Site icon NTV Telugu

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Ntv Top Hl 5pm

Ntv Top Hl 5pm

‘గ్రూప్‌-2’ అభ్యర్థుల సమస్య ఏంటీ? అసలు పరీక్ష వాయిదా ఎందుకు?

తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై గందరగోళం కొనసాగుతోంది. అదే నెలలో ముఖ్యమైన పరీక్షలు జరగనుండగా.. తమకు అన్యాయం జరుగుతోందని, మరోవైపు గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు కోరుతున్నారు. దీంతో ఇరువర్గాలు విజ్ఞప్తులు చేయడంతో రాష్ట్రంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కానీ టీఎస్ పీఎస్సీ వీటిపై నిర్ణయం తీసుకోవడం లేదు. గ్రూప్-2 వాయిదా వేయాలన్న అభ్యర్థుల డిమాండ్‌పై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించింది. TSPSC చైర్మన్ ఇప్పుడు అందుబాటులో లేరని, దీనికి రెండు రోజులు పడుతుందని TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేసారు. కానీ గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే.

గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు బోర్డు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. గ్రూప్-2 వాయిదాపై బోర్డు అధికారులు రెండు రోజుల సమయం కోరారు. అయితే బోర్డు చైర్మన్ జనార్దన్ రెడ్డి అందుబాటులో లేరని సమాచారం. దీంతో బోర్డు అధికారులకు బోర్డుపై నమ్మకం లేకుండా పోయింది. చైర్మన్‌ను మార్చాలని అభ్యర్థులు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ‘గ్రూప్-2’ పరీక్ష వాయిదా వేయాలంటూ ఒకవైపు ధర్నాలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 9, 30 తేదీల్లో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 150 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.గురుకుల నియామక పరీక్షలు ఇతరత్రా ఉన్నందున గ్రూప్-2ను రీషెడ్యూల్ చేయాలని పిటిషన్‌లో కోరారు.

2075 నాటికి భారత్ ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ.. జపాన్, అమెరికా వెనకే

భారత ఆర్థిక వ్యవస్థ రాకెట్ వేగంతో పరుగుతీస్తోంది. ప్రస్తుతం ఈ దేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఉంది. 2075 నాటికి ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇది మాత్రమే కాదు.. ఇది జపాన్, జర్మనీతో పాటు అగ్రరాజ్యంగా పిలువబడే అమెరికాను వెనక్కినెట్టనుంది. గోల్డ్‌మన్ సాక్స్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో 2100 నాటికి భారతదేశ జనాభా ప్రపంచంలోని అన్ని దేశాలను అధిగమిస్తుందని పేర్కొంది. ఇక్కడ జనాభా 1,529 మిలియన్ల వరకు ఉంటుంది. దీనితో పాటు భారతదేశ జిడిపి కూడా వేగంగా పెరుగుతుందని అంచనా. దీని తరువాత చైనా జనాభా అత్యధికంగా 767 మిలియన్లుగా అంచనా వేయబడింది. వీటి తర్వాత నైజీరియా జనాభా 546 మిలియన్లు, పాకిస్తాన్ 487 మిలియన్లు, కాంగో 432 మిలియన్లకు చేరుకుంటుంది.

రాజ్యసభ నుంచి ఆప్‌ ఎంపీ రాఘవ్ చద్దా సస్పెన్షన్

రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాపై ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు. నలుగురు రాజ్యసభ ఎంపీల తమ అనుమతి లేకుండా తమ పేర్లను ఆగస్టు 7న తీర్మానంలో పొందుపరిచారని పేర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌కర్ బుధవారం ఎంపీల ఫిర్యాదులను ప్రివిలేజెస్ కమిటీకి పంపారు.

ఎంపీలు సస్మిత్ పాత్ర, ఎస్ ఫాంగ్నాన్ కొన్యాక్, ఎం తంబిదురై, నరహరి అమీన్ తమను అడగకుండానే తమ పేర్లను హౌస్ ప్యానెల్‌లో చేర్చారని రాఘవ్ చద్దాపై ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ రాఘవ్ చద్దాను ఉద్దేశపూర్వకంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తోందని ఆప్ ఆరోపించింది. రాఘవ్ చద్దాపై ఫోర్జరీ సంతకాల ఆరోపణలు తప్పుడు, రాజకీయ ప్రేరేపితమైనవి అని ఆ పార్టీ పేర్కొంది పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు రాఘవ్ చద్దాను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుందని ఆప్ ఆరోపించింది.

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు

ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడుకుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా కర్నూలులో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పెద్ద సైఖోలు అని ఎమ్మెల్యే కాటసాని విమర్శించారు. ప్రజలు రాజకీయకులను చీదరించుకునేలా చంద్రబాబు, పవన్ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కు చైతనైతే గడప గడపకు రా.. వాలంటీర్ల సేవ ఎంటో తెలుస్తుంది అని ఎమ్మెల్యే హెచ్చరించారు. వాలంటీర్ వ్యవస్థతో సీఎం జగన్ కు మంచి పేరు వస్తుందని భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నిజ జీవితంలో సినిమా డైలాగులు పనికిరావని విమర్శించారు.

