20 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్‌లో తలపడుతున్న ఇంగ్లడ్ – భారత్… గెలవాలంటే 2 సవాళ్లు ఎదుర్కోవాల్సిందే ?
ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023లో భారత జట్టు తన ఆరో మ్యాచ్‌ని ఇంగ్లండ్‌తో ఆడనుంది. లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో ఆదివారం భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఇంగ్లండ్ జట్టు ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌గా ఉండగా, భారత్ రెండుసార్లు ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది. ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగింటిలో ఓడి దాదాపు సెమీఫైనల్ రేసుకు దూరమైంది. మరోవైపు భారత జట్టు వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
బాగా, ఇంగ్లాండ్ నుండి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాను దక్కించుకోలేదు. ఈ మ్యాచ్ ఓడిపోయినా ఇంగ్లండ్‌కు ఒరిగేదేమీ లేదు కాబట్టి. అది వేరే జట్ల ఆటను పాడు చేయగలదు. ప్రపంచకప్‌లో భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ ఏకపక్షం కాదు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ ఇంకా మెరుగైన గణాంకాలను కలిగి ఉంది. 8 మ్యాచ్‌ల్లో భారత్ 3, ఇంగ్లండ్ 4 గెలిచి 1 మ్యాచ్ టై అయింది. ప్రపంచకప్‌లో 2003లో ఇంగ్లండ్‌పై భారత్ చివరి విజయం సాధించింది.
బంగారం ప్రియులకు భారీ షాక్.. తులంపై ఎంత పెరిగిందంటే?
ఇటీవల తగ్గినట్టే కనిపించిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్న స్థిరంగా ఉన్న పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. ఏకంగా 10 గ్రాముల బంగారం ధరపై రూ. 600లు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో ఆదివారం (అక్టోబర్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,400 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,620గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 600 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 660 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,550లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,770గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,950గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,440 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,620గా కొనసాగుతోంది.
భారత్ లోనూ కనిపించిన ఈ ఏడాది ఆఖరి చంద్రగ్రహణం
సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం అక్టోబర్ 28, శనివారం రాత్రి 11:31 గంటలకు పాక్షికంగా ప్రారంభమైంది. ఈ గ్రహణం పూర్తిగా కాకుండా పాక్షికంగా ఏర్పడింది, దీనిని ఖండగ్రాస్ చంద్రగ్రహణం అని పిలుస్తారు. భారతదేశంలోని ప్రజలు రాత్రి 1:05 తర్వాత మాత్రమే గ్రహణాన్ని చూడగలిగారు. ఈ గ్రహణం సూతకాలం సాయంత్రం 4.05 నుండి ప్రారంభమైంది. చంద్రగ్రహణం సందర్భంగా అనేక విషయాలపై ఆంక్షలు విధిస్తారు. నిజానికి చంద్రగ్రహణాన్ని అశుభ కాలంగా పరిగణిస్తారు. అందువల్ల, సూతకం ముందు, గ్రహణం సమయంలో చాలా విషయాలపై ఆంక్షలు ఉన్నాయి. గ్రహణ కాలంలో దేవాలయాల తలుపులు కూడా మూసేస్తారు. గ్రహణ సమయంలో పూజలు కూడా నిషేధించబడ్డాయి. అయితే, ఎవరైనా పాఠపూజ చేయాలనుకుంటే, గ్రహణం సమయంలో ఏ దేవుని విగ్రహాన్ని తాకకూడదని సలహా ఇస్తారు. గ్రహణ కాలంలో మీరు ఖచ్చితంగా దేవతల మంత్రాలను జపించవచ్చు.
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సంగారెడ్డి, మెదక్ నియోజకవర్గాల్లో కార్నర్ మీటింగ్ లో ఖర్గే పాల్గొననున్నారు. సంగారెడ్డి గంజి మైదాన్ లో మధ్యాహ్నం 12 గంటలకు 30 వేల మందితో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మెదక్ లోని రాందాస్ చౌరస్తాలో మధ్యాహ్నం 3.30 గంటలకు కార్నర్ మీటింగ్ జరుగనుంది. సంగారెడ్డికి ప్రత్యేక హెలికాప్టర్ లో మల్లికార్జున ఖర్గే రానున్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీగా వెళ్లనున్నారు ఖర్గే.
నేరుగా సంగారెడ్డికి చేరుకుని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభకు హాజరై ప్రసంగిస్తారు. అక్కడ లంచ్‌ను ముగించుకుని హెలికాప్టర్‌లో మెదక్‌కు చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీ వెళ్లిపోతారు. ఇక సోమవారం (30న) జనగామ, ఆలేరు, భువనగిరి.. 31న నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కొనసాగనున్న బస్సు యాత్రలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి.
విక్రమ్ 62 వ మూవీ అనౌన్స్‌మెంట్.. వీడియో మాములుగా లేదుగా..
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ వరుస సినిమాలతో దూకుడుగా ఉన్నాడు.. ఒక సినిమా విడుల అవ్వక ముందే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. డిఫరెంట్ కథలతో జనాలను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. సినిమాలోని పాత్ర కోసం ఆయన పడే కష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు.. తమిళ్లోనే కాదు.. తెలుగులో కూడా విక్రమ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.. అందుకనే ఆయన నటించిన సినిమాలు తమిళంలోనే కాకుండా తెలుగులోనూ విడుదల అవుతుంటాయి.. తాజాగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు..
ఎస్.యు.అరుణ్‌కుమార్ దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమాలో నటిస్తున్నారు. విక్రమ్ కెరీర్‌లో ఇది 62వ సినిమా. చియాన్ 62 వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ను శనివారం వీడియో రూపంలో మేకర్స్ తెలియజేశారు. ఈ వీడియోలో పోలీస్ స్టేషన్‌లోకి వచ్చి మరీ విక్రమ్.. ఇద్దరు వ్యక్తులను కొడుతూ కనిపించారు.. ఇక విక్రమ్ ఏడో చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు..
టీమిండియాకు భారీ షాక్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం!
సొంతగడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. నేడు ఇంగ్లండ్‌తో జరగనున్న మ్యాచ్ కోసం శనివారం లక్నోలో ప్రాక్టీస్ చేసిన హిట్‌మ్యాన్‌కు గాయమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం కారణంగా ఈరోజు మధ్యాహ్నం ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు రోహిత్ దూరంగా ఉంటాడని సమాచారం తెలుస్తోంది.
ఇంగ్లండ్ మ్యాచ్ కోసం శనివారం రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశాడు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బౌలర్ విసిరిన బౌన్సర్ రోహిత్ కుడి చేతి మణికట్టుకు బలంగా తాకినట్లు తెలుస్తోంది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిలలాడిన హిట్‌మ్యాన్‌కు ఫిజియోలు చికిత్స చేశారు. ఆపై రోహిత్ ప్రాక్టీస్‌ను ఆపేసి మైదానాన్ని వీడాడట. రోహిత్ గాయానికి సంబంధించి బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే రోహిత్ గాయం చిన్నదే అయినా.. ముందుజాగ్రత్తలో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌కు దూరం అవుతాడని తెలుస్తోంది.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంలో ఇప్పటివరకు 9000మృతి.. నెతన్యాహు ఏమన్నాడంటే?
గత మూడు వారాలుగా ఇజ్రాయెల్, హమాస్‌లు పరస్పరం బాంబు దాడులు చేసుకుంటున్నాయి. ఈ యుద్ధంలో మృతుల సంఖ్య 9000 దాటింది. ఈ యుద్ధం రెండవ దశ ప్రారంభమైందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఈ దశ ఖచ్చితంగా సుదీర్ఘమైనది. కష్టాలతో నిండి ఉంటుంది కానీ మన సైన్యం వెనక్కి తగ్గకూడదు ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు. శుక్రవారం అర్ధరాత్రి గాజాపై జరిగిన భారీ బాంబు దాడి గురించి నెతన్యాహు మాట్లాడుతూ, నిన్న సాయంత్రం మన సైన్యం గాజాలోకి ప్రవేశించిందని అన్నారు. ఇది ఈ యుద్ధం రెండవ దశ ప్రారంభం, దీని లక్ష్యం హమాస్ దళాలను నాశనం చేయడం. మన బందీలను సురక్షితంగా తిరిగి తీసుకురావడం. వార్ క్యాబినెట్, సెక్యూరిటీ క్యాబినెట్ సమావేశంలో మేము ఏకగ్రీవంగా గ్రౌండ్ కార్యకలాపాలను విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాము.
నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. కోదాడ, తుంగతుర్తి, ఆలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో ఆయన ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 1.40 గంటలకు కోదాడ చేరుకుని 1.50 గంటలకు ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం 2.30 గంటలకు సీఎం కేసీఆర్ కోదాడ నుంచి బయలుదేరి తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరికి చేరుకుని అక్కడ మధ్యాహ్నం 3.10 గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
