NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm

Top Headlines @ 5 Pm

కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది..

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సందిగ్ధంలో ఉందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులను మోసం చేసి ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ జిల్లాలో సన్న బియ్యం ఎంతో.. దొడ్డు బియ్యం ఎంతో డిప్యూటీ సీఎం భట్టి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఈ జిల్లాకు ఒక యునివర్సిటీ తీసుకురాలేక పోయారని రఘునందన్ రావు ఎద్దెవా చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సందిగ్ధంలో ఉంది..

వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సందిగ్ధంలో ఉందన్నారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులను మోసం చేసి ఇప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ జిల్లాలో సన్న బియ్యం ఎంతో.. దొడ్డు బియ్యం ఎంతో డిప్యూటీ సీఎం భట్టి ఒక శ్వేత పత్రం విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. ముగ్గురు మంత్రులు ఉన్న ఈ జిల్లాకు ఒక యునివర్సిటీ తీసుకురాలేక పోయారని రఘునందన్ రావు ఎద్దెవా చేశారు.

6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో పట్టభద్రుల ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో సర్వేలు తలదన్నేలా రిజల్ట్ రాబోతున్నాయి.. అప్పటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకి ఓటు వేయాలని చెప్పారు.. ఇప్పుడు అదే పార్టీ మీద నిలబడ్డాడు మరి ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తాడు అని అన్నారు. ఉద్యోగులను, నిరుద్యోగులను, రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టని పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన మండిపడ్డారు. ఇక, కేవలం 5, 6 నెలల కాలంలో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న ఒకే ఒక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే.. భారత ప్రభుత్వం అన్ని గమనిస్తుంది.. తప్పు చేసిన వాళ్ళందరూ తప్పకుండా జైలుకు వెళ్తారు.. బీఆర్ఎస్ పార్టీ గెలిచేది లేదు సచ్చేది లేదు అని ఈటెల రాజేందర్ అన్నారు.

ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి..

వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికా బద్దంగా చేసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చెదురుమదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13 న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. అదే స్పూర్తితో వచ్చే నెల 4న జరగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి ప్రణాళికాబద్దంగా ఏర్పాట్లు చేసుకుని విజయవంతంగా నిర్వహించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ముందుగానే చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపులో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా సంబంధిత వివరాలను అంటే ఏ రోజున, ఎన్ని గంటలకు, ఎన్ని టేబుళ్లపై ఓట్ల లెక్కింపు నిర్వహించడం జరుగుతున్నది అనే వివరాలను రాతపూర్వకంగా సంబంధిత అభ్యర్థులకు, ఎన్నికల ఏజెంట్లకు ముందుగానే తెలియజేయాలన్నారు. పాత్రికేయులకు ప్రత్యేకంగా మీడియా సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు.

పిన్నెల్లి వీడియో ఈసీ నుంచి బయటకు వెళ్లలేదు: సీఈవో

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో విధుల్లో ఉన్న పీఓ, ఏపీవోలను సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు ఇచ్చామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. ఘటనపై సమాచారం ఇవ్వనందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, నలుగురు సీఐలతో బృందాలు పని చేస్తున్నాయన్నారు. మీడియా చిట్‌చాట్‌లో ఏపీ సీఈవో ఎంకే మీనా మాట్లాడారు. మాచర్లలో టీడీపీ నేతల పర్యటన ఈ సమయంలో సరికాదని ఆయన వెల్లడించారు. అక్కడ ఇప్పుడే పరిస్థితి అదుపులోకి వస్తోందన్నారు.

సోనియా గాంధీ, ఖర్గే ఎంపిక చేసిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న

తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ అభ్యర్థిగా సోనియా, ఖర్గే ఎంపిక చేశారని.. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడారు. ” పోరాటం చేసే సత్తా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉందని నిరూపిద్దాం. అభ్యర్థి ఎవరైనా సరే పార్టీ ఆదేశాలను అమలు చేసే కార్యకర్తలు, నాయకులు ఉండటం కాంగ్రెస్ పార్టీ అదృష్టం. అధికార పార్టీ బెదిరింపులకు, కేసులకు భయపడకుండా ఒంటరి పోరాటం చేసిన వ్యక్తి మల్లన్న. మూడు జిల్లాల్లో ఉన్న ఎంఎల్ఏ లు మెజారిటీ ఇస్తాం అంటున్నారు.. మన డోర్నకల్ నియోజకవర్గం ఎక్కువ ఇవ్వాలి.
మీరిచ్చిన మనో ధైర్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మా వంతు కృషి చేస్తాం” అని మంత్రి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా చేసేందుకు కుట్ర.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్ ను జాయింట్ క్యాపిటల్ చేసే కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ పై జరుగుతున్న కుట్రను ఆపాలంటే mlc గా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్ లో వర్ధన్నపేట నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హరీష్ రావు హాజరై మాట్లాడారు. గోదావరి నీళ్లను ఒక్క చుక్కా తీసుకోకద్దు అంటూ కొట్లాడామన్నారు. ఇప్పుడు ప్రభుత్వం గోదావరి నీళ్లు కాపాడే ప్రయత్నమే చేయడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరిని మోసం చేసిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఒక్కనాడు కూడా జై తెలంగాణ అనలేదని అంటున్నారన్నారు.

ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు.. ఆయన మీద బురద జల్లుతున్నారు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద బీజేపీ ఫ్లోర్ లిడర్ ఏలేటి మహేశ్వరెడ్డి బట్టకాలల్చి మీద వేస్తుండు అని వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆయన కు ఎందుకు కోపమొచ్చిందో అర్థం కాట్లేదని ఆయన అన్నారు. ఉత్తమ్ వైట్ పేపర్ లాంటి వాడు,ఆయన మీద బురద జల్లుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వర్షాలు పడి ధాన్యం తడిసిందన్నారు జగ్గారెడ్డి. తడిసిన ప్రతి గింజా ప్రభుత్వం కొంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్పారని, రైతులు,రైస్ మిల్లర్లు ఇబ్బంది పడొద్దని నష్ట కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుందన్నారు జగ్గారెడ్డి. అధికార పార్టీ మీద ప్రతిపక్ష పార్టీలు బురద జల్లడం సహజమేనని, ఐదు ఏండ్లు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా ఉంటాడని ఆయన వ్యాఖ్యానించారు. ఆయనను ఎవరు డిస్టర్బ్ చేయరని, ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఆధారాలు లేని అభియోగాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పోలీసులకు తప్పుడు పేరిచ్చిన హేమ.. అందుకే ఇంత రచ్చ?

బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అక్కడ పోలీసులకు చిక్కిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించి డ్రగ్స్ టెస్ట్ కి పంపించారు. డ్రగ్స్ టెస్టులో 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. అందులో 27 మంది మహిళల రక్త నమూనాలలో డ్రగ్స్ ఉన్నట్లు కూడా నిర్ధారించారు. ఇక ఈ రేవ్ పార్టీలో నటి హేమ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ టెస్టుల్లో నటి హేమకు పాజిటివ్ నిర్ధారణ అయిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే హేమ గురించి మరో సంచలనం విషయం కూడా బయట పడింది. ఈ అంశం మరింత షాక్ కలిగిస్తోంది. అదేమంటే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పట్టుబడ్డప్పుడు నటి తన పేరు బయట పడకుండా జాగ్రత్త పడినట్లు తాజాగా వెల్లడైంది.

నేను వాస్తవాలు చెప్పాను కాబట్టే ఉత్తమ్ మొహం చాటేశారు

ఉత్తమ్ స్పందన కోసం నిన్న పొద్దుపోయేదాకా ఎదురు చూసిన.. నేను వాస్తవాలు చెప్పాను కాబట్టే ఉత్తమ్ మొహం చాటేశారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ఏం చేయాలో తెలియక నాపై పోలీస్ కేసు పెట్టించారని, ఉత్తమ్ కు చేతనైతే బహిరంగ చర్చకు రావాలన్నారు మహేశ్వర్‌ రెడ్డి. లేదా సిట్టింగ్ జడ్జితో కమిటీ వేసిన సరే సాక్ష్యాధారాలతో నిరూపించడానికి రెడీ గా ఉన్నానని, సివిల్ సప్లై లో ఉన్న అవకతవకలు ఏ విధంగా సరి చేస్తారో చెప్పాలన్నారు మహేశ్వర్‌ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టమంటే పెట్టానని జగ్గారెడ్డి చెబుతున్నారని, సివిల్ సప్లై మీద జగ్గ రెడ్డికి అవగాహన ఉండొచ్చు అని ఆయన మండిపడ్డారు. పోలీస్ కేసుల వల్ల సమస్య పరిష్కారం కాదని, 25- 1-24 న ఇచ్చిన జీవో లో స్పష్టంగా టెండర్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పారన్నారు. అదే రోజు గ్లోబల్ టెండర్ పిలిచారని, గ్లోబల్ టెండర్ కోసం వివిధ రాష్ట్రాల నుంచి కొంత మంది వచ్చింది నిజం కాదా.. ? అదే రోజు కొంత మంది మిల్లర్లను పిలిచి ఏం చేశారో అధారాతో బయట పెట్టమంటారా..? చౌహాన్, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు చెప్పాలన్నారు. క్వింటాలుకు 216 రూపాయాలు రైస్ మిల్లర్లు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేసింది నిజం కాదా..? అని ఆయన ప్రశ్నించారు. మీరు చేసిన వసూళ్ల అరాచకం బయట పెట్టమంటారా..? అని ఆయన అన్నారు.

హైద‌రాబాద్ రోడ్లపై వర‌ద నీటిలో కూర్చుని మ‌హిళ నిర‌స‌న‌..

హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మహిళ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. హైదరాబాద్‌లో రోడ్లన్నీ గుంతలుగా మారాయని, వరద నీరు మిగిలిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె వెరైటీగా నిరసన తెలిపింది. రోడ్డు పక్కనే ఉన్న వరద నీటి గుంతలో కూర్చొని వినూత్న రీతిలో ఆమె నిరసన తెలిపారు.

నాగోలు – బండ్లగూడ రహదారిలోని ఆనంద్ నగర్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. రోడ్డు మధ్యలో ఉన్న గుంతల్లో వర్షపు నీరు నిలవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందన్నారు. కొత్త రోడ్డును నిర్మించాలని ఆమె కోరారు. ట్రాఫిక్ పోలీసులు ఆమెను ట్రాఫిక్ పోలీసులు న‌చ్చ‌జెప్పినా ఆమె వినలేదు. రోడ్డును పూర్తి చేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు స్పష్టమైన హామీ ఇస్తేనే నిరసన విరమిస్తానని ఆమెను కదలకుండా అలాగే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి అనేక ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారాయి.