ఉక్రెయిన్‌పై రష్యా 10 క్రూయిజ్ క్షిపణులతో దాడి.. ఐదుగురు మృతి.. ఆగ్రహించిన జెలెన్ స్కీ
పశ్చిమ ఉక్రెయిన్‌లోని ఒక నగరంపై రష్యా గురువారం క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో ఒక భవనంలో కనీసం ఐదుగురు మరణించారు. గతేడాది క్రెమ్లిన్ సైన్యం దేశంపై దాడి చేసినప్పటి నుండి ఎల్వివ్‌పై ఇది అత్యంత ఘోరమైన దాడి అని అధికారులు తెలిపారు. రాత్రి జరిగిన దాడిలో నివాస భవనం భారీగా ధ్వంసమైంది. ఈ ఘటనలో 36 మంది గాయపడ్డారు. చనిపోయిన ఐదుగురిలో 21 ఏళ్ల వ్యక్తి, 95 ఏళ్ల మహిళ ఉన్నారని ఎల్వివ్ గవర్నర్ మాక్సిమ్ కోజిట్స్కీ తెలిపారు. వృద్ధురాలు రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలతో బయటపడిందని, అయితే ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఆమె తట్టుకోలేకపోయిందని కోజిట్స్కీ చెప్పారు.
భారత నర్సింగ్ విద్యార్థిని సజీవ సమాధి.. ప్రేమను తిరస్కరించిందని ప్రియుడి ఘాతుకం..
ఆస్ట్రేలియా లోని 21 ఏళ్ల భారతీయ నర్సింగ్ విద్యార్థిని జాస్మీన్ కౌర్ ను ఆమె మాజీ లవర్ దారుణంగా హత్య చేశాడు. 2021లో ఆమె లవర్ తారిక్‌జోత్ సింగ్ ఆమెను కిడ్నాప్ చేసి ప్రాణం ఉండగానే పూడ్చి పెట్టాడు. ప్రతీకారంతో తారిక్‌జోత్ సింగ్ యువతిని దారుణంగా హత్య చేసిన కేసును అక్కడి కోర్టు బుధవారం విచారించింది. అడిలైడ్ నగరంలో నివాసం ఉంటున్న జాస్మీన్ కౌర్ ని తానే హత్య చేసినట్లు బుధవారం కోర్టు విచారణలో తారిక్‌జోత్ సింగ్ అంగీకరించాడు.
21 ఏళ్ల కౌర్‌ని మార్చి 5, 2021న తారిక్‌జోత్ సింగ్ ఆమె ఆఫీస్ నుంచి కిడ్నాప్ చేశాడు. తన స్నేహితుడి కారుని తీసుకుని, కారు డిక్కీలో జాస్మీన్ కౌర్ ని బంధించాడు. దాదాపుగా 650 కిలోమీటర్లు ప్రయాణించి దక్షిణ ఆస్ట్రేలియాలోని మారుమూల ప్లిండర్స్ రేంజ్ కి తీసుకెళ్లాడు. అక్కడ యువతి గొంతు కోసి, ఆ తరువాత తాడుతో కట్టేసి సజీవంగా సమాధి చేశాడు. ఈ ఘటనను విచారించిని సుప్రీంకోర్టు ఈ హత్యను అత్యంత దారుణమైనదిగా పేర్కొంది.
రాష్ట్రంలో నేడు భారీ వర్షాలు.. హైదరాబాద్‌లో సాయంత్రం వర్షం కురిసే అవకాశం..?
ఇప్పటికే తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో అక్కడక్కడ వానలు కురుస్తుండగా, గత కొన్ని రోజులుగా పలు జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. అయితే నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయి. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ములుగు, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు. అలాగే రేపటి నుంచి 11వ తేదీ వరకు రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురుస్తాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
వరంగల్‌కు కిషన్ రెడ్డి.. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోనున్న కేంద్రమంత్రి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ ఉదయం వరంగల్‌లో పర్యటించనున్నారు. రేపు పీఎం మోడీ వరంగల్ పర్యటనకు రానున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి వరంగల్ కు బయలుదేరారు. ఇవాల ఉదయం కిషన్ రెడ్డి తన నివాసంలో పూజలు చేసిన అనంతరం వరంగల్ బయలు దేరారు. వరంగల్ లో కొలువైన భద్రకాళి అమ్మ వారిని కిషన్ రెడ్డి దర్శించుకోనున్నారు. భద్రాకాళి అమ్మవారి దర్శనం అనంతరం ఆర్ట్స్ కళాశాల మైదానంలో మోడీ ప్రసంగించే సభ స్థలిని పర్యవేక్షించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. బీజేపీ కార్యకర్తలకు, సభకు హాజరయ్యా ప్రజలకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా చూడాలని అధికారలును సూచించనున్నారు. కిషన్ రెడ్డి వరంగల్ రానున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాకాళి అమ్మవారి ఆలయం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రయాణికులు ఇబ్బందులు గురికాకుండా ముందస్తు ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని అధికారులు కోరారు.
నిద్రలో కూడా దాని గురించే ఆలోచిస్తా.. హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్లలో అదరగొట్టిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. జులై 12 నుంచి ప్రాంరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలోని ఐదు టీ20 సిరీస్ కోసం అతడిని భారత జట్టులోకి తీసుకుంది. తిలక్ బ్యాట్‌తో బాదడంతో పాటు.. బంతితోనూ మాయ చేయగలడు. అయితే రాత్రి 8 గంటలకు తన చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసి చెప్తేనే తాను భారత టీ20 జట్టుకు ఎంపికయ్యానని తెలిసిందని అతడు వెల్లడించాడు.
తాజాగా హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్నా. పగలు న ఫోన్ స్విచ్ఛాఫ్ ఉంటోంది. రాత్రి 8 గంటల సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసి.. భారత జట్టుకి ఎంపికయ్యావని చెప్పాడు. అప్పుడే విషయం నాకు తెలిసింది. చాలా సంతోషించా. టీమిండియాకు ఎంపికయ్యానని తెలిసి మా అమ్మా-నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. వీడియో కాల్‌లో మాట్లాడితే చాలా భావోద్వేగానికి గురయ్యారు. నా కోచ్ సలాం బయాష్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు’ అని తెలిపాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో పిడుగుపాటు.. ఏడుగురు మృతి
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో పిడుగులపాటు కారణంగా ఇద్దరు చిన్నారులతో సహా ఏడుగురు మరణించారు. బుదౌన్, ఇలాహ్, రాయ్ బరేలీ జిల్లాల్లో పిడుగుపాటు ఘటనలు నమోదయ్యాయి. గురువారం వివిధ ప్రాంతాల్లో జరిగిన పిడుగుపాటు ఘటనల వల్ల ఏడుగురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. బబ్లూ (30), వర్జిత్ యాదవ్ (32) ఇద్దరు రైతులు ఉషైత్ బజార్ నుంచి బైకుపై ఇంటికి తిరిగి వస్తుండగా.. భారీవర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. అదే ప్రాంతంలో అన్షిత(11) పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా పిడుగుపాటుతో మరణించింది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పుల పరిహారం ప్రకటించారు.
మొదట శివసేన, ఇప్పుడు ఎన్సీపీ, తర్వాత మహారాష్ట్రను బీజేపీ విడగొడుతుంది..
మహరాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. కొన్నాళ్లుగా మహారాష్ట్రలో శివసేన అంశంపై రాజకీయాలు నడుస్తుంటే.. తాజాగా ఎన్సీపీలో చీలిక తాజా అంశంగా మారింది. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కి షాక్ ఇస్తూ అజిత్ పవార్ అసమ్మతి గళమెత్తాడు. బీజేపీ-శివసేన(ఏక్ నాథ్ షిండే) ప్రభుత్వంలో ఎన్సీపీ పార్టీ చేరింది. అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా, మరో 8 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రభుత్వంలో చేరారు. మహారాష్ట్రలో ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో 40 మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వర్గానికి సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే గురువారం బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ ముందుగా శివసేనను విచ్ఛిన్నం చేసిందని, ఇప్పుడు ఎన్సీపీని విడగొట్టిందని, తర్వాత మహారాష్ట్రను విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటోందని అన్నారు. బీజేపీ మహారాష్ట్రకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారిపై దాడి చేసినందుకు అరెస్టయిన నలుగురు కార్యకర్తలను ఉద్దేశించి ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగించారు. బాంద్రా ఈస్ట్ లో పార్టీకి సంబంధించిన కార్యాలయాన్ని కూల్చివేడం వెనక బీఎంసీ హస్తం ఉండటంతోనే దాడి చేశారని ఆయన అన్నారు.
గొప్పోడివయ్యా.. భార్యకు ఆమె లవర్‌తో పెళ్లి చేయించిన భర్త.. వీడియో వైరల్..
ఇటీవల వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. కొన్ని కేసుల్లో మహిళలు తమ ప్రియుడితో కలిసి భర్తలను హత్య చేస్తుంటే, మరికొన్ని కేసుల్లో భర్తలు, భార్యలను హత్య చేస్తున్నారు. ఇలా వివాహేతర సంబంధాలు విషాదంగా మిగులుతున్నాయి. ఇందుకు భిన్నంగా ఓ వ్యక్తి మాత్రం తన భార్యకు ఆమె ఇష్టపడిని వ్యక్తితో పెళ్లి జరిపించాడు. దగ్గరుండీ మరీ ఇద్దరి పెళ్లి చేశాడు. సినిమాల్లో సాధ్యమయ్యే ఇలాంటి సన్నివేశాలు ఇప్పడు రియల్ లైఫ్ లో కూడా జరుగుతాయని నిరూపించాడు.
వివరాల్లోకి వెళితే బీహార్ నవడాకు చెందిన ఓ వ్యక్తి తన భార్యకు ఆమె ప్రియుడితో వివాహం జరిపించడం చర్చనీయాంశంగా మారింది. భర్త పని నిమిత్తం బయటకు వెళ్లిన సందర్భంలో అతని భార్య అర్థరాత్రి ప్రియుడిని కలిసేందుకు అతని ఇంటికి వెళ్లడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ జంటను వారి కుటుంబసభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇద్దరిని బంధించి కొట్టారు. ఆగ్రహించిన గ్రామస్థులు వీరిద్దరూ ఊరు వదిలి వెళ్లాలని ఆదేశించారు.
రాజధాని బస్సులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ అప్రమత్తంతో తప్పిన ప్రమాదం..
బస్సుల్లో ప్రయానించాలంటే జనాలు వణికిపోతున్నారు.. అటు రైలు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకప్పుడు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి.. కానీ ఈ మధ్య ప్రభుత్వం బస్సుల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి.. మొన్న కూకట్ పల్లి బస్సు ప్రమాదం మరువక ముందే ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది.. హైదరాబాద్ లో మరో బస్సు ప్రమాదానికి గురైంది.. అందుకే దూర ప్రాంతాలకు వెళ్లేవారు బస్సు ప్రయాణం అంటే గుండెల్లో వణుకు పుడుతుంది.. అయితే ఏసీ బస్సుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా హైదరాబాద్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది..
అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికుంలతా క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి గుంటూరుకు ఆర్టీసీ బయలు దేరింది. ఇంతలోనే బస్సు హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్‌పేట్ అవుటర్ రింగ్ రోడ్డు వరకు చేరుకోగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా బస్సులో మంటలు వ్యాపించాయని తెలుస్తోంది. అయితే ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్ వెంటనే అలర్ట్ అయ్యాడు. అప్రమత్తతతో వ్యవహరించి ప్రయాణికులందరినీ కిందకు దించేసి, ఫైర్ ఇంజన్‌కు సమాచారం అందించారు..
వాహనదారులకు షాక్.. నేషనల్ ఎక్స్‌ప్రెస్‌వేలో నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానా
ఎక్స్‌ప్రెస్‌వే లేదా హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు అధిక వేగంతో డ్రైవింగ్ చేయడం ప్రమాదకరమని… దొరికితే పోలీసులు చలాన్ వేస్తారని తెలుసు. కానీ తక్కువ వేగంతో డ్రైవింగ్ చేస్తే కూడా జరిమానా వేస్తారు. వినడానికి వింతగా ఉన్నా ఇది వాస్తవం. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో నెమ్మదిగా డ్రైవ్ చేసే వారికి ఇబ్బంది పాలవుతారు. అందుకు వారికి రూ. 2000 వరకు చలాన్ వేయబడుతుంది, అయితే దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం..
వాస్తవానికి, ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వేలో నెమ్మదిగా డ్రైవింగ్ చేసినందుకు మీరు రూ. 2000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ట్రాఫిక్ రూల్ యాక్ట్ కింద రూల్స్, దాని రూల్స్ మార్చబడ్డాయి. ఎక్స్‌ప్రెస్‌వేపై చిపియానా రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించిన తర్వాత నిబంధనలు అమలు చేయబడ్డాయి. దీని కింద ఓవర్‌టేకింగ్ సమయంలో నిర్ణీత వేగం లేకపోతే రూ.500 నుంచి రూ.2000 వరకు చలాన్ వసూలు చేస్తారు.
