Site icon NTV Telugu

Top Headlines @1PM: టాప్‌ న్యూస్‌!

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

ఐపీఎల్ తరహాలో ఆసక్తిగా ఏపీఎల్ 2025 వేలం:
ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్) 2025 వేలం ప్రక్రియ కొనసాగుతోంది. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. ఏపీఎల్‌ సీజన్ 4 కోసం 520 మంది క్రికెటర్లు వేలంలో పేరు నమోదు చేసుకుకోగా.. ఏడు జట్ల యాజమాన్యం ప్లేయర్స్ కోసం పోటీ పడుతున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలో ప్లేయర్స్ ఆక్షన్ జరుగుతోంది. వేలంలో ఇప్పటివరకు పైలా అవినాష్‌కు భారీ ధర దక్కింది. రూ.11.5 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు అతడిని సొంతం చేసుకుంది. పీవీ సత్యానారాయణ రాజును రూ.9.8 లక్షలకు భీమవరం బుల్స్ జట్టు కైవసం చేసుకుంది.

సరోజాదేవి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు:
ప్రముఖ నటి, పద్మభూషణ్ పురస్కార గ్రహీత బి.సరోజాదేవి మృతి పట్ల మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ సంతాపం తెలిపారు. తెలుగు, కన్నడ, తమిళ బాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని పేరొన్నారు. ‘సరోజాదేవి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. సరోజాదేవి గారు చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆమె ఎన్నో అద్భుతమైన పాత్రలతో సినీ ప్రేక్షకులను అలరించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సరోజాదేవి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’అని వైఎస్ జగన్‌ పేరొన్నారు.

సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్:
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులు ఢిల్లీలో పర్యటించనున్నారు. మంగళ, బుధవారాల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రాష్ట్ర ప్రాజెక్టులు, నిధులపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మాజీ ప్రధాని పీవీ సంస్మరణ సభ, సీఐఐ బిజినెస్ మీట్‌లో చంద్రబాబు పాల్గొననున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తదితరులతో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా వేర్వేరు అంశాలపై సీఎం కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన పనుల గురించి కూడా ఆయా మంత్రిత్వ శాఖతో సీఎం చర్చలు చేయనున్నారు.

పేషెంట్ పై వార్డ్ బాయ్ అత్యాచారయత్నం:
హైదరాబాద్ విద్యానగర్ లోని ఆంధ్ర మహిళా సభ ఆసుపత్రిలో దారుణం వెలుగుచూసింది. ఓ వార్డ్ బాయ్ మహిళా పేషెంట్ పై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ట్రీట్ మెంట్ కోసం వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు వార్డ్ బాయ్. అసభ్య ప్రవర్తనతో మహిళ పేషంట్ కేకలు వేసింది. మహిళా పేషంట్ అరుపులతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు వార్డ్ బాయ్ ని చితకబాదారు. అనంతరం నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అసభ్యంగా ప్రవర్తించిన వార్డుబాయ్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తేజేశ్వర్ హత్య కేసులో సంచలన విషయాలు:
గద్వాల నవ వరుడు తేజేశ్వర్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితులకు కోర్టు తాజా రిమాండ్‌ అనంతరం ఏ1 తిరుమలరావు, ఏ3 నాగేష్, ఏ4 పరుశరాము, ఏ5 రాజులను నాలుగు రోజులు కస్టడీలోకి తీసుకొని నిర్వహించిన విచారణలో వెల్లడైన అంశాలను ఆదివారం గద్వాల సీఐ శ్రీను విలేకరులకు వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యల మధ్య ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని తెలిపారు. ఐశ్వర్యను రెండో వివాహం చేసుకుంటానని తిరుమలరావు తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె ఒప్పుకోలేదు. మరోవైపు తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువుపోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య, తేజేశ్వర్‌ని వివాహం చేసుకుంది.

విమానంలో ఎలాంటి సమస్యలు లేవు:
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై వచ్చిన ప్రాథమిక నివేదికపై ఎయిరిండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ స్పందించారు. ప్రమాదానికి గురైన విమానంలో ఎలాంటి సమస్య లేనట్లుగా తెలిపారు. ఇంజిన్‌లో గానీ.. స్విచ్‌ల్లో గానీ ఎలాంటి నిర్వహణ సమస్యలు లేవని తేల్చి చెప్పారు. బోయింగ్ విమానం పూర్తిగా సేఫ్‌గా ఉందని ఎయిరిండియా సీఈవో తెలిపారు. ఇంధన స్విచ్‌లపై వస్తున్న కథనాలు పూర్తిగా అవాస్తవం అని తేల్చారు. ఆ స్విచ్‌లను ఎయిరిండియా రెండు సార్లు మార్చినట్లుగా సమాచారం. ఇక ఇంధన స్విచ్‌లు పూర్తిగా సురక్షితమని అమెరికాకు చెందిన సంస్థ కూడా తేల్చింది. అయితే విమానం టేకాప్ అయిన తర్వాత రెండు స్విచ్‌లు ఎందుకు ఆపివేయబడ్డాయన్న దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఒకేసారి రెండు ఇంధన స్విచ్‌ ఆప్‌లు ఆగడంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది. దీంతో సెకన్ల వ్యవధిలోనే విమానం ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయింది.

