అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది..
అంబేద్కర్ ఆశయాలకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఓ.బి.సి మోర్చ జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. డా. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. బడుగు బలహీనర్గాలు, దళితులు, ఆదివాసుల అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా మోది చేస్తున్న కృషి ఫలితంగానే బాబా సాహెబ్ కలల సాకారం అవుతున్నాయన్నారు. అంబేద్కర్ ఆశయాల సాకారం కొరకు మోది ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానాలను మోడీ ప్రభుత్వం అమలు పరుస్తోందని తెలిపారు. అన్ని రంగాల్లో దళితులకు ఆదివాసులకు బలహీన వర్గాలకు మోది ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తూ వస్తుందన్నారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనే నినాదంతో మోడీ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుందన్నారు. 75 సంవత్సారాల స్వాతంత్ర్య దేశంలో మొదటి సారి ఆదివాసి మహిళను రాష్ట్రపతి చేసింది మోడీ ప్రభుత్వం అని తెలిపారు.
సీఎం జగన్‌పై దాడి.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనపై మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతుందన్నారు. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో, ఇప్పుడు దాడులు జరిగాయని ఆయన ఆరోపణలు చేశారు. సీఎం జగన్‌కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్‌పై దాడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు చెప్పారన్నారు. కులాన్మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు.. చంద్రబాబు మాటలు విని సీఎం జగన్‌ను చంపడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. చాలా పకడ్బందీగా వ్యూహం ప్రకారంగా గురి చూసి కొట్టాలని ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్ను వద్ద తగిలింది.. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్ గాయంతో బయటపడ్డారన్నారు.
జగన్‌పై దాడి.. పిరికిపందల చర్య
సీఎం జగన్‌పై దాడి దారుణమని.. దాడిని వైఎస్‌ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. . సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని.. ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. దాడికి ఎయిర్‌గన్ ఉపయోగించి ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇది ఆకతాయిలు చేసిన పని కాదు.. పక్కా ప్లాన్‌తో చేశారన్నారు. భద్రతా వైఫల్యం అంటూ మాట్లాడుతున్నారు.. దాడిని నటన అంటున్నారు.. ఎవరైనా తమపై తామే ఇలాంటి దాడి చేయించుకుంటారా అంటూ సజ్జల ప్రశ్నించారు. కడుపునకు అన్నం తినేవారు ఎవరైనా ఇలా మాట్లాడరని సజ్జల మండిపడ్డారు. అసలు నటించేది ఎవరో అందరికీ తెలుసన్నారు. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికే ప్రమాదం జరిగేదని.. కొంచెం కిందకు తగిలిఉంటే కన్ను పోయేదని ఆయన చెప్పారు. ఈ ఘటనలో వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తీవ్రంగా గాయపడ్డారన్నారు.
సీఎం జగన్‌పై దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. ఏకంగా సీఎంపై దాడి జరగడమేంటని సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై సీఈసీ ఆందోళన వ్యక్తం చేస్తూ.. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి చెందిన కొందరు పోలీస్ అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్‌షోలో భద్రతా వైఫల్యంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నలు సంధించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యంపై ఇప్పటికే ఐజీ, ఎస్పీలపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. జగన్ రోడ్ షోలో జరిగిన ఘటనపైనా సంబంధిత అధికారులపై సీఈసీ చర్యలు తీసుకునే అవకాశముంది.
నీకెందుకు అంత బాధ.. అభిమానిపై జగ్గారెడ్డి
ఓడిపోయిన నేను చెప్పులు వేసుకుని తిరుగుతున్న.. నేను గెలవాలని తిరిగిన నా భార్య చెప్పులు వేసుకుని తిరుగుతుంది.. నీకెందుకు అంత బాధ అంటూ సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో అభిమానికి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హితబోధ చేశారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో కార్యకర్తలు కష్టపడ్డ నా టైం బాగలేక సంగారెడ్డిలో నేను ఓడిపోయిన అన్నారు. సంగారెడ్డిలో నేను ఓడిపోయిన మెదక్ పార్లమెంట్ లో మాత్రం కాంగ్రెస్ గెలవాలన్నారు. దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నారు.
రాష్ట్రంలో బలిజలందరూ ఐక్యంగా ఉండి వైసీపీని ఓడించాలి
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో బలిజల ఆత్మీయ సమావేశంలో మాజీ సీఎం, రాజంపేట పార్లమెంట్ బీజేపీ, టీడీపీ, జనసేన ఉమ్మడి కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బలిజలందరూ ఐక్యంగా ఉండి వైసీపీని ఓడించాలన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం తాను కూడా పాల్గొంటానని, అదే విధంగా రాజంపేట పార్లమెంట్ పరిధిలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారన్నారు. తొలి సినిమాతో స్ట్రగుల్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్, రాష్ట్ర ప్రజలందరి అభిమానం పవర్ స్టార్ గా మారారని ఆయన వెల్లడించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూడా స్ట్రగుల్ స్టార్ గానే ఉన్నారని, బీజేపీ,టిడిపి, జనసేన ను పవన్ కలిపారని ఆయన వ్యాఖ్యానించారు.
