పిట్‌బుల్ సహా విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫారసు..
పలు విదేశీ కుక్క జాతులను నిషేధించాలని కేంద్రం సిఫార్సు చేసింది. పెటా ఇండియా అభ్యర్థన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇల్లిగల్ ఫైటింగ్, దాడులకు ఎక్కువగా ఉపయోగించే విదేశీ కుక్క జాతుల అమ్మకం, పెంపకం లేదా వాటిని కలిగి ఉండటంపై నిషేధం విధించాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు బుధవారం లేఖ రాసింది. మానవుకులు ప్రమాదాలను తీసుకువస్తున్న పిట్ బుల్స్ వంటి ప్రమాదకరమైన జాతులను నిషేధించాలని కేంద్రం భావిస్తోంది. మానవ ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన పిట్ బుల్స్, ఇతర జాతుల అమ్మకం, పెంపకం కోసం ఎలాంటి లైసెన్సులు జారీ చేయకుండా చూసుకోవాలని పశుసంవర్ధక మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది.
మగువలకు అదిరిపోయే గుడ్ న్యూస్… భారీగా తగ్గిన ధరలు.. ఎంతంటే?
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరపై రూ 400 తగ్గింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,350గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.65,840 గా ఉంది.. ఇక వెండి కూడా రూ.1000 రూపాయలు తగ్గి రూ.78,500తో వద్ద కొనసాగుతుంది.. ఇక ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.60,350 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.65,840 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.61,100 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.66,650తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.60.350 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.65,840 గా ఉంది.. న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,500ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.65,990గా నమోదైంది.. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.60,350తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.65,840 వద్ద నమోదు అవుతుంది..
ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే ఛాన్స్..
తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో (గురువారం) ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు గత నెల 19న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను టీఎస్పీఎస్సీ స్వీకరిస్తోంది. అయితే, ఇప్పటి వరకు 2.7 లక్షలకు పైగా మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు TSPSC అధికారులు వెల్లడించారు.
కాగా, గ్రూప్-1 పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియనున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 5 గంటలలోపు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ సూచించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్నట్టు తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇక, ఇవాళే.. చివరి రోజు కాబట్టి ఒక్క రోజులో ఎంతలేదన్నప్పటికీ మరో 50 వేల దరఖాస్తులు మాత్రమే వచ్చే అవకాశం ఉంది.
అణుదాడికి సంకేతాలు ఏమి లేవు.. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా..
రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు.
రష్యా ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు ఎలాంటి సూచనలు లేవని జిన్ పియర్ చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా క్రూరంగా దాడి చేసిందని, రష్యా దురాక్రమణ నుంచి తమ ప్రజలను, భూ భాగాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు ఇస్తామన్నారు.
బుధవారం రష్యా అధినేత పుతిన్ మాట్లాడుతూ.. ఆ దేశ అణ్వాయుధ శక్తిని ప్రశంసించారు. తమ దేశానికి ముప్పు వాటిల్లితే అణు ఆయుధాలను మోహరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. రష్యాలో త్వరలో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో పుతిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని అమెరికా అభిప్రాయపడుతోంది. మరో ఆరేళ్ల పాటు అధికారంలో ఉండేందుకు పుతిన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు ఉక్రెయిన్‌కి మద్దతుగా మరో 300 మిలియన్ డాలర్ల అత్యవసర ఆయుధ ప్యాకేజీ ఇవ్వనున్నట్లు మంగళవారం అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించారు. అయితే, యూఎస్ కాంగ్రెస్ దీన్ని అడ్డుకుంది.
నేడు జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి నివేదిక..
మరి కొద్ది రోజుల్లో భారత్లో ఏకకాలంలో లోక్‌సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు గల సాధ్యాసాధ్యాల పరిశీలనకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ఇవాళ (గురువారం) నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఒకే దేశం- ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణ మన దేశంలో ఎంత వరకు సాధ్యం, ఇతర అంశాలపై వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలను సేకరించిన కోవింద్ కమిటీ నేడు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రిపోర్టును సమర్పిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
కాగా, జమిలి ఎన్నికలకు రాజ్యాంగంలోని ఆఖరి ఐదు అధికరణలను సవరించాలని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కమిటీ సూచించినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు ఒకే ఓటరు లిస్టు ఉంచే విషయంపై కూడా కమిటీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఇక, ఇప్పటికే దేశంలోని పలు అధికార, విపక్ష పార్టీల నుంచి, లా కమిషన్, ఇతర ముఖ్య సంస్థల నుంచి ఈ కమిటీ అభిప్రాయాలను తీసుకుంది.
నేడు బీసీ నేస్తం నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
మహిళల ఆర్థిక స్వావలంభన లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది. బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ మహిళలకు భరోసానిచ్చేలా వైఎస్ఆర్ చేయూత, కాపు మహిళల అభ్యున్నతికి కాపు నేస్తం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేద మహిళలకు ఈబిసి పథకాన్ని రూపొందించింది. అగ్ర వర్ణాలలోని పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, వెలమ తదితర అగ్రవర్ణ కులాల పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ పథకం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయనున్నారు. మొత్తం మూడు సంవత్సరాలలో రూ 45 వేలు జమ చేయనున్నారు. ఈ నెల 14 న అనగా నేడు మూడవ విడత కార్యక్రమాన్ని కేంద్రంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు.
