అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం
నాటు తుపాకీ మోత ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఎవరితో విభేదాలు లేవంటున్న ఆ కుటుంబం పై ఇక కాల్పులు జరిపింది ఎవరు? ఇదే వెయ్యి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. పొద్దు పొద్దున్నే సంచలనం సృష్టించిన మిస్టరీగా రాయచోటి కాల్పులు ఘటన ఘటనలు ఇద్దరు గాయపడ్డారు… అయితే వారిద్దరూ చిక్కు వెంట్రుకలు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. చిక్కు వెంట్రుకలు సేకరిం చే వారిపై కాల్పులు జరపాల్సిన అవసరం ఎవరిది? ఎందుకు జరిపారు అన్నదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న… పొరపాటున కాల్పులు జరిగాయని అనుకోడానికి వీల్లేకుండా.. ఇద్దరి మీదా మూడు రౌండ్ల కాల్పులు జరిగాయి… హనుమంతు పై రెండు రౌండ్లు రమణ పై ఒక రౌండ్ కాల్పులు జరిపారు జరిపారు గుర్తుతెలియని దుండగులు.
బంగారు నాణేల పేరుతో రూ.7లక్షలు కాజేసిన కేటుగాడు..
నిజామాబాద్ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. సిరికొండ మండలం పోత్నూర్‌లో యువకునికి బంగారం నాణేలు పేరుతో రూ.7 లక్షలు కాజేశాడు ఓ కేటుగాడు. తవ్వకాల్లో బంగారు నాణేలు దొరికాయనీ, తక్కువ ధరకు ఇస్తానంటూ మహేష్ అనే వ్యక్తికి అపరిచిత వ్యక్తి ఫోన్ కాల్ చేశాడు. కుండలో బంగారు నాణేలు దొరికాయని నమ్మబలికాడు. దీంతో నిజమేనని నమ్మని మహేష్ అవి తీసుకుని అమ్ముకుంటే ఎక్కవ డబ్బులు వస్తాయని ఆశపడ్డాడు. నాణేలు ఎంతకు వస్తాయని మహేష్ అడగగా రూ.7 లక్షలకు ఇస్తానని కేటుగాడు బేరమాడాడు.
కాంగోలో పడవ బోల్తా.. 38 మంది మృతి, 100కి పైగా గల్లంతు!
కాంగోలోని బుసిరా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ బోల్తా పడటంతో 38 మంది మరణించిన ఘటలో 100 మందికి పైగా తప్పిపోయారని అధికారులు చెప్పుకొచ్చారు. సామర్థ్యానికి మించి ప్రయాణికులను తరలిస్తుండటంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. అయితే, ఫెర్రీ బోటులో 400 మందికి పైగా ప్యాసింజర్లు ఉన్నట్లు స్థానిక ప్రజలు తెలిపారు. వారంతా క్రిస్మస్ వేడుకల కోసం సొంతూళ్లకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం నెలకొందని చెప్పారు. ఇక, గల్లంతైన వారిలో ఇప్పటి వరకు 20 మందిని రక్షించగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అధికారులు వెల్లడించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు..
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో పోలీసుల తప్పేమీ లేదని ఆయన అన్నారు. కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. ఆ ఘటన దురదృష్టకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా సినిమా టిక్కెట్ల రేట్ల పెంపును తీవ్రంగా ఖండించారు.
కేంద్రం జమిలిపై జేపీసీని నియమించింది..
టాలీవుడ్ సినీ హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్పా-2’ చిత్రం విడుదల నేపథ్యంలో, థియేటర్‌లో సినిమా చూసేందుకు వెళ్ళిన అల్లుఅర్జున్‌పై జరిగిన ఘటన గురించి బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆమె ప్రకాశంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో మిగిలిన వారిని అరెస్ట్ చేయకుండా అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం సరైనదే కాదని వ్యాఖ్యానించారు.
అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీన అరెస్టు చేశారు. ‘పుష్పా-2’ సినిమా చూసేందుకు వచ్చిన అల్లు అర్జున్ చుట్టూ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కలకలం రేపింది. ఇప్పటివరకు ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు, అందులో సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ కూడా ఉన్నారు. పోలీసులు ఈ ముగ్గురిని రిమాండ్‌కు పంపించారు, ఈ ఘటనపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.
