 గంటల కరెంటు లేదన్నారు సీఎం కేసీఆర్‌. నరేంద్ర మోడీ కి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని, మోటర్లకు మీటర్లు పెట్టకుండా అడ్డుకున్నానన్నారు సీఎం కేసీఆర్‌.

ధరణి పోర్టల్‌తో కేసీఆర్ భూములు కాజేసింది నిజం కాదా..?

రాహుల్ గాంధీ కాళేశ్వరం పర్యటన కేవలం రాజకీయ స్వలాభం కోసం కాదన్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి మనిషిపై లక్ష కు పైగా అప్పు భారం వేసింది బీఆర్ఎస్‌ పార్టీ అని, దొంగ విత్తనాలు మూలంగా 8 మే మంది రైతు కుటుంబాల నాశనం ఐతే కేసీఆర్ నోరు మేధపని పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. అధికార మదం తో విర్రవిగుతున్న కేసీఆర్ కి సవాల్ అని, కౌలు రైతు ని మర్చిపోయింది ఈ ప్రభుత్వమన్నారు. కౌలు రైతులకు దృష్టి లో పెట్టుకుంది కాంగ్రెస్ అని ఆమె ఉద్ఘాటించారు. కాళేశ్వరం వల్ల బంగారం అంత కేసీఆర్ ఫామిలీ ఇంటికి చేరిందన్నారు రేణుకా చౌదరి. గతంలో తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పక్కన పెట్టి గెలిస్తే రైతులకి కేసీఆర్ చేసింది ఏంటి? అని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబుపై మరో కేసు.. ఫిర్యాదులో కీలక అంశాలు ఇవే..?

చంద్రబాబు పై మరో కేసు నమోదు అయింది.. ఉచిత ఇసుక విధానం పేరిట గత ప్రభుత్వంలో ఇసుక అక్రమాలపై సీఐడీకి ఫిర్యాదు చేయడంతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మాజీ మంత్రి పీతల సుజాత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, మాజీ మంత్రి దేవినేని ఉమతో పాటు మరికొందరు ఉన్నారు. ఇష్టాను సారంగా ఇసుక విధానాన్ని మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారు.. తద్వారా ప్రభుత్వానికి నష్టం కలిగించారని సీఐడీకి డీఎంజీ వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు.

చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?

నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచిన గజదొంగ ఎవరు జగన్ రెడ్డి? కదా అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?.. అధికారికంగా 110 రీచుల్లో ఇసుక తవ్వకాలు అని చెబుతూ 500కు పైగా రీచుల్లో ఇసుక దోచేయటం వాస్తవం కాదా? అని ఆయన ఆరోపించారు. ఏపీలో ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ఎన్జీటీ ఉత్వర్వులివ్వలేదా?.. వైసీపీ ఇసుక దోపిడికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి జగన్ రెడ్డి?.. ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసు పెడితే మరి పేదల కడుపు కొట్టి రూ.40 వేల కోట్లు దోచుకున్న జగన్ రెడ్డి, పెద్దిరెడ్డి, జే గ్యాంగ్ లపై ఏం కేసులు పెట్టాలి? అని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

“కాంగ్రెస్, అభివృద్ధి కలిసి ఉండవు”.. ప్రధాని విమర్శలు..

ఈ నెలలో ఛత్తీస్గడ్ రాష్ట్రంలో ఎన్నికలు ఉండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఆ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఒక గిరిజన వ్యక్తి దేశానికి రాష్ట్రపతి కావడాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ప్రధాని ఆరోపించారు.

సమాజంలో ప్రతీ వర్గానికి అభివృద్ధి, ప్రగతి లబ్ధి చేకూరుతుందనేది బీజేపీ విధానమని, చరిత్రలో తొలిసారిగా గిరిజన కుటుంబానికి చెందిన మహిళను రాష్ట్రపతి చేయాలని బీజేపీ నిర్ణయించిందని, కానీ దీన్ని కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆమెపై దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నిరసనలు బీజేపీకి మాత్రమే వ్యతిరేకం కాదని, గిరిజనులకు కూడా వ్యతిరేకమే అని కాంకేర్ లో జరిగిన ‘విజయ్ సంకల్ప్’ ర్యాలీలో ప్రధాని అన్నారు.

చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారు..

చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.. సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు.. జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై పురంధేశ్వరి మాట్లాడిన వెంటనే చంద్రబాబుపై మద్యం కేసు పెట్టారు అని ఆయన ఆరోపించారు. రెండు రోజుల క్రితం వైసీపీ చేస్తోన్న ఇసుక కుంభకోణం గురించి పురందేశ్వరి మాట్లాడితే ఇసుక కేసు కూడా పెడతారనుకున్నా, అలాగే పెట్టారు.. జగన్ చేస్తున్న అక్రమాలపై ఈడీ, సీబీఐల విచారణను పురంధేశ్వరి కోరితే.. జగన్ సీఐడీని రంగంలోకి దించుతున్నారు అని సోమిరెడ్డి మండిపడ్డారు.

దేవుడా.. గుర్తుపట్టలేకుండా మారిపోయిన పూరి.. అసలేమైంది.. ?

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. హీరోలను పోకిరీలుగా చూపించే ఏకైక డైరెక్టర్ అంటే పూరినే. అంతేకాదు.. ప్రేక్షకులకు మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. అసలు పూరి.. గోవా బీచ్ కు వెళ్లాడంటే కథ సిద్దమయ్యినట్టే.. కేవలం 40 రోజుల్లో సినిమా చేయాలంటే పూరి వలనే సాధ్యం. ఎన్నిసార్లు పడినా.. పైకి లేవడం ఆయన దగ్గరనుంచి నేర్చుకోవాలి. పడిన ప్రతిసారి పూరీ పని అయిపోయింది అనుకుంటారు. కానీ, అతను మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్లు నిలబడుతూనే ఉన్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్లాప్ లు అందుకున్న పూరి .. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఇక గతేడాది లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ను మూటకట్టుకున్నాడు. ప్లాప్ ను మాత్రమే కాదు కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూశాడు. దాన్నుంచి బయటపడడానికి ప్రస్తుతం ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా.. డబుల్ ఇస్మార్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 

Exit mobile version