విజయ సంకల్ప అభియాన్ పేరుతో ఇంటి ఇంటికి బీజేపీ
విజయ సంకల్ప అభియాన్ పేరుతో ఇంటి ఇంటికి బీజేపీ కార్యక్రమమన్నారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. మొదటి విడతగా ఈ నెల 15, 16వ తేదీల్లో ఉంటుందని, బూత్ స్థాయి కార్యకర్త నుంచి రాష్ట్ర అధ్యక్షుడు వరకు ఇందులో భాగస్వామ్యం అవుతారన్నారు. హైదర్ గూడ ముత్యాల బాగ్ పోలింగ్ బూత్ 26 లో కిషన్ రెడ్డి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. జ్యోతీ నగర్ – కరీం నగర్ లో బండి సంజయ్, నారాయణపేట లో డీకే అరుణ, మేడ్చల్ – ఈటెల రాజేందర్, ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటి ఇంటికి వెళ్లి సంకల్ప పత్రం ఇచ్చి… స్టికర్ అంటిస్తామని ఆయన వెల్లడించారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జానారెడ్డి కుటుంబాల నుంచి రాజకీయంగా విముక్తికావాలని కోరుకుంటున్న ప్రజలు బీజేపీవైపు చూస్తున్నారన్నారు. బీజేపీఎంపీ అభ్యర్థి గెలుపు ఖాయం అన్నారు.
బీజేపీ లోక్‌సభ మ్యానిఫెస్టోపై ఆరోపించిన విపక్షాలు..!
2024 లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఆదివారం నాడు ఆరోపించాయి. ఎన్నికల పత్రంలో చేసిన వాగ్దానాలు “అబద్ధాలతో నిండి ఉన్నాయి., అలాగే అవి అవిశ్వసనీయమైనవి అని ఆరోపించాయి. మేనిఫెస్టోలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణాన్ని కాషాయ పార్టీ పట్టించుకోలేదని ఆరోపించారు వారు ఆరోపించారు. బీజేపీ మేనిఫెస్టోలో పేదలు, యువకులు, రైతులు, మహిళలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల పత్రాన్ని విడుదల చేస్తూ., తమ ప్రభుత్వం ఏకరూప పౌర నియమావళిని (యూసీసీ) అమలు చేస్తామని, ఏకకాలంలో ఎన్నికలు (ఒకే దేశం, ఒకే ఎన్నికలు) నిర్వహిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హక్కులను బీజేపీ కాలరాస్తుంది
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుతానని అభివృద్ధి ముందు ఉంచుతా అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. అనంతరం.. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నా నాలుకపై మచ్చలు ఉన్నాయి నేనేమంటే అదే జరుగుతుంది గతంలో ఇదే స్థలంలో రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని అంబేద్కర్ సాక్షిగా చెప్పానన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి అయ్యారని, ఇదే స్థలంలో ఇదే అంబేద్కర్ సాక్షిగా చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తాడన్నారు. ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నమ్మబలికి పది సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆర్టిఐ కింద అప్లై చేస్తే ఏడు లక్షల ఉద్యోగులు మాత్రమే ఇచ్చారు 20 కోట్లు ఎక్కడ ఏడు లక్షలు ఎక్కడ బిజెపి పార్టీకి సిగ్గు ఉండాలన్నారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజల ముందు మేనిఫెస్టోను పెట్టాం..
వికసిత్ భారత్ పేరుతో బీజేపీ సంకల్ప్ పత్రం ఈరోజు విడుదల చేశామని తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల కోసం దేశ ప్రజల ముందు మేనిఫెస్టోను పెట్టామని, దేశ కళ్యాణం, దేశ హితం కోసం మేము మేనిఫెస్టో ప్రవేశ పెట్టామన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులకు సంబంధించిన ప్రధాన అంశాలను మేనిఫెస్టోలో పెట్టామని, ముఖ్యంగా ఈ నాలుగు అంశాలపైనా రాబోయే ఐదేళ్లు పని చేస్తామన్నారు. రాబోయే ఐదేళ్ల పాటు ఉచిత రేషన్ బియ్యం ఇస్తామని సంకల్ప పత్రంలో పెట్టామని, ఆయుష్మాన్ భారత్ ను పొడగించాం.. ఇది పెద్ద నిర్ణయమన్నారు. తక్కువ ధరకు మెడిసిన్స్ అందించే స్కీమ్ ను తీసుకువస్తామని, గత పదేళ్లుగా నాలుగు కోట్ల ఇళ్లు కట్టాం.. రాబోయే ఐదేళ్లల్లో మూడు కోట్ల ఇల్లు కట్టాలని నిర్ణయించామన్నారు
