NTV Telugu Site icon

Top Headlines @9AM : టాప్‌ న్యూస్‌

Top Headlines@9am

Top Headlines@9am

పండుగవేళ దిగొచ్చిన బంగారం ధర.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే?

బంగారం, వెండి ధరలకు మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది..వివాహాది శుభకార్యాలు, పండుగల సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ప్రత్యేకించి దీపావళి సమయంలో బంగారం, వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు.. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి.. ఈరోజు బంగారం ధరలను చూస్తే..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,600 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 24 క్యారెట్లపై 490 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి.. 73,000 లుగా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

*. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,750 గా ఉంది.
*. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,600వద్ద కొనసాగుతుంది..
*. కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,550, 24 క్యారెట్లు రూ.60,630 గా కొనసాగుతుంది..

*. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.60,600గా నమోదు అయ్యింది..

*. బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630గా ఉంది..

*. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.60,630 గా ఉంది..

నేడు నెదర్లాండ్స్‌తో భారత్‌ ఢీ.. తుది జట్టులో రెండు మార్పులు?

వన్డే ప్రపంచకప్‌ 2023లో జోరుమీదున్న భారత్‌ తన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నేడు నెదర్లాండ్స్‌తో తలపడనుంది. సెమీస్‌ స్థానాన్ని ఇప్పటికే ఖాయం చేసుకున్న టీమిండియా.. వరుసగా తొమ్మిదో విజయంపై కన్నేసింది. ట్రోఫీయే లక్ష్యంగా సాగుతున్న భారత్‌.. మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీపావళి రోజు భారత్ ఎలా వెలుగులు విరజిమ్ముతుందో చూడాలి. ఈ మ్యాచ్‌లో గెలిస్తే కొత్త ఘనత నమోదవుతుంది. 2003 ప్రపంచకప్‌లో భారత్‌ వరుసగా 8 మ్యాచ్‌లు నెగ్గింది. మరోవైపు స్వదేశానికి వెళ్లిపోయే ముందు గట్టి పోటీ ఇవ్వాలని నెదర్లాండ్స్‌ భావిస్తోంది.

భారత తుది జట్టులో మార్పులు జరుగుతాయా? అన్నది ఆసక్తికరంగా మారింది. జోరుమీదున్న బ్యాటర్లకు విశ్రాంతినిచ్చే అవకాశం లేదు. కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే చెప్పాడు. ఎలాంటి ప్రయోగాలు ఉండవని కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కూడా స్పష్టం చేశాడు. అయితే జట్టులో 1-2 మార్పులను కొట్టిపారేయలేం. జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చి.. ప్రసిద్ధ్‌ కృష్ణ, ఆర్ అశ్విన్‌లను తీసుకోవచ్చు. భారత్ బాగా ఆడుతున్నా.. సూర్యకుమార్‌ యాదవ్ ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. సూర్య ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో 21.25 సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో అతడు ఫామ్ అందుకోవడానికి నెదర్లాండ్స్‌ మాక్ చక్కటి అవకాశం.

కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ.. గువ్వల బాలరాజు నుదిటిపై గాయాలు..!

నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అచ్చంపేటలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఘర్షణ వాతావరణ చోటుచేసుకుంది. ఘర్షణలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణలో గువ్వల బాలరాజు నుదిటిపై గాయలయ్యాయంటు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓ వాహనంలో డబ్బుల బ్యాగ్ లను తరలిస్తున్నారనే సమాచారంతో కాంగ్రెస్ నేతలు వెంబడించారు. ఆ వాహనం గువ్వల బాలరాజు ఉన్న ప్రాంతానికి వెళ్లి ఆగిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. టవెరా వాహనం అద్దాలను కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి గువ్వల బాలరాజు రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తూ డబ్బులు పంచుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ ఆరోపిస్తున్నారు. స్థానిక పోలీసులు, గువ్వల గన్ మెన్ లు, గువ్వల ఎస్కార్ట్ పోలీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కు సపోర్ట్ చేస్తున్నారంటూ వంశీకృష్ణ ఆగ్రహించారు. ఈ ఘటన పై రాష్ట్ర ఎన్నికల కమీషన్ చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ కోరుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు.

నడుచుకుంటూ వెళుతున్న వారిపై దూసుకెళ్లిన బొలెరో.. ముగ్గురు మృతి!

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై ఓ బొలెరో క్యాంపర్ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కాగా.. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద బొలెరో క్యాంపర్ వాహనం బీభత్సం సృష్టించింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిపై బొలెరో దూసుకెళ్లింది. అంతేకాదు ఎదురుగా వస్తున్న మరో కారును కూడా ఢీ కొట్టింది. ఈ ఘటనలో పాదచారులు ముగ్గరు మరణించారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

మోడీ సభలో యువతి హల్ చల్ .. వీడియో వైరల్

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో జరుగుతున్న మాదిగ విశ్వరూప మహాసభకు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఎస్సీ వర్గీకరణపై త్వరలో కమిటీ వేస్తామన్నారు. ఇక నుంచి తాను మంద కృష్ణ మాదిగ ఉద్యమంలో ఒకడినని పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ నాయకుడిగా ఉండి ఉంటే ఆమెకు సహాయకుడిగా ఉండేవారని అన్నారు. ప్రధాని మాట్లాడుతుండగా కొన్ని సెకన్ల పాటు సభలో గందరగోళం నెలకొంది. ఒక అమ్మాయి త్వరగా లైట్ టవర్ ఎక్కడం ప్రారంభించింది. ప్రధాని మాట్లాడుతుండగా.. తెల్లటి దుస్తులు ధరించిన ఓ యువతి వీపుపై బ్యాగ్ పెట్టుకుని టవర్ ఎక్కింది. ప్రధానితో మాట్లాడేందుకు ఆమె టవర్ ఎక్కారు. ఇంతలో ప్రధాని మోడీ వెంటనే అలర్ట్ అయ్యారు. దిగి రావాలని కోరారు. పలుమార్లు విజ్ఞప్తి చేశారు. ఇలా చేయకూడదని మంచిది కాదని, షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని ప్రదాని సూచించారు.

మాస్‌ మహరాజా అభిమానులకు దీపావళి కానుక

మాస్ మహారాజా రవితేజ తదుపరి చిత్రం ఈగల్‌. తాజాగా చిత్రబృందం ఓ అద్భుతమైన టీజర్‌ని విడుదల చేసి సినీ అభిమానులను ఆకట్టుకుంది. అద్భుతమైన విజువల్స్, పవర్ ప్యాక్డ్ యాక్షన్ గ్లింప్స్, రవితేజ అద్భుతమైన లుక్స్ కీలక హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటి వ‌ర‌కు ఈ టీజ‌ర్ యూట్యూబ్‌లో 10 మిలియ‌న్ల‌కు పైగా వ్యూస్ సాధించింది. ఇప్పుడు, దీపావళి సందర్భంగా ఇవాళ ఉదయం 11:25 గంటలకు ప్రత్యేక అప్‌డేట్‌ను ఆవిష్కరించనున్నట్లు బృందం తెలియజేసింది. ఇది మొదటి సింగిల్ గురించి ఉంటుందా లేదా ఇది ప్రత్యేక సంగ్రహావలోకనం అవుతుందా? అన్నది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. కార్తీక్ గడ్డంనేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎప్పటినుండో అందాల సుందరి అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటించింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో కావ్యా థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దావ్‌జాంద్ సంగీతం అందించారు. ఈగల్‌ మూవీ 13 జనవరి 2024న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు.