NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై వివరణ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం

పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ పై అటెస్టేషన్ అధికారి అధికారిక ముద్ర లేకున్నా.. సదరు బ్యాలెట్ ను తిరస్కరించవద్దని ఈసీ స్పష్టం చేసింది. ఫాం 13ఏపై రిటర్నింగ్ అధికారి తన సంతకం సహా పూర్తి వివరాలు నింపి ఉంటే అధికారిక ముద్ర లేకపోయినా ఆ బ్యాలెట్ చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. పోస్టల్ బ్యాలెట్‌పై సదరు రిటర్నింగ్ అధికారి సంతకం సహా బ్యాలెట్‌ను ధృవీకరించేదుకు రిజిస్టర్‌తో సరిపోల్చుకోవాలని వెల్లడించింది. పోస్టల్ బ్యాలెట్ కవర్ ఫాం సీపై ఎలెక్టర్ సంతకం లేదని సదరు బ్యాలెట్‌ను తిరస్కరించ రాదని స్పష్టం చేసింది. ఫాం 13 ఏలో ఓటర్ సంతకం లేకపోయినా, రిటర్నింగ్ అధికారి అటెస్టేషన్ సంతకం లేకపోయినా, బ్యాలెట్ సీరియల్ నెంబరు లేకపోయినా సదరు బ్యాలెట్ తిరస్కరించవచ్చని పేర్కొంది. అలాగే పోస్టల్ బ్యాలెట్ పేపరుపై నిబంధనల ప్రకారం ఓటు నమోదు చేయక పోయినా సదరు ఓటు తిరస్కరణకు గురి అవుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న 4.63 లక్షల మంది పట్టభద్రులు

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది . అవిభాజ్య జిల్లాలైన వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గంలో మొత్తం 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగాం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన తర్వాత BRSకు చెందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ, ప్రధాన పోటీ కాంగ్రెస్, భారత రాష్ట్ర సమితి (BRS) మధ్యే ఉంది. ) , భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థులు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉప ఎన్నిక ప్రధాన వర్గాల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.

మలేషియా మాస్టర్స్ ఫైనల్‌లో పీవీ సింధు ఓటమి

డబుల్ ఒలింపిక్ పతక విజేత PV సింధు మలేషియా మాస్టర్స్ 2024 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్ జియితో ​​ఓడిపోయింది. భారత షట్లర్ తొలి గేమ్‌లో 21-16 తేడాతో ఫైనల్‌ను ప్రారంభించింది. చైనా షట్లర్ రెండో స్థానంలో పునరాగమనం చేసి 21-5తో విజయం సాధించింది. చివరి గేమ్‌లో సింధు ఆధిపత్య ధోరణిని ప్రదర్శించి 11-3తో ఆధిక్యంలో నిలిచింది. అయినప్పటికీ, వాంగ్ తన నరాలను పట్టుకుని స్టైల్‌గా పుంజుకుంది మరియు 16-21తో గేమ్‌ను కైవసం చేసుకుంది. ఓటమి వైపు ఉన్నప్పటికీ, సింధు అద్భుతమైన టోర్నమెంట్‌ను కలిగి ఉంది, ఇది పారిస్ ఒలింపిక్స్‌కు ముందు ఆమెకు సానుకూలంగా ఉంది.

భారత రాజ్యాంగాన్ని ఎప్పటికీ బీజేపీ మార్చదు.. సవరణలు చేస్తాం..!

భారత రాజ్యాంగాన్ని బీజేపీ ఎప్పటికీ మార్చదన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలు బీజేపీ రిజర్వేషన్లను తొలగించడానికి ప్రయత్నిస్తుండటంతో పాటు రాజ్యాంగ ప్రవేశికను తాము మార్చాలని చూస్తున్నట్లు చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరా గాంధీ 1976లో భారత రాజ్యాంగ పీఠికలో మార్పులు చేశారు.. కానీ ఇప్పుడు అనవసరంగా భారతీయ జనతా పార్టీని లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అబద్దాలను ప్రచారం చేస్తున్నారని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.

భారత్లో అధికారంలోకి వచ్చేది బీజేపీ- ఎన్డీయే కూటమినే..

భారతదేశంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమినే అధికారంలోకి వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశ ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన ఆరు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వైపే మొగ్గు చూపారని చెప్పుకొచ్చారు. భారత్ లో బీజేపీ-ఎన్డీయే తుఫాన్ వీస్తోందన్నారు. ఇండియా కూటమి కులతత్వం, మతతత్వంతో కూరుకు పోయిందని విమర్శలు గుప్పించారు. భారత కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధాన మంత్రులు అవుతారని ఎద్దేవా చేశారు. అలాంటి వారు దేశాన్ని బలోపేతం చేయగలరా అంటూ నరేంద్ర మోడీ ప్రశ్నించారు.

ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోంది.. పేర్ని నాని ఆగ్రహం

పోలీసులు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. పాల్వాయిగేట్‌లో దౌర్జన్యం జరిగితే అడ్డుకోలేదని.. వైసీపీ మద్దతుదారులు ఓటు వేయకుండా అడ్డుకున్నారని పేర్ని నాని పేర్కొన్నారు. ఏపీలో ఈసీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆయన కామెంట్స్ చేశారు. “పిన్నెల్లి ఈవీఎంను ధ్వంసం చేస్తే 13నే ఎందుకు కేసు నమోదు చేయలేదు.. ఈ ఘటనపై అప్పుడే టీడీపీ ఎందుకు ఫిర్యాదు చేయలేదు.. డీజీపీకి సిట్ ఇచ్చిన నివేదికలో పిన్నెల్లి ప్రస్తావన కూడా లేదు. కూటమి నేతలు ఎవరిని నియమించాలని కోరితే వారినే నియమించారు.” అని పేర్ని నాని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నందమూరి బాలకృష్ణ..

మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఎలక్షన్స్ అయ్యాక బాలయ్య బాబు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలు, బసవతారకం హాస్పిటల్ పనులలో నిమగ్నమయ్యారు. తాజాగా కాజల్ నటించిన ; సత్యభామ ‘ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా వచ్చారు బాలయ్య.

‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో అంజలి నోట బూతులు.. ఏంటి ఇలా అనేసింది..

ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన సినిమా షూట్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఇకపోతే నేడు ఆదివారం బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తన బసవతారకం హాస్పిటల్ కి చెందిన పలువురితో కలిసి బాలకృష్ణ రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి, బాలయ్య బాబు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ఈ సంద్రాభంగా సీఎం రేవంత్ తో ఆయన నివాసంలో బాలయ్య బాబు కొద్దిసేపు మాట్లాడి వెళ్లారు.

బీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్లు ట్రాన్స్ ఫర్ అయ్యాయి..

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బంజారాహిల్స్ బరోడా బ్యాంక్ లోని BRS పార్టీ అకౌంట్ నుంచి 30 కోట్ల రూపాయలు ట్రాన్స్ ఫర్ అయ్యాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ డబ్బులను ఖర్చు చేసేందుకు BRS ప్రయత్నిస్తుందన్నారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో ఉన్న BRS పార్టీ ఎమ్మెల్యేలకుజ్ మాజిలకు అకౌంట్ లో కోటి రూపాయలు వేశారన్నారు. BRS పార్టీ ప్రతి ఎన్నికల్లో డబ్బులు పెట్టి గెలవాలని చూస్తుందన్నారు. ఎంపీ ఎన్నికల్లో మెదక్ లో ఒక్కొక్క ఓటర్ కి 500 రూపాయలు పంచారని ఆరోపించారు. డబ్బులు పంచి గెలవాలి అనుకుంటున్న BRS పార్టీ గుర్తింపు రద్దు చెయ్యాలన్నారు.

ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించింది..

ఎన్నికల కమిషన్ పక్షపాత ధోరణిలో వ్యవహరించిందని మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ఆరోపించారు. పోలీస్ అధికారులను ఉద్దేశ పూర్వకంగా బదిలీ చేసిందన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ అధికారులు ఉద్రిక్తతలు రెచ్చగొట్టారని.. వైసీపీ బలంగా ఉన్న చోట క్యాడర్‌ని భయబ్రాంతులకు గురి చేశారన్నారు. మాచర్ల ఘటన వీడియో ఎలా బయటికి వచ్చిందో చెప్పలేని దుస్థితిలో ఎన్నికల కమిషన్ ఉందన్నారు. ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించలేదని మా అభిప్రాయమన్నారు.

నెల్లూరు జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక వసతులు కల్పించలేదని.. ఎన్నికల నిర్వహణలో జిల్లా ఎన్నికల యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. ఎన్నికల నిధుల దుర్వినియోగం, విధుల నిర్వహణలో వైఫల్యంపై జిల్లా రిటర్నింగ్ అధికారిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేశామన్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి పట్టపగలు ఓటర్లకి డబ్బులు పంచారని.. దానిపై ఫిర్యాదు చేస్తే జిల్లా రిటర్నింగ్ అధికారి పట్టించుకోలేదని అన్నారు. మానవతా దృక్పధంతో సోమిరెడ్డి డబ్బులు పంచాడని జిల్లా ఎన్నికల అధికారి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తానన్నారు. జిల్లా కలెక్టర్ పక్షపాత ధోరణిలో పని చేశారని మంత్రి అన్నారు. జిల్లా రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు సజావుగా సాగుతుందనే నమ్మకం మాకు లేదన్నారు. కౌంటింగ్ నిర్వహణకు ఒక అబ్జర్వర్‌ను నియమించాలని కోరుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు.. మిరియాల పేరుతో పుప్పొడి విత్తనాలు

ఫుడ్ కోసం ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా, కొన్ని రెస్టారెంట్లు అర్థరాత్రి లేదా తెల్లవారుజామున అనే తేడా లేకుండా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి. ఇలా బయట ఫుడ్ ఆర్డర్ చేసే చాలా మంది పెద్ద పెద్ద రెస్టారెంట్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. పది రూపాయలకు మించి ఖరీదు చేసినా.. నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించడంలో పేరున్న రెస్టారెంట్లకే ప్రాధాన్యం ఇస్తారు. మరి రెస్టారెంట్లు, హోటళ్లు తమ కస్టమర్లకు నిజంగా కల్తీ లేని నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నాయా లేదా అన్నది ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన పరిశోధనల్లో తేలింది. కరీంనగర్‌లోని పలు హోటళ్లపై ఫుడ్‌ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. వరంగల్ నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ సేఫ్టీ విభాగం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అమృతశ్రీతో పాటు పలువురు అధికారులు ఈ తనిఖీలు నిర్వహించారు.