పసిడి ప్రియులకు భారీ ఊరట.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు .. ఎంతంటే?
పసిడి ప్రియులకు భారీ ఊరట… ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి .. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా రెండో రోజు స్వల్పంగా తగ్గాయి.. పది గ్రాముల బంగారంపై 10 రూపాయలు, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.64,080 గా ఉంది. వెండి కిలో రూ.73,500 లుగా ఉంది..దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం , వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,890 ఉంటే.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.64,230 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.58,740గా ఉంటే, 24 క్యారెట్ల ధర రూ.64,080, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.59,290, 24 క్యారెట్ల ధర రూ.64,680, బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.58,740, 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,740 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.64,080 గా ఉంది..
వెండి ధర విషయానికొస్తే.. ఈరోజు బంగారం బాటలోనే నడిచింది.. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,500 పలుకుతోంది. అలాగే ముంబైలో రూ.73,500, చెన్నైలో రూ.76,900, బెంగళూరులో రూ.72,650, కేరళలో రూ.76,900, కోల్‌కతాలో రూ.73,500 పలుకుతోంది. ఇక హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,900 గా ఉంది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..
పాకిస్థాన్ గురించి ఎందుకు మాట్లాడాలి… రాహుల్ ప్రకటనపై బీజేపీ ఏం చెప్పిందంటే?
భారత్‌లో నిరుద్యోగం పాకిస్థాన్‌లో కంటే ఎక్కువగా ఉందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సోమవారం ఎదురుదాడి చేసింది. దీనితో పాటు, పొరుగు దేశానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తుందనే ప్రశ్న కూడా ఆ పార్టీ లేవనెత్తింది. బీజేపీ అధికార ప్రతినిధి ప్రత్యూష్ కాంత్ విలేకరులతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల సందర్భంగా దేశాన్ని కించపరిచేలా మాట్లాడటంలో నిపుణుడిగా మారారని, దేశం సాధించిన విజయాలను విస్మరించి మంచి పని చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. 40 శాతానికి పైగా ప్రజలు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నందున పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అందరికీ తెలుసునని ప్రత్యూష్ కాంత్ అన్నారు.
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ షట్లర్ సాయి ప్రణీత్!
భారత షట్లర్ బీ సాయి ప్రణీత్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని 31 ఏళ్ల ప్రణీత్ ఇన్‌స్టా వేదికగా వెల్లడించాడు. గత కొణతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపాడు. అమెరికాలో ఒక క్లబ్‌కు సేవలు అందించబోతున్నట్లు తన ప్రణీత్ వివరించాడు.
‘డియర్ బ్యాడ్మింటన్ థాంక్యూ. బ్యాడ్మింటన్‌తో 24 ఏళ్లకు పైగా ఉన్న సుదీర్ఘ అనుబంధానికి ముగింపు పలుకుతూ.. రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. ఈ రోజు నుంచి కెరీర్‌లో కొత్త చాప్టర్ మొదలుపెడుతున్నా. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి కారణమైన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటాను. అభిమానుల అపూర్వ మద్దతు నా గొప్ప బలం. భారత జెండా ఎగిరినప్పుడల్లా నా ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. బ్యాడ్మింటన్ ఆటపై నాది తొలి ప్రేమ. నేను గుర్తింపులోకి వచ్చింది ఈ ఆట ద్వారా మాత్రమే. ఈ ప్రయాణంలో ఎన్నో అనుభూతులు, మరెన్నో అడ్డంకులను అధిగమించాను. అవి నా హృదయంలో పదిలంగా ఉంటాయి. నా తల్లిదండ్రులు, భార్య శ్వేత కెరీర్ ఉన్నతికి ఎంతగానో దోహదపడ్డారు. గోపీచంద్ అన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆటతో నా అనుబంధం కొనసాగుతుంది. ప్లేయర్‌గా గాకుండా కోచ్‌గా, మెంటార్‌గా ఏదో ఒక రూపంలో ఆటలో భాగమవుతా’ అని సాయి ప్రణీత్ పేర్కొన్నాడు.
ఓటీటీలోకి వచ్చేసిన 12th ఫెయిల్ తెలుగు వర్షన్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్య ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని అందుకుంటున్నాయి.. అలాంటి వాటిలో ఒకటి 12th ఫెయిల్.. ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మనోజ్ కుమార్ శర్మ అనే ఐపీఎస్ ఆఫీసర్ జీవితం ఆధారంగా విధు వినోద్ చోప్రా ఈ మూవీని తెరకెక్కించాడు.. ఈ సినిమాలో విక్రాంత్ మస్సే హీరోగా నటించాడు. గతేడాది అక్టోబర్ 27వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఓటీటీలోకి వచ్చాక 12th ఫెయిల్ కు మరింత క్రేజ్ వచ్చింది. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ అందుకుంది.
చర్చకు సిద్ధమా?.. రాహుల్ గాంధీకి స్మృతి ఇరానీ సవాల్
యూపీఏ హయాంలోని పాలనకు, నరేంద్ర మోడీ సర్కారుకు మధ్య ఉన్న తేడాపై చర్చకు రావాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ సవాల్ విసిరారు. నాగ్‌పూర్‌లో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో యువ మహా సమ్మేళనంలో ఆమె ఈ మేరకు ఛాలెంజ్ చేశారు. రాహుల్‌ను చర్చకు రావాలని కోరితే రాలేదన్నారు. బీజేపీకి చెందిన ఒక సామాన్య కార్యకర్త ముందు కూడా రాహుల్ నిలబడలేడని ఆమె ఎద్దేవా చేశారు.
యువమోర్చాకు చెందిన ఓ సామాన్య కార్యకర్త రాహుల్ గాంధీ ముందు మాట్లాడినా మాట్లాడే శక్తి కోల్పోతాడని తాను హామీ ఇస్తున్నానన్నారు.10 ఏళ్లలో బీజేపీ మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన మూడు ప్రధాన హామీలను నెరవేర్చిందని స్మృతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.అప్పటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన ఆర్టికల్ 370 రద్దు, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్, రామమందిర నిర్మాణం ఈ వాగ్దానాలేనని, వాటిని నెరవేర్చామని ఆమె అన్నారు.
నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన
సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇవాళ ఉదయం 9.10 గంటలకు సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖకు చేరుకుంటారు. రాడిసన్ బ్లూలో నిర్వహిస్తున్న ‘విజన్..విశాఖ’ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి పీఎం పాలెంలోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు.
అక్కడ స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి, సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు. పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు ‘భవిత’ పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేస్తారు. అనంతరం విశాఖ నుంచి బయలుదేరి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కలెక్టర్ మల్లికార్జున, ఏపీఐఐసీ వైస్ చైర్మన్ ప్రవీణ్‌కుమార్, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ సోమవారం పరిశీలించారు.
గాజాలో పరిస్థితిపై భారత్ ఆందోళన.. శాంతి అలా అయితేనే సాధ్యం
గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు. గాజా సంక్షోభంపై UNGA బ్రీఫింగ్‌లో భారతదేశ శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. భారతదేశానికి సంబంధించినంతవరకు, గాజాలో దాదాపు ఐదు నెలలుగా జరుగుతున్న యుద్ధంతో మేము తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని అన్నారు. ఈ యుద్ధం కారణంగా అక్కడ మానవత్వంపై సంక్షోభం తీవ్రమవుతుందని తెలిపారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం ఫలితంగా పౌరుల జీవితాలు, ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు భారీగా నష్టపోయారు, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదన్నారు.
శ్రీశైలంలో 5వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో 5వరోజుకు చేరుకున్నాయి. ఉదయం కాణిపాకం శ్రీవరసిద్ది వినాయక దేవస్థానం శ్రీస్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించనుంది. సాయంత్రం ఏపీ ప్రభుత్వం తరపున శ్రీస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం రావణవాహనంపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు. రావణవాహనంపై ప్రత్యేక పూజలందుకోనున్నా శ్రీస్వామి అమ్మవారు. రాత్రి క్షేత్ర వీధుల్లో ఆది దంపతుల గ్రామోత్సవం జరగనుంది. శివస్వాములతో శ్రీశైలం ఆలయం పోటెత్తింది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటన
నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. పటేల్ గూడలోని SR ఇన్ఫినిటీ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. సభా వేదికగా 9021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు వర్చువల్ గా ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సంగారెడ్డి లో 1409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని మోడీ. సంగారెడ్డి X రోడ్డు నుంచి మదీనగూడ వరకు 1298 కోట్లతో NH-65ని ఆరు లేన్లుగా విస్తరించే పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. మెదక్ జిల్లాలో 399 కోట్లతో చేపడుతున్న NH 765D మెదక్- ఎల్లారెడ్డి హైవే విస్తరణ, 500 కోట్లతో ఎల్లారెడ్డి- రుద్రూర్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