మహిళల ఆర్థిక స్వావలంభన లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం అడుగులు వేసింది. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తోంది. బీసీ, ఎస్ సి, ఎస్ టి, మైనారిటీ మహిళలకు భరోసానిచ్చేలా వైఎస్ఆర్ చేయూత, కాపు మహిళల అభ్యున్నతికి కాపు నేస్తం అమలు చేస్తున్న ప్రభుత్వం తాజాగా అగ్రవర్ణ పేద మహిళలకు ఈబిసి పథకాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. అగ్ర వర్ణాలలోని పేద మహిళలకు మెరుగైన జీవనోపాధి, ఆర్థిక సాధికారతే లక్ష్యంగా రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, ఆర్య వైశ్య, వెలమ తదితర అగ్రవర్ణ కులాల పేద మహిళలకు వైఎస్సార్ ఈబీసీ పథకం తీసుకొచ్చారు. ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున లబ్ధిదారుల ఖాతాలలో జమ చేస్తున్నారు.
కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికి ఇస్తున్నారు..? లిస్ట్ లో మీ పేరు ఉందా?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆరు హామీ పథకాల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పథకాల అమలుకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా కొత్త రేషన్‌కార్డుల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. గత డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజా పాలన కార్యక్రమం ద్వారా గ్రామ, పట్టణ, వార్డు సభల్లో మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత పథకాలు, ఇందిరమ్మ ఇల్లు పథకాలకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే ఈ పథకాల అమలుకు రేషన్ కార్డులే ప్రామాణికం కావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ త్వరలో రేషన్ కార్డులు అందుతాయని శుభవార్త అందించారు. ఇక అభయహస్తంలో పేర్కొన్న ఆరు హామీలను అమలు చేస్తామని… తెల్ల రేషన్ కార్డులపై మంత్రివర్గంలో చర్చించామన్నారు. అయితే.. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వకపోవడంతో చాలా మంది ఆరు హామీ పథకాలకు దూరమవుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన శుభవార్త విని సంతోషిస్తున్నాను. రాష్ట్రంలో ఇంకా 90 లక్షల రేషన్ కార్డులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రజా పాలన కార్యక్రమం ద్వారా 20 లక్షల మందికి పైగా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం.
నేడు గంటా శ్రీనివాసరావు నివాసంలో కీలక సమావేశం
గంటా శ్రీనివాసరావు నివాసంలో నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యనేతలతో రాజకీయ భవిష్యత్‌పై గంటా శ్రీనివాస రావు చర్చించనున్నారు. చీపురుపల్లి నుంచి మంత్రి బొత్సపై పోటీ చేయాలని గంటాకు హైకమాండ్ ఆదేశం పంపింది. అయితే.. నిన్న చంద్రబాబును కలిసిన గంటా శ్రీనివాస రావు విశాఖ జిల్లాలో సీటు ఇవ్వాలని కోరారు. పోటీ చేస్తే చీపురుపల్లి లేదంటే పార్టీ కోసం పనిచేయాలన్న హైకమాండ్ చెప్పడంతో… చీపురుపల్లి పోటీపై ఆసక్తి చూపట్లేదు. ఈ నేపథ్యంలోనే అనుచరులతో సమావేశం తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు గంటా.
‘ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న మాట వాస్తవమే. కానీ, ఈసారి గెలిచిన చోట నుంచే మళ్లీ పోటీ చేయాలనుకున్నా’ ఇది మారిన గంటా స్వరం. ఈ క్రమంలో పదే పదే చంద్రబాబును కలుస్తూ.. తాను చీపురుపల్లిలో పోటీకి సిద్ధంగా లేనని, కాదని బలవంతంగా పోటీకి దించితే ఫలితం మరోలా ఉండొచ్చని మొరపెట్టుకున్నారు. కానీ, చంద్రబాబు మాత్రం గంటాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా బుధవారం కూడా ఆయన చంద్రబాబును కలిశారు. తన నిర్ణయాన్ని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో.. గంటా శ్రీనివాస్ ఇవాళ తన రాజకీయ భవిష్యత్తుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి.
పడిపోతున్న స్టాక్ మార్కెట్.. రికార్డులు నమోదు చేస్తున్న బిట్ కాయిన్
ఒకవైపు భారత స్టాక్ మార్కెట్ పతనమవుతుండగా.. మరోవైపు క్రిప్టోకరెన్సీ మార్కెట్ బూమ్ చూస్తోంది. బిట్‌కాయిన్ రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వర్చువల్ కరెన్సీ బిట్‌కాయిన్ ధరల పెరుగుదల ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో దాని ధర మొదటిసారిగా 73,000డాలర్లు అంటే రూ. 60,50,659కి చేరుకుంది. బిట్ కాయిన్ ధర ఈ స్థాయిని దాటడం ఇదే తొలిసారి. బుధవారం భారతీయ పెట్టుబడిదారులకు చాలా భయానక రోజు. బుధవారం డిసెంబర్ 2022 తర్వాత ఇదే అతిపెద్ద సింగిల్ డే పతనం. ఈ భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్లు రూ.14 లక్షల కోట్ల మేర నష్టపోయారు. బిట్‌కాయిన్ ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుందాం.