చివరి ప్రాంతాలకు గోదావరి నీళ్లను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏర్పాటు చేసిన బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి, జడ్పీ ఛైర్మన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 300 మందికి బీసీ కులవృత్తుల చెక్కుల పంపిణీ చేశారు. మంత్రి జగదీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు గతంలో 10వేల రూపాయలు సహాయం కంటే ఎక్కువ ఇవ్వలేదన్నారు. ఒక్కసారి లబ్ధిపొందిన మళ్ళీ 10 సంవత్సరాల వరకు ఎలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చేవి కాదని, నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి పారుతున్న సాగునీరును ఆంధ్రప్రాంతానికి పంపిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంది అని ఆయన విమర్శలు గుప్పించారు. నాగార్జున సాగర్ డ్యామ్ కటింది తెలంగాణ ప్రజలు.. ఎక్కడో ఉన్న ఆంధ్ర వాళ్ళు వచ్చి నీళ్లు తీసుకెళ్లారని, చివరి ప్రాంతాలకు గోదావరి నీళ్లను అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వంది అని ఆయన కొనియాడారు.

చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయిరెడ్డి చురకలు

ట్విట్టర్ వేదికగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎప్పటికప్పుడు ప్రతిపక్ష నేతలపై దాడులకు దిగున్న అధికార పార్టీ నేతలు.. తాజాగా ట్విట్టర్ లో చంద్రబాబుకు చురకలు అంటించారు. చంద్రబాబు గారు.. బెంజమిన్ ఫ్రాంక్లిన్, మైఖేల్ ఫారెడీలను మించిపోయారని, సరికొత్త పద్ధతిలో విద్యుత్‌ను కనిపెట్టారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా.. మైక్ ఇస్తే చాలు ఏదో మాట్లాడుతున్నారన్నారు. రెండు రోజుల తర్వాత గాలి, నీరు కూడా తానే కనిపెట్టానని అంటారేమో.. హతవిధీ! అని ట్వీట్ చేశారు.

అంతేకాకుండా మరో ట్వీట్‌ కూడా చేశారు. అందులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 51 శాతం ఓట్లు రావడం ఖాయమని విజయసాయి ధీమా వ్యక్తం చేశారు. 2024లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రెండో స్థానానికి గట్టి పోటీ ఏర్పడిందని, ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటర్లు జనసేన పార్టీకి, జనసేన పార్టీ ఓటర్లు బీజేపీకి మారుతారనే అభిప్రాయం బలంగా ఉందని ఎద్దేవా చేశారు. ఏది ఏమైనప్పటికీ.. వైసీపీ మాత్రం 51 శాతం ఓటింగ్‌తో అద్భుత విజయం సాధిస్తుందన్నారు. ప్రతిపక్షాలు 2024కు బదులు 2029 ఎన్నికలపై దృష్టి సారించాలని విజయసాయి చురకలు అంటించారు.

అది తలుచుకుని తీవ్రంగా బాధపడుతున్న హాట్ బ్యూటీ..

అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అషురెడ్డి ని ఆమె ఫ్యాన్స్ జూనియర్ సమంత అని ముద్దుగా పిలుచుకుంటారు.ఈ భామ బిగ్ బాస్ షోతో బాగా పాపులర్ అయింది.. సోషల్ మీడియా లో బాగా పాపులర్ కావడంతో బిగ్ బాస్ సీజన్ 3లో అషురెడ్డికి అవకాశం వచ్చింది. అలాగే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో కూడా అషురెడ్డి పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ ఓటీటీ వర్షన్ అంతగా ప్రేక్షకాదరణ దక్కించుకోలేకపోయింది.ఈ భామ బుల్లి తెరపై కామెడీ షో లో కూడా నటించింది.ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ భామ నిత్యం తన హాట్ ఫోటోలతో కనువిందు చేస్తూ ఉంటుంది.

కానీ అషురెడ్డి తాజాగా ఏడుస్తూ కనిపించింది. కన్నీరు పెట్టుకుంటున్న వీడియో ను షేర్ చేయడంతో ఫ్యాన్స్ కూడా ఏమైందా అని తెగ కామెంట్స్ పెడుతున్నారు.. అషురెడ్డి మనసుకు ఎక్కడ గాయమైంది అస్సలు ఎందుకు ఏడుస్తుంది అని ఫ్యాన్స్ తెగ ఆరా తీస్తున్నారు. అయితే ఈ విషయంలో ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె తన జిమ్ వర్క్ అవుట్స్ లో వున్న కష్టాన్ని తలచుకుని బాధపడుతుంది. అషు రెడ్డి ప్రస్తుతం ప్రొఫెషన్ లో భాగంగా అమెరికాలో ఉంటున్నారని సమాచారం. బుల్లితెర మీద అషురెడ్డి జోరు బాగా తగ్గింది. ఆమె ప్రస్తుతం నటిగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది.రీసెంట్ గా ఈ భామ డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొనింది.. కబాలి చిత్ర నిర్మాత అయిన కేపీ చౌదరి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. విచారణలో ఓ 12 మందికి డ్రగ్స్ సప్లై చేసినట్లు కూడా కేపీ చౌదరి ఒప్పుకున్నాడు. పలువురు చిత్ర ప్రముఖులు రాజకీయవేత్తలతో అతనికి సంబంధాలు ఉన్నట్లు కొన్ని ఆధారాలు లభించాయి. తనపై వచ్చిన ఆరోపణలను అషురెడ్డి తీవ్రంగా ఖండించింది.

సదర్మట్ బ్యారేజ్‌పై తెలంగాణ ప్రభుత్వం పట్టింపేది…

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని అర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సదర్మట్ బ్యారేజ్‌పై తెలంగాణ ప్రభుత్వం పట్టింపేదని ఆయన ప్రశ్నించారు. రజాకార్ల హయాంలో వచ్చిన సాగునీరు కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేక పోతుందని, ఖానాపూర్, కడెం రైతుల వర ప్రదాయిని సదర్మట్ అయకట్ట మనుగడ కోల్పోతోందని ఆయన వ్యాఖ్యానించారు. సత్వరమే కెనాల్ గండ్లు పూడ్చి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో కడెం ప్రాజెక్టు అనేది వుందో లేదో అర్ధం కావడం లేదని ఆయన మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు గత సంవత్సర భయానక పరిస్థితి నుండి మరమ్మతులు చేయక పోవడం.. మొన్నటి విప్పత్తు తోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి జీవన్ రెడ్డి అన్నారు. రుణ మాఫీ పై స్పష్టమైన ఆదేశాలు లేవని రుణ మాఫీ వడ్డీ మాఫీకే పోతుందని విమర్శించారు. రైతులను ఆందోళనకు గురిచేయకుండా ఆదిశగా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. గత రెండు సంవత్సరాల కాలం నుండి రోళ్ళ వాగుపై ఆదరపడ్డా మత్స్యకారులు ఉపాధి లేక నష్టపోతున్నారని ప్రభుత్వం వారిని ఆదుకునేల చర్యలు చేపట్టాలని కోరారు.ఇప్పటి వరకు రోళ్ళవాగుకు షటరు బిగించక పోవడంతో నీటిని నిల్వచేసే సామర్ద్యంకు అవకాశం ఉండదని తెలిపారు.

పవన్ ఆటలో అరటిపండు.. మంత్రి రోజా ఘాటు విమర్శలు

వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మంత్రి ఆర్కే.రోజా ఘాటు విమర్శలు చేశారు. ఆటలో అరటిపండు లాంటి పవన్ కళ్యాణ్ జగన్ ను ఓ ఆట ఆడిస్తాడా అని సెటైర్లు వేశారు. దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరవమంటే అరుస్తాడు.. కరవమంటే కరుస్తాడని మంత్రి రోజా విమర్శించారు. పవన్ కి ఒక జెండా లేదు ఎజెండా లేదని దుయ్యబట్టారు. పవన్ తన బ్రో సినిమా నాలుగు ఆటలు ఆడించుకోలేకపోయాడు.. అలాంటి పవన్ జగన్ ని ఒక ఆట ఆడిస్తాడంట అని సెటైర్లు వేశారు. దేశాన్ని గడగడలాడించిన సోనియాకు జగన్ ను ఆడించడం కుదరలేదు.. అరటిపండు లాంటి పవన్ నువ్వు ఆడిస్తావా అంటూ విమర్శలు చేశారు.

రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు.. పాలమూరు కష్టాలు తీరినట్లే

పాలమూరు కష్టాలు తీరినట్లేనని, ముఖ్యమంత్రి కేసీఆర్ సుధీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ పాటికి ప్రాజెక్టు పూర్తయి ప్రజలకు రెండేళ్ల క్రితమే ప్రాజెక్టు ఫలితాలు ప్రజలకు అందాల్సి ఉన్నదని, ఒక వైపు ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, మరో వైపు కేంద్ర ప్రభుత్వం సహకరించని తీరుతో నిర్దిష్ట సమయంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్దమయ్యామన్నారు. మిగిలిన పనులను వీలయినంత తొందరగా పూర్తి చేస్తాం.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. కేసీఆర్ మాట ఇచ్చినట్లు పాలమూరు ప్రజల కాళ్లను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని, మడి, మడి తడుపుతానని శపథం చేశారన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగంపై రాహుల్‌గాంధీ ఫైర్