ప్రియురాలిని చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు:
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం అయోధ్యలోని గౌరీ శంకర్ ప్యాలెస్ హోమ్‌స్టేలో ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ విషయం పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు, యువతి ప్రేమికులను తేల్చారు. మృతులను డియోరియా నివాసి ఆయుష్ కుమార్, బారాబంకిలోని దరియాబాద్‌కి చెందిన అరోమాగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయుష్ మొదట తన ప్రియురాలు అరోమాను గన్‌తో కాల్చాడు. అనంతరం అతను తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం హోమ్‌స్టే సిబ్బంది టీ ఇవ్వడానికి ఆ రూంకి వెళ్లారు. చాలా సేపు తలుపు తట్టినా గేటు తెరవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ బృందం సమక్షంలో తలుపులు బద్దలుగొట్టారు. రక్తంతో తడిసిన యువకుడు, యువతి మృతదేహాలు కనిపించాయి. గదిలో అక్రమంగా వాడుతున్న గన్ స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి తలలపై బుల్లెట్ గాయాలు ఉన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేన్నామని సిటీ ఎస్పీ చక్రపాణి త్రిపాఠి వెల్లడించారు.

రామలక్ష్మణులు, సీతా వేషధారణలో పాక్ పౌరులు:
తాజాగా ఈ రామాయణ గాథను పాకిస్థాన్‌ గడ్డపై ప్రదర్శించారు. కరాచీ నగరంలో ఓ నాటక బృందం ఈ భారతీయ ఇతిహాసాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించింద. ఇందులోని కళాకారులు పాకిస్థానీయులే కావడం విశేషం. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్- AI మెరుగుదలను ఉపయోగించి ఇతిహాసానికి ప్రాణం పోసేందుకు ప్రయత్నించారు. ఈ నాటకాన్ని చూసిన స్థానిక పాకిస్థానీయులు ప్రసంశలు కురిపించారు. పాకిస్థాన్‌కు చెందిన యోగేశ్వర్‌ కరేరా, రాణా కజ్మాకు నాటక రంగంపై చిన్నప్పటి నుంచే ఆసక్తి ఉండేది. థియేటర్‌ ఆర్ట్స్‌, పలు విభాగాల్లో శిక్షణ సైతం పొందారు. మరికొందరితో కలిసి నాటక బృందంతో కలిసి.. గత నవంబర్‌లో ది సెకండ్‌ ఫ్లోర్‌ (T2F) పేరిట ఉన్న ఆర్ట్‌ గ్యాలరీలో తొలిసారి రామాయణాన్ని ప్రదర్శించారు. స్థానికుల నుంచి మంచి ఆదరణ లభించింది. వీరికి ఉత్సహం పెరిగింది. కృత్రిమమేధ సాయంతో వేదికను రంగులమయంగా మార్చి… ఆర్ట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కరాచీలో మూడు రోజులపాటు రామాయణాన్ని ప్రదర్శించారు. స్థానికులు సహా పలువురు ప్రముఖులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

చైనాలో ఎస్.జైశంకర్ పర్యటన:
భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఐదు సంవత్సరాల తర్వాత తొలిసారిగా చైనా పర్యటనకు వెళ్లిన జైశంకర్.. సోమవారం బీజింగ్‌లో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌తో సమావేశం అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాతో బహిరంగ చర్చలకు జైశంకర్ పిలుపునివ్వడం ఆసక్తిరేపుతోంది. ఇప్పటికే రష్యాతో సత్సంబంధాలు ఉన్న దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరిస్తు్న్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చైనాతో భారత్ ప్రత్యక్ష చర్చలు జరపడం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం రష్యాతో చైనా, భారత్ సంబంధాలు కొనసాగుతున్నాయి.