ఎగ్జామ్స్ వాయిదా వేసేందుకు స్కూల్కి స్టూడెంట్స్ బాంబు బెదిరింపులు..
దేశ రాజధాని ఢిల్లీలో వరుస బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ హెచ్చరికలకు సంబంధించి కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. ఇటీవల వచ్చిన రెండు బాంబు బెదిరింపులను స్టూడెంట్స్ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపారు. పరీక్షలను వాయిదా వేయడం కోసమే తాము ఈ పని చేసినట్లు సదరు విద్యార్థులు పోలీసుల విచారణలో వెల్లడించారని చెప్పుకొచ్చారు. ఇక, ఇటీవల రోహిణిలోని రెండు స్కూల్స్ కు బాంబు బెదిరింపు ఈ- మెయిల్స్ వచ్చాయి. అదే పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు వేర్వేరుగా ఈమెయిల్‌లు పంపించారి తేల్చారు. అయితే, విద్యార్థులిద్దరూ పరీక్షకు రెడీగా లేకపోవడం వల్ల దాన్ని వాయిదా వేయించేందుకే ఈ పని చేశామని చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. మరో స్కూల్‌కు వచ్చిన బెదిరింపు సైతం ఇలాంటిదేనన్నారు. పాఠశాలలకు వెళ్లడం ఇష్టం లేక ఓ స్టూడెంట్ ఇలా చేసినట్లు సమాచారం. అధికారులు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టులకు పోలీసుల నోటీసులు
ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యం అక్రమాల కేసు దర్యాప్తులో భాగంగా వైఎస్సార్‌సీపీ నేత , మాజీ మంత్రి పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పేర్ని నానికు చెందిన గోడౌన్‌లో రేషన్ బియ్యం అక్రమాలు నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించిన తర్వాత ఈ కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు.
పోలీసులు, తమ దర్యాప్తులో సహకరించాలని కోరుతూ, పేర్ని నాని ఇంటికి వెళ్లారు. కానీ ఇంట్లో ఎవ్వరూ లేకపోవటంతో, ఇంటి తలుపులకు నోటీసులు అంటించారు. ఈ కేసులో నిందితులుగా పేర్ని నాని భార్య జయసుధ , ఆమె వ్యక్తిగత కార్యదర్శి మానస తేజ ఉన్నారు. పోలీసులు జయసుధ , మానస తేజను త్వరగా హాజరయ్యేందుకు నోటీసులు జారీ చేశారు. వారు మధ్యాహ్నం 2 గంటలలోపు స్టేషన్‌కు వచ్చి వాస్తవాల గురించి వివరించాలని, అందుబాటులో ఉన్న రికార్డులు ఇవ్వాలని సూచించారు.
చంద్రబాబు దూర దృష్టితో ఆలోచిస్తారు.. చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసరం
చంద్రబాబు దూరదృష్టితో ఆలోచిస్తారని, చంద్రబాబు విజనరీ రాష్ట్రానికి ఎంతో అవసమన్నారు నారా భువనేశ్వరి. నాలుగు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. మహిళల ఎదుగుదల రాష్ట్రానికి, దేశానికీ ఎంతో అవసరమన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్నివిధాలా సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగ నమ్మే వ్యక్తి చంద్రబాబు అని ఆయన అన్నారు.
రాహుల్ గాంధీకి నోటీసులు.. ఆ రోజు కోర్టుకు రావాలని వెల్లడి
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కుల గణనపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి యూపీలోని బరేలీ జిల్లా కోర్టు నోటీసులు ఇచ్చింది. జనవరి 7వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాలని పేర్కొనింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని పంకజ్ పాఠక్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆయన కామెంట్స్ దేశంలో అంత్యర్ధం, విభజన, అశాంతిని ప్రేరేపించే ఛాన్స్ ఉందని పిటిషన్ దాఖలు చేశారు. ముందుగా ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తోసిపుచ్చింది. దాంతో తాజాగా తాను జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా విచారణ చేపట్టిన కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది.