Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

చంద్రబాబుకు బెయిల్ సంతోషకరం.. మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దు..!

చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు సంతోషకరం అన్నారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డా. చింతా మోహన్.. అయితే, చంద్రబాబును మరలా అరెస్ట్ చేసే తప్పు చేయొద్దని సూచించారు.. ప్రేమతో రాజకీయాలు చేయాలి.. కానీ, కక్షతో చేయొద్దని తెలిపారు.. ఆలస్యం అయినా చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం సంతోషకరం అన్నారు. చంద్రబాబును మళ్లీ అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. కానీ, మళ్లీ అరెస్ట్ చేసి ఆ తప్పు చెయ్యవద్దని రాష్ట్రప్రభుత్వాన్ని వినమ్రంగా కోరుకుంటున్నాను అన్నారు. చంద్రబాబు అరెస్ట్ లో బీజేపీ, వైసీపీ పాత్ర ఉందని ప్రజలు నమ్ము

AIతో నష్టాలు.. కొత్త ప్రమాణాలు సిద్ధం చేయాలన్న జో బిడెన్

ఏ పనినైనా రెప్పపాటు కాలంలో చేయగా నైపుణ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI )లో ఉంటుంది. అయితే ఆ నైపుణ్యాన్ని సృష్టించిన మానవ మేధస్సు నైపుణ్యం ఇంకెంత గొప్పదో కదా. అయితే AI కారణంగా మానవ మేధస్సు ప్రభావితం కానుంది. ఎందుకంటే మానవ మేధస్సుకి నిదర్శనమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషికి ఆలోచించే అవకాశాన్ని ఇవ్వదు. మనిషి ఎప్పుడు సులువైన మార్గాన్నే ఏంన్చుకుంటాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని పనులు చేస్తున్నప్పుడు మనిషి ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకుంటాడు. దీని కారణంగా ఆలోచించాల్సిన అవసరం లేనందున మెదడుని ఉపయోగించరు. తద్ద్వారా ఆలోచన శక్తి, నైపుణ్యం తగ్గిపోతాయి. అందుకే యావత్ ప్రపంచం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవ మేధస్సుకి ముప్పు పొంచి ఉందని, అలానే మనుషులు ఉపాధిని కోల్పోతారని ఆందోళన చెందుతుంది.

కొత్త ప్రభాకర్ రెడ్డి ఆరోగ్యం హెల్త్‌ బులిటెన్‌.. వైద్యులు ఏమన్నారంటే..

తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లాలో దుబ్బాక బీఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం హాట్ టాపిక్ గా మారింది. అయితే నిన్న కొత్త ప్రభాకర్ పై రాజు అనే వ్యక్తి చేసిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి డాక్టర్లు సుమారు నాలుగు గంటల పాటు కష్టపడి సర్జరీ చేశారు. చిన్న ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో, పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు యశోదా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. గ్రీన్‌ ఛానెల్‌తో హైదరాబాద్‌కు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిని తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదని యశోదా హస్పటల్ వైద్యులు పేర్కొన్నారు. రక్తం కడుపులో పేరుకుపోయిందని వారు తెలిపారు. ప్రేగుకు నాలుగు చోట్ల గాయాలు కావడంతో సర్జరీ చేయడం ఆలస్యం అయ్యిందని డాక్టర్ల చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రభాకర్ రెడ్డికి ఐసీయూలో చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు. మరో పది రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తుందని చెప్పారు.

మహారాష్ట్రలో 144 సెక్షన్ అమలు.. ఇంటర్నెట్‌ బంద్.. !

మహారాష్ట్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత కొంత కాలంగా మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్‌ డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం ఇప్పుడు మహారాష్ట్రలో శరవేగంగా వ్యాపిస్తోంది. ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మనోజ్ జరంగే గత వారం రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అలానే ఉద్యమంలో పాల్గొన్న యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలంది యువత ప్రాణాలను కోల్పోయారు. కాగా సోమవారం నిరాహార దీక్ష చేస్తున్న మనోజ్ జరంగే ఆరోగ్యం క్షీణించింది. దీనితో ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి లోనైనా ఉద్యమకారులు ముఖ్యమంత్రి షిండేపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జరంజే పరిస్థితిని చూసి ఉద్వేగానికి లోనైనా ఆందోళనకారులు ఆయన పరిస్థితిని సీఎం పట్టించుకోలేదని ఆరోపించారు.

బర్త్‌ డే రోజు ‘కింగ్’ కోహ్లీ సెంచరీ చేస్తాడు.. పాకిస్తాన్ క్రికెటర్ జోస్యం!

భారత గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో రోహిత్ సేన వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో విజయాలలు సాధించిన భారత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. దాదాపుగా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్న టీమిండియా.. లీగ్ దశలో ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నవంబర్‌ 5న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే ఈ మ్యాచ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. నవంబర్‌ 5న భారత స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ 35వ పుట్టిన రోజును జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో ముందుగానే కోహ్లీకి బర్త్‌ డే విషెష్ చెప్పిన పాకిస్థాన్‌ వికెట్‌కీపర్ మహ్మద్‌ రిజ్వాన్‌.. దక్షిణాఫ్రికాపై సెంచరీ చేయాలని కోరుకున్నాడు.

బీఆర్ఎస్ పాలనలో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి?

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి లాంటి వ్యక్తికి సరైన భద్రత ఇవ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు అస్సలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనల్లో ఎంపీకే రక్షణ లేకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి? అని అడిగారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డిపై దాడి చేసిన నిందితుడిని పట్టుకున్న ప్రభుత్వం దాడి ఎందుకు చేశాడని విచారణ చేసి నిజా నిజాలను రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యతను విస్మరించి విపక్షాలపై దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ భట్టి విక్రమార్క మండిపడ్డారు.

చంద్రబాబుకు చెప్పుకోవటానికి కూడా న్యూసెన్స్‌గా ఉండే వ్యాధులు.. అందుకే మధ్యంతర బెయిల్‌..!

చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంపై హాట్‌ కామెంట్లు చేశారు ప్రభుత్వ సలహాదారు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్‌పై స్పందించాల్సిన అంశమే కాదన్నారు.. ఇది కేవలం ఆరోగ్య కారణాల పై ఇచ్చిన మధ్యంతర బెయిల్.. చెప్పుకోవటానికి కూడా న్యూసెన్స్ గా ఉండే చర్మ వ్యాధులు చంద్రబాబుకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబుకు ఉన్న చర్మ వ్యాధులను ప్రాణాంతకం అన్నట్లు చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.. మధ్యంతర బెయిల్‌ వచ్చిందని సంబరాలు చేసుకునే వారికి సిగ్గు ఉందా? అంటూ మండిపడ్డారు. కేసు మెరిట్ చర్చ జరిగిందా? అని ప్రశ్నించారు.

ధరణి వద్దంటున్న కాంగ్రెస్ నేతలను బంగాళాఖాతంలో కలపాలి

ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. ఈ సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బోల్లం మల్లయ్య యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణను ఆంధ్రలో కలిపిన వాళ్ళే కాంగ్రెస్ వాళ్లు అని, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిర్మణంలో అన్యాయం జరిగింది.. ఆ పాపం కాంగ్రెస్ పార్టీదేనన్నారు. 9 ఏళ్లలో సాగర్ నుంచి కావాల్సిన సాగునీటిని విడుదల చేసుకున్నామన్నారు సీఎం కేసీఆర్‌. సాగర్ నుండి సాగు నీటి కోసం, విద్యుత్ కోసం కాంగ్రెస్ నేతలు ఏనాడూ కొట్లడలేదని, నిండు సభలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మనలను అవమానిస్తే… సభలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరెందుకు విప్పలేదన్నారు. కాంగ్రెస్ లో డజన్ మంది ముఖ్యమOత్రులు ఉన్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్నారు. రైతుబందు కావాలంన్నా, 24 గంటల విద్యుత్ కావాలన్నా BRS కు ఓటెయ్యాలని, రాహుల్ గాంధీకి వ్యవసాయం తెలియదని, ధరణి వద్దంటున్న కాంగ్రెస్ నేతలను బంగాళా ఖాతంలో కలపాలన్నారు సీఎం కేసీఆర్‌.

రాజకీయ సింపతి కోసం వాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది

ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన దాడిని రాజకీయ సింపతి కోసం వాడుకోవాలి బిఆర్ఎస్ పార్టీ చూస్తుందని మాజీ ఎంపీ, ముషీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి దాడి చేస్తే , ఆ నేపన్ని కాంగ్రెస్ పార్టీపై నెట్టాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడా డివిజన్ లో ఇంటిటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజన్ మాట్లాడుతూ… తాను ఎంపీగా ఉన్నపుడు జరిగిన అభివృద్ధి తప్ప ముషీరాబాద్ నియోజకవర్గాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. ప్రజలు బిఆర్ఎస్ పార్టీపై విసుగు చెంది ఉన్నారని… రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అంజన్ స్పష్టం చేశారు.

ఎంపీపై దాడి ఏ పరిస్థితిలో చేశాడో.. వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయి

జగిత్యాల జిల్లా కేంద్రంలోని 25 వ వార్డ్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ రాజకీయ నాయకుడు గొప్పవాడు కాదు లక్ష్యం గొప్పది ఆశయం గొప్పది.. సీఎం కేసీఆర్ లేకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేదు అని అనడం ఆయన అహంకారానికి నిదర్శనం.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగుల పాత్ర కీలకం అని ఆయన తెలిపారు.

తెలంగాణ, రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగుల ఆత్మ బలిదానాలతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ ఒక భాగం మాత్రమే.. రాజకీయాల్లో భౌతికదాడులతో ఎవరికి లబ్ధి జరగదు.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పై దాడి రాజకీయ పార్టీ కుట్ర అయితే ఆ పార్టీకి నష్టం జరుగుద్ది అని ఆయన పేర్కొన్నారు. ఎంపీపై దాడి ఏ పరిస్థితిలో చేశాడో వాస్తవాలు విచారణలో బయటకు వస్తాయి.. నా కార్యకర్తలకు ఒక్కటే చెప్తాను ఎవరైనా ఏదైనా అంటే ఓపిక పట్టండని అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు.

వాట్సాప్‌లో మరో ఫీచర్.. గ్రూప్ కాలింగ్ పై..

ప్రపంచంవ్యాప్తంగా ఎక్కువ మంది వాడుతున్న సోషల్ మీడియా యాప్ వాట్సాప్.. ఈ యాప్ యూజర్స్ కోసం కొత్త కొత్త ఫీచర్స్ ను అందిస్తున్నారు.. మార్కెట్లోకి ఎన్నో మెసేజింగ్‌ యాప్స్‌ వస్తున్నా పోటీనీ తట్టుకునేలా వాట్సాప్‌ కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది… ఆ ఫీచర్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఈ వాట్సాప్ లో ఎక్కువ మంది వాడేది గ్రూప్ కాలింగ్ ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు గాను ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి నాళ్లలో ఒకేసారి 7గురు మాట్లాడుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చారు. అనంతరం ఈ పరిమితిని 15కి పెంచుతూ నిర్ణయం తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచుతూ వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది.. ఈసారి డబుల్ చేసింది. అంటే ఈసారి ఏకంగా 31 మంది కనెక్ట్ అయ్యేలా చేసింది..

యాపిల్ సంస్థ నుంచి ప్రతిపక్ష ఎంపీలకు అలర్ట్‌.. కేంద్రం హ్యాక్‌ చేస్తోందని ధ్వజం

పలు ప్రతిపక్ష ఎంపీలకు యాపిల్‌ సంస్థ వార్నింగ్ అలర్ట్ పంపింది. ప్రతిపక్ష ఎంపీల యాపిల్‌ ఐడీ ఆధారంగా స్టేట్‌ స్పాన్సర్డ్‌ అటాకర్స్‌ తమ ఐఫోన్‌, ఈ-మెయిల్స్‌ హ్యాక్‌ చేస్తున్నట్లు యాపిల్‌ హెచ్చరించింది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగలించే ప్రమాదం ఉందని, జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ మెసేజ్‌ అందుకున్న వారిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, శివసేన(ఉద్దవ్‌ వర్గం) ఎంపీ ప్రియాంక చతుర్వేది ఉండడం గమనార్హం. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, శివసేన (యూబీటీ) నేత ప్రియాంక చతుర్వేది, కాంగ్రెస్ నేతలు పవన్ ఖేరా, శశి థరూర్‌లతో సహా పలువురు ప్రతిపక్ష నేతలు తమ ఫోన్‌లు, ఈమెయిల్స్‌లో యాపిల్‌ నుంచి మెసేజ్‌లు వచ్చాయని, రాష్ట్ర ప్రాయోజిత దాడికి పాల్పడే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. వారు తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో యాపిల్‌ నుంచి వచ్చిన అలర్ట్‌ మెసేజ్‌ స్క్రీన్‌ షాట్‌లను షేర్‌ చేశారు. ‘‘ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హ్యాకర్లు మీ ఐఫోన్‌ను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మీ ఫోన్‌లోని సున్నితమైన సమాచారంతోపాటు, కమ్యూనికేషన్స్, కెమెరా, మైక్రోఫోన్‌లను వారు యాక్సెస్ చేసే అవకాశం ఉంది’’ అనేది యాపిల్‌ ప్రతిపక్ష నేతలకు పంపిన మెసేజ్‌లోని సారాంశం.

కరెంట్ బిల్లు కట్టలేదని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలకు తాళం

ఎవరన్న కరెంట్ బిల్లు కట్టకపోతే విద్యుత్ శాఖ అధికారులు కనెక్షన్ కట్ చేసేస్తారు. అలాంటిది ప్రభుత్వానికి సంబంధించినవి స్కూల్స్, హస్పటల్స్ అయినా.. సరే వారి తీరు అలాగే ఉంటుంది. అయితే, తాజాగా నిరంతరం పేదలకు చికిత్స అందించే ప్రభుత్వ ఆస్పత్రికి కూడా విద్యుత్ శాఖ అధికారులు షాక్ ఇచ్చారు. గత కొన్ని నెలలుగా కరెంట్ బిల్లు కట్టడం లేదని సదరు హస్పటల్ కు కరెంట్ కనెక్షన్ కట్ చేశారు. అయితే, ఈ ఘటన మన పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.

కర్నూలు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోకి విద్యుత్ శాఖ అధికారులు తాళం వేశారు. అయితే, గత కొంత కాలంగా కరెంట్ బిల్లు చెల్లించడం లేదని సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలకు కలెక్టర్ సృజన తాళం వేయించింది. ఏడాదిగా బిల్లులు రాలేదని, కొంత సమయం ఇస్తే విద్యుత్ బిల్లులు చెల్లిస్తామని కలెక్టర్ కు ఏజెన్సీ ప్రతినిధులు తెలిపారు. అయినా ఎమ్ఆర్ఐ, సిటీ స్కాన్ కేంద్రాలకు అధికారులు లాక్ వేసేశారు. రోగులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎలా మూసివేస్తారని అధికారులను హస్పటల్ లో ఉన్న రోగులు నిలదీస్తున్నారు. అత్యవసర పరీక్ష కేంద్రాలను మూసివేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి అధికారులు వెంటనే స్పందించి సిటీ స్కాన్, ఎమ్ఆర్ఐ కేంద్రాలను తెరిపించాలని పేషెంట్స్ కోరుతున్నారు.

రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి చంద్రబాబు విడుదల

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబు 53 రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆయనకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ని జైలు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు తమ అధినేత రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తులు, నాయకులు రాజమండ్రి జైలు దగ్గరకు చేరుకుని చంద్రబాబుకు స్వాగతం పలికారు. దీంతో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం దగ్గర కోలాహల వాతావరణం కొనసాగింది.

నాకు సపోర్టు చేసిన అందరికి ధన్యవాదాలు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల అయ్యారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్ కేసులో 53 రోజుల జైలులో శిక్ష అనుభవించారు. ఇక, చంద్రబాబకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయడంతో ఆయన్ని జైలు అధికారులు రిలీజ్ చేశారు. దీంతో చంద్రబాబు రిలీజ్ కావడంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఇక, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తొలి సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. తాను జైలులో ఉన్నప్పుడు సపోర్టు చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. త‌న 45 ఏండ్ల సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్రలో ఏ త‌ప్పూ చేయ‌లేద‌న్నారు. నేను తప్పు చేయ‌ను.. చేయనివ్వను.. భవిష్యత్ లోనూ చేయ‌బోన‌ని టీడీపీ అధినేత పేర్కొన్నారు. “నేను కష్టంలో ఉన్నప్పుడు రోడ్డు పైకి వచ్చి సంఘీభావం తెలిపి.. మీరందరూ 52 రోజులుగా నాకు సపోర్టుగా నిలిచారు.. ఏపీ, తెలంగాణతో పాటు విదేశాల్లోనూ మద్దతు ఇచ్చారు.. నాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు.

 

Exit mobile version