ప్రభాస్ పై ‘కన్నప్ప’ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్:
తాజాగా ప్రీతి ముకుందన్ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్‌తో స్క్రీన్‌ను పంచుకోవడం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రీతి మాట్లాడుతూ.. ‘ ‘కన్నప్ప’ లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం అనుకోకుండా వచ్చింది. కొన్ని ఛాన్స్‌లు మన కృషికంటే అదృష్టమే తెస్తాయి. కానీ ఆ అవకాశం వచ్చాక దాన్ని ఎలా వినియోగించుకోవాలో మనమే నిరూపించుకోవాలి. నాకు సవాల్ తో కూడిన పాత్రలంటే ఇష్టం. అవి నన్ను ఆర్టిస్టుగా గుర్తించేలా చేస్తాయి. ప్రభాస్‌గారితో పనిచేయడం నిజంగా ఓ డ్రీమ్‌లా ఫీలయ్యా. ఆయన ఉన్నచోటే పాజిటివ్ ఎనర్జీ. స్క్రీన్‌పై కనిపించే మేజిక్ రియల్ లైఫ్‌లోనూ ఉంటుంది. ఆయన పర్సనాలిటీ ఎంతో వినమ్రంగా ఉంటుంది. అందరినీ గౌరవంగా చూస్తారు, ఎవరినీ తక్కువ అంచనా తో చూడరు’ అని పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ప్రీతి ముకుందన్ ‘మైనే ప్యార్ కియా’ అనే రొమాంటిక్ కామెడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 29న విడుదల కాబోతుంది. ‘కన్నప్ప’ విజయంతో తన స్థానం మరింత బలంగా నిలిపేసిన ప్రీతి, ఇప్పుడు నటిగా తన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో కొనసాగిస్తున్నారు.

టెన్షన్ పడుతున్న తెలుగు హీరోయిన్:
తమిళ ఇండస్ట్రీలో ఫ్రూవ్ చేసుకుంటేనే కానీ తెలుగమ్మాయికి టాలీవుడ్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదా అంటే.. సమ్ టైమ్స్ నిజమే అనిపించకమానదు. అంజలి, శ్రీదివ్య నుండి ఆనంది, ఐశ్వర్య రాజేష్ వరకు మాత్రమే కాదు.. ఇప్పుడు ఈ పదాహరణాల తెలుగు ఆడపడుచు శ్రీగౌరి ప్రియ ఈ కోవలోకే వస్తుంది. మ్యాడ్ కన్నా ముందు అరడజనుకు పైగా చిత్రాల్లో నటించినా ఐడెంటిటీ రాలేదు కానీ ఎప్పుడైతే ట్రూ లవర్‌తో రిజిస్టర్ అయ్యిందో మేడమ్ ఫేట్ మారిపోయింది. ట్రూ లవర్ కన్నా ముందే మ్యాడ్‌లో ఓకే అనిపించినా అందులో కూడా గౌరీ ప్రియది సెకండ్ హీరోయిన్ క్యారెక్టరే. అంతకు ముందు లవ్ స్టోరీ, శ్రీకారం, రైటర్ పద్మభూషణ్, ఓటీటీ ఫిల్మ్స్ చేసినప్పటికీ తాను చేసిందన్న విషయం ఆమెకు తప్పితే మరొకరికి తెలియదు. తమిళంలో మోడరన్ లవ్ చెన్నైతో కోలీవుడ్ తెరంగేట్రం చేసిన భామ ట్రూ లవర్‌తో ఫ్రూవ్ చేసుకోవడంతో టాలీవుడ్ పిలిచి పిల్లకు ఆఫర్లు ఇస్తోంది.ఇప్పటికే కిరణ్ అబ్బవరం సరసన చెన్నై లవ్ స్టోరీ చేస్తుండగా ఇప్పుడు నాగవంశీ ప్రొడక్షన్ హౌస్‌లో తెరకెక్కుతోన్న వింటావా సరదాగాలో నటిస్తోంది. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తోన్న ధర్డ్ ఫిల్మ్ వింటావా సరదాగా. మాస్టర్స్ కోసం అమెరికా వెళ్లిన తెలుగు యువతీయువకులకు సంబంధించిన స్ట్రగుల్స్, ఫ్రెండ్ షిప్‌తో పాటు ప్రేమ కథను చూపించబోతున్నారు. ఇందులో అశోక్ సరసన జోడీ కడుతోంది గౌరీ ప్రియా. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ చేయని ఈ తెలుగుమ్మాయి ఈ సినిమాలో లిప్ లాక్, ఇంటిమసీ సీన్లలో కనిపించింది. కానీ ఇక్కడ హిట్స్ ఉంటేనే మరిన్ని సినిమా అవకాశాలు వస్తాయని గుర్తుపెట్టుకుని సినిమాలు చేయాలి.

ఎంఎల్‌సీ విజేతగా ముంబై ఇండియన్స్‌:
మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ) 2025 విజేతగా ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ నిలిచింది. డల్లాస్‌ వేదికగా జరిగిన 2025 ఎంఎల్‌సీ ఫైనల్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్‌పై 5 పరుగుల తేడాతో ఎంఐ విజయం సాధించింది. క్వింటన్ డికాక్ (77) హాఫ్‌ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎంఎల్‌సీలో ఎంఐ న్యూయార్క్‌కు ఇది రెండో టైటిల్‌. 2023లో మొదటి టైటిల్‌ కైవసం చేసుకుంది. మొత్తంగా టీ20 క్రికెట్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీలకు ఇది 13వ టైటిల్‌ కావడం విశేషం.

 

Exit mobile version