లోక్‌సభలో మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు. గురువారం పార్లమెంట్‌లో దాదాపు 2 గంటల 13 నిమిషాలు మాట్లాడిన ప్రధాని.. చివరకు మణిపూర్‌ అంశంపై 2 నిమిషాలు మాత్రమే మాట్లాడారని రాహుల్ గాంధీ విమర్శించారు. “మణిపూర్ నెలల తరబడి కాలిపోతోంది, ప్రజలను చంపుతున్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి, కానీ ప్రధాని నవ్వుతున్నారు. , జోకులు పేలుస్తున్నారు.. అది ఆయనకు సరిపోదు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

ఢిల్లీలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత సైన్యం రెండు రోజుల్లో ఈ పనికిమాలిన పనిని ఆపగలదని, కానీ ప్రధాని మణిపూర్‌ను తగలబెట్టాలనుకుంటున్నారని రాహుల్‌ గాంధీ ఆరోపించారు. మంటలను ఆర్పడం ఆయనకు ఇష్టం లేదని అన్నారు. 2028లో అవిశ్వాస తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ.. 2024లో మోడీ ప్రధాని అవుతారా అనేది ప్రశ్న కాదని.. పిల్లలు, ప్రజలు చంపబడుతున్న మణిపూర్ అంశమే ముఖ్యమని ఆయన చెప్పారు. ప్రధాని మోడీ ప్రసంగం భారతదేశం గురించి కాదని, నరేంద్ర మోడీ గురించి అంటూ రాహుల్ మండిపడ్డారు. ఆయన తన అభిప్రాయాలు, తమ రాజకీయాలు, ఆశయాల గురించి మాట్లాడుతున్నారని అన్నారు.

మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌న్నదే నా సంక‌ల్పం

జనగామ జిల్లాలోని వీఆర్‌ఏల రెగ్యులరైజేషన్ తో పాటు, వారిని వివిధ శాఖలకు కేటాయించిన ఆర్డర్స్ ను ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు మాట్లాడుతూ.. మ‌హిళ‌లు ఆర్థికంగా ఎద‌గాల‌న్నదే నా సంక‌ల్పమన్నారు. వారి కుటుంబాల‌ను వారే సాదుకునే స్థాయికి రావాలని, మ‌హిళ‌లు బాగుప‌డితే దేశం బాగుప‌డుతుందన్నారు. మ‌హిళ‌లు సైనికుల్లా ప‌ని చేయాలన్నారు మంత్రి ఎర్రబెల్లి. సీఎ కేసీఆర్‌ ఆధ్వర్యంలోనే మ‌హిళ‌ల‌కు మ‌హ‌ర్దశ‌ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గంలో ఎర్రబెల్లి ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాల‌ను సంద‌ర్శించి, ప‌రిశీలించి, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి స‌ర్టిఫికెట్లు పంపిణీ చేశారు మంత్రి ఎర్రబెల్లి.

రుషికొండలో టెన్షన్ టెన్షన్.. కాసేపట్లో విజిట్కు పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో మూడవ విడత వారాహి యాత్రలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా.. నేడు రుషికొండను విజిట్ చేయనున్నారు. అయితే పవన్ సందర్శన సందర్భంగా.. రుషికొండలో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు పోలీసుల ఆంక్షలు దాటకుని ఋషికొండ వెళ్లి తీరతామని జనసేన నేతలు అంటున్నారు. నిషేధిత ప్రాంతం కానప్పుడు ఎందుకు అడ్డుకుంటారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

నోవాటల్ హోటల్ నుండి ఋషికొండకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బయల్దేరి వెళ్లారు. ఆయన పర్యటన దృష్ట్యా.. రుషికొండకు వెళ్లే మార్గంలో భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు జోడిగుళ్లపాలెం, సాగర్ నగర్, ఋషికొండ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. ఋషికొండకు వెళ్లే మార్గాలు పోలీసులు మూసివేశారు. రుషికొండ పర్యటనకు అనుమతి లేకపోవడంతో ఎక్కడికక్కడ నియంత్రణ కోసం పోలీసులు సన్నద్ధం అయ్యారు. దీంతో రుషికొండ మొత్తం హైసెక్యూరిటీ జోన్ గా మారింది. మరోవైపు ఆంక్షలను ఉల్లంఘించయిన రుషికొండ వెళతామని జనసేన అంటోంది. ఆ ప్రాంతం నిషేధిత ప్రాతం కానందున ఆంక్షలు ఎందుకో చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే జనసేన నాయకులతో పోలీసులు సంప్రదింపులు జరిపారు. వాహనాల సంఖ్య పరిమితంగా ఉండాలని సూచిస్తున్నారు.

 

 

Exit mobile version