నేడు ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశం.. కీలక అంశాలపై చర్చ..!
నేడు ఎన్డీయే కూటమికి చెందిన ముఖ్యమంత్రుల, డిప్యూటీ సీఎంల కీలక సమావేశం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ మీటింగ్ జరగనుంది. సుపరిపాలన, ఉత్తమ పద్ధతులపై ఎన్డీయే సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ప్రధాని చర్చించనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షాతో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుంచి 20 మంది ముఖ్యమంత్రులు, 18 మంది డిప్యూటీ సీఎంలు హాజరవుతారు.
కుప్పంలో సీఎం చంద్రబాబు గృహప్రవేశం..!
చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు (ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం పది గంటలకు శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురంలో నిర్మించిన ఆయన కొత్త ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇప్పటికే కుప్పానికి చేరుకున్నారు. ఈ గృహప్రవేశాన్ని పురస్కరించుకుని సీఎం ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అతిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పెద్ద షెడ్లు, పార్కింగ్ ఏర్పాట్లు, వసతి ఏర్పాట్లు చేశారు.
తిరుమలలో భారీగా భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం..!
తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకీ పెరుగుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి దేశం నలుమూలల నుండి వచ్చిన భక్తులతో తిరుమల మళ్లీ కిక్కిరిసి పోతోంది. ప్రస్తుతం సర్వదర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. వీటి వెలుపల కూడా వేలాది మంది భక్తులు క్యూలైనులో వేచి ఉన్నారు. సర్వదర్శనం పొందేందుకు భక్తులకు సుమారు 24 గంటల సమయం పడుతోంది.
ఢిల్లీలో భారీ వర్షాలు.. నిలిచిపోయిన 100కి పైగా విమానాలు, జలమయమైన నగరం!
దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కురిసిన వర్షం దెబ్బకు పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అయితే, ఢిల్లీ- ఎన్సీఆర్ లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో ఉదయం పూట నగరంలోని ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. అయితే, మరోవైపు ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ వర్షం కారణంగా సుమారు 100కి పైగా విమానాల సేవలు నిలిచిపోయాయి. మరో 25కి పైగా విమానాలను దారి మళ్లించారు. ఇక, ప్రయాణికులు తమ తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని ఢిల్లీ ఎయిర్ పోర్టు ఆథారిటీ కోరింది.
ఇంస్టాగ్రామ్ పరిచయం.. రెండు ప్రాణాలు బలి..!
సోషల్ మీడియా వేదికగా ఇంస్టాగ్రామ్ ద్వారా మొదలైన పరిచయం ఇద్దరి జీవితాలను అర్ధాంతరంగా ముగిసేలా చేసింది. శ్రీకాళహస్తికి చెందిన యువకుడు సురేశ్, విశాఖపట్నానికి చెందిన వివాహిత పద్మ మధ్య ఇంస్టాగ్రామ్‌లో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వీరి సంబంధం పెరిగి చివరకు.. పద్మ తన భర్త, పిల్లలను విడిచిపెట్టి శ్రీకాళహస్తిలోని కైలాసగిరి కాలనీలో గత 9 నెలలుగా సురేశ్‌తో కాపురం చేస్తోంది. అయితే, ఈ దంపతుల మధ్య ఇటీవల తరచుగా గొడవలు జరుగుతున్నట్టు సమాచారం.
పవార్, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది..
భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కానీ, అలాంటివి జరిగే ప్రసక్తే లేదన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయితే, ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే తాజాగా మాట్లాడుతూ.. ఠాక్రే బ్రాండ్ అంతం చేయాలని బీజేపీ ట్రై చేస్తుంది.. అది అంత ఈజీ కాదు.. ఠాక్రే బ్రాండ్ విషయానికి వస్తే నా తాత ప్రభోదంకర్ ఠాక్రే మహారాష్ట్రపై తొలుత ప్రభావాన్ని చూపించారు.. ఆ తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే, తరువాత నా తండ్రి శ్రీకాంత్ ఠాక్రే తమదైన ముద్ర వేశారని చెప్పుకొచ్చారు. అనంతరం, ఠాక్రే వారుసులమైన నేను, ఉద్దవ్ ఠాక్రే మా సత్తా ఏంటో చూపించాం అని వెల్లడించారు.
నేడు తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని కాలేజీల్లో 2025–2026 విద్యా సంవత్సరానికి బీఈ, బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించిన టీఎస్ ఈసెట్ (TS ECET) పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కాబోతున్నాయి. ఈ మేరకు ఈసెట్ కన్వీనర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ప్రకటన విడుదల చేశారు. ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో మే 25న మధ్యాహ్నం 12:30 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ హాజరుకానున్నారు.
పాక్ ఉగ్రవాద దేశం.. ఈసారి దాడి చేస్తే.. నాశనం చేస్తాం!
పాకిస్తాన్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో ఏడుగురు సభ్యుల బృందం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. గత చాలా సంవత్సరాలుగా భారతదేశం ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేయడానికి మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపిందన్నారు. ఉగ్రవాద దేశం వల్ల మేము చాలా మంది అమాయక ప్రాణాలను కోల్పోయామని పేర్కొన్నారు. ఈ సమస్య పాకిస్తాన్ నుంచి మాత్రమే ఉద్భవిస్తుందని తెలిపారు. పాకిస్తాన్ ఈ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడంఆపివేసే వరకు ఈ సమస్య తొలగిపోదని ఒవైసీ అన్నారు.
తాళి కట్టే సమయంలో ఝలక్ ఇచ్చిన పెళ్లికూతురు.. చివరకు లవర్‌తో..!
గత కొంతకాలంగా వివాహ వేడుకల్లో ఊహించని ఘటనలు జరగడం సామాన్యమైపోయింది. వధూవరులు చివరి నిమిషంలో తమ మనసులోని భావాలను బయటపెట్టి పెళ్లి మండపం పైనే సంచలనాలు సృష్టిస్తున్నారు. ఒకవైపు కుటుంబాలు ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటే, మరోవైపు వధూవరుల వ్యక్తిగత నిర్ణయాలు పెళ్లి తంతును నాశనం చేస్తున్నాయి. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఒక పెళ్లి ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని ఆది చుంచనగిరి కళ్యాణమండపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వధూవరుల పెళ్లి కోసం కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేడుకలన్నీ ఘనంగా నిర్వహించారు. కళ్యాణ మండపాన్ని అద్భుతంగా అలంకరించారు. అతిధుల కోసం విందు భోజనాలు సిద్ధం చేశారు. వధూవరులు కొత్త దంపతుల్లా మెరిసిపోతున్నారు. అన్ని అనుకున్నట్టే జరిగిపోతున్నాయి.. కానీ, కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి అచ్చం
ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో నేషనల్ క్రష్ ..?
ప్రజంట్ ఇండియన్ సినిమా దగ్గర రాబోతున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు ప్రశాంత్ నీల్-టాలెంటెడ్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్‌ల కలయికలో చేస్తున్న సినిమా కూడా ఒకటి. కాగా ఈ చిత్రం ఎపుడో అనౌన్స్ అవ్వగా ఇపుడు ఫైనల్‌గా పట్టాలెక్కింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇక రీసెంట్ గానే ఎన్టీఆర్ సెట్స్‌లోకి జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చేశాడు. గుర్తుపట్టలేనంతగా బక్క చిక్కి స్లిమ్ లుక్‌లోకి మారిపోయాడు. ఇక ఎన్టీఆర్ ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్‌ను ఫినిష్ చేసుకున్నాడని సమాచారం. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది..
