NTV Telugu Site icon

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి

ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. టీ బ్రేక్ అనంతరం అసెంబ్లీలో పొంగులేటి ధరణి పై మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది అని విశ్వాసంలో ఉన్నారు ప్రజలు అన్నారు. ధరణి నీ ఐఎల్ ఎఫ్ కంపనీకి అప్పగించారని మండిపడ్డారు. కంపనీ నీ కొన్ని కారణాలతో.. సింగపూర్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగపూర్ కంపనీ కి తెలంగాణ భూములు తాకట్టు పెట్టారు కేసీఆర్ అని మండిపడ్డారు. డిఫాల్ట్ కంపనీ కి ధరణి పోర్టల్ అప్పగించారని అన్నారు. ధరణి తో గుంట భూమి కూడా అమ్ముకోలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన నిర్వాకం… రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. ఇద్దరు వ్యక్తులు కూర్చొని చేసిన చట్టం ధరణి అన్నారు. ఆల్ ఇన్ వన్ గా చెప్పుకున్న పెద్దాయన చేసిన నిర్వాకం ఇది అని తెలిపారు.

ప్రేమ పేరుతో వేధింపులు.. మైనర్ బాలిక ఆత్మహత్య..

ప్రేమ పేరుతో ఓ యువకుడి వేధింపుల కారణంగా మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్‌లో శారద, కుమార్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు. మొదటి అమ్మాయి శాలిని సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ లో వసతి గృహంలో ఉంటూ తొమ్మిదవ తరగతి చదువుతోంది. ఇటీవల ఆమె బాలాజీ నగర్ లోని తన ఇంటికి వచ్చింది. అదే ప్రాంతానికి చెందిన శివ కూల్ డ్రింక్ షాపులో పనిచేస్తున్నాడు. శాలిని ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. ప్రేమ పేరుతో లైగింక వేధింపులు భరించని శాలిని చివరకు ఆత్మహత్య చేసుకునేందుకు పాల్పడించిది. నిన్న రాత్రి సమయంలో శివ వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మాజీ మంత్రి.. బొత్స పేరును ప్రకటించిన జగన్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగనున్నారు.. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణను ఎంపిక చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ నేతలతో సమావేశమైన జగన్‌.. ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.. ఆ తర్వాత బొత్సను తమ అభ్యర్థిగా ప్రకటించారు వైఎస్‌ జగన్‌..

తెలుగు యూనివ‌ర్సిటీకి సుర‌వ‌రం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగ‌తిస్తాం..

తెలుగు యూనివ‌ర్సిటీకి సుర‌వ‌రం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే స్వాగ‌తిస్తామని కేటీఆర్ అన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి లేఖ రాశారన్నారు. సురవరం ప్రతాపరెడ్డి పేరు తెలుగు విశ్వవిద్యాలయంకి పెట్టాలి అని అడిగారన్నారు. టీఎస్ నీ టీజీగా చేస్తేనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే సురవరం పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పెట్టడానికి మాకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి మాటలకు కేటీఆర్ స్పందిస్తూ సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని గత ప్రభుత్వం కేసీఆర్ నిర్ణయించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. పదేళ్లుగా పాటు విభజన జరగకపోవడంతో పేరు పెట్టలేకపోయామని.. ఇప్పుడు విభజన జరిగిందని.. తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడితే తప్పేంటని కేటీఆర్ స్పష్టం చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు పెట్టడం సబబు కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ సభలో ఇతర సభ్యులు అంగీకరిస్తే మాకు అభ్యంతరం లేదని రేవంత్ అన్నారు. రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఇలా స్పందించారు.

ధరణి ఎప్పుడు మారుస్తారని ప్రజలు అడుగుతున్నారు..

ధరణి ఎప్పుడు మారుస్తారు అని ప్రజలు అడుగుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. పాత పెపర్ల పేరుతో.. ఇప్పుడు పట్టా మా పేరు మీద ఉంది అని వస్తున్నారని మండిపడ్డారు. కాస్తు కాలమే లేకుండా చేశారు మీరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్‌ఓ లు తప్పులు చేస్తున్నారు అని తీసేశారని.. మరి సెట్ చేశారా? ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇచ్చిన భూములు కూడా లాక్కున్నారు మీరు..సిలింగ్ యాక్ట్ తుంగలో తొక్కారని అన్నారు. ఫార్మ్ హౌజ్ ల పేరుతో యాక్ట్ కి తూట్లు పొడుస్తున్నారని సీతక్క మండిపడ్డారు. ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రైతు బంధు ఒకరికి దున్నేటోరు ఏమో మరొకరు రికార్డులో మార్చుకుందామన్న దాదాపు ధరణి వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాడు.

వ్యవసాయ శాఖపై మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష నిర్వహించారు.. రాయితీపై బిందు సేద్యం అమలు చేసే అంశంపై చర్చించారు.. రైతులకు తక్షణమే రాయితీపై బిందు సేద్యానికి అవసరమైన ఎక్విప్మెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.. తక్షణమే రిజిస్ట్రేషన్ ప్రారంభించాలని పేర్కొన్న ఆయన.. గత వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రూ.1167 కోట్ల బకాయిలు పెట్టిందని మండిపడ్డారు.. వైఎస్‌ జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో బిందు సేద్యం నిర్వీర్యం అయ్యిందని విమర్శించారు.. దేశంలో ముందున్న రాష్ట్రాన్ని దేశంలోనే చివరి స్థానంలోకి జగన్ ప్రభుత్వం తీసుకెళ్లిందని ఆరోపించారు.. కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా అందించే బిందు సేద్యం ఫండ్ కూడా జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదన్నారు. రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం తీవ్ర కక్ష పూరిత ధోరణి అవలంభించిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు, రైతు శ్రేయస్సు కోసం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు.. కాగా, టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వంలో.. చంద్రబాబు కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అచ్చెన్నాయుడు.. వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు.. గత ప్రభుత్వ హయాంలో.. అవకతవకలు, అవినీతి జరిగిందంటూ తీవ్రస్థాయిలో మండిపడుతోన్న విషయం విదితమే.

తొందరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తాం..

ఆరోగ్య శ్రీ అమలుపై ఏపీ వైద్య మంత్రి సత్య కుమార్ మాట్లాడుతూ.. ఆరోగ్య శ్రీ ఎక్కడికి పోదు… యధావిధిగా నిర్వహిస్తామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కు గత 5 ఏళ్లలో 13 సార్లు నోటీసులు ఇచ్చారు.. ఎన్డీయే అధికారంలోకి వచ్చి 50 రోజుల్లో.. అప్పుడే దుష్ప్రచారం చేస్తున్నారు.. 5 సంవత్సరాల నుంచి అన్ని శాఖలను జగన్ నిర్వీర్యం చేశారు.. ఎయిమ్స్ హాస్పిటల్ కేవలం 16 నెలల్లో పూర్తి అయింది.. జగన్ సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజీకే మౌలిక సదుపాయాలు చేయలేకపోయారు.. వైద్య విద్యలో, ఆరోగ్య శాఖలో విధ్వంసం చేశారు.. త్వరలోనే రాష్ట్రంలో అన్ని శాఖలను ప్రక్షాళన చేస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.

భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే.. ఈ రోజు అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తో బీఅర్ఎస్ నేతలు వేల కోట్ల ఎకరాలు కబ్జా చేశారని వార్తలు వచ్చాయన్నారు. ఆ నేతలు ఎవరు? కాజేసిన భూమి ఎది? అనేది కాంగ్రెస్ బహిర్గతం చేయడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరి కాకి లెక్కలు చెప్తున్నారని ఆయన మండిపడ్డారు. భూములు ఎవరు కాజేశారనేది వెల్లడించాలని మహేశ్వర్‌ రెడ్డి కోరారు. మంత్రి మాట్లాడుతూ….భూముల విషయం మీ అంతరాత్మకు తెలుసు అని మాట్లాడుతున్నారని, ప్రజా సమస్యలు ఇక్కడ కాక ఎక్కడ మాట్లాడతారు ? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు రికవరీ చేశారు ? అని ఆయన అన్నారు. గతంలో ఇది 2 లక్షల కోట్ల కుంభకోణం అంటూ ఆరోపణలు చేసారని మహేశ్వర్‌ రెడ్డి వెల్లడించారు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల రోగులకు తీవ్ర ఇబ్బందులు..

అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రినీ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాలను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో సూపరింటెండెంట్‌ డాక్టర్ డేవిడ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణంలో నాసిరక పనులు చేపట్టారంటూ కాంట్రాక్టర్ పై ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో నిధులు లేకపోవడంతోనే హడావుడిగా ఆసుపత్రిని అరాకొర వసతులతో ప్రారంభించారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.

మహిళా- శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు..!

ఏపీ స‌చివాల‌యంలో మ‌హిళా- శిశు సంక్షేమ శాఖ‌పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మహిళలు, అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల కోసం అమలవుతున్న కార్యక్రమాలపై సమీక్షించారు. అంగ‌న్వాడీ కేంద్రాలు, మహిళా సాధికారత, మాతా శిశుమరణాలు, మిషన్ వాత్సల్య కింద చేపట్టే చైల్డ్ ప్రొటెక్షన్ కార్యక్రమాల గురించి అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. గర్భిణులు, బాలింతలకు అమలవుతున్న పథకాలు, పిల్లలకు అందించే పౌష్టికాహార పథకాలపై ఆరా తీశారు. 2014లో ప్రవేశ పెట్టిన బాలామృతం, అమృత హస్తం, గోరుముద్ద, గిరి గోరుముద్ద, బాల సంజీవని లాంటి పథకాల స్థితిగతులను సీఎం చంద్రబాబు తెలుసుకున్నారు.