Site icon NTV Telugu

Top Headlines @1PM : టాప్‌ న్యూస్

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

యువకుడికి వాట్సాప్ లో వలపు వల.. అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి..

ఈజీ మనీకోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. మోసాలకు పాల్పడుతూ అందిన కాడికి దోచుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాకు చెందిన యువకుడిని కరీంనగర్ యువకులు ట్రాప్ చేశారు. యువకుడికి వాట్సాప్ లో వలపు వల విసిరారు. వాట్సాప్ లో అమ్మాయి పేరుతో చాటింగ్ చేసి.. బాదితున్ని కరీంనగర్ రప్పించారు కేటుగాళ్ళు. ఈ నెల 11న మంచిర్యాల నుంచి కరీంనగర్ వచ్చాడు సదరు యువకుడు. తాము అమ్మాయి మనుషులం అంటూ సందీప్, ప్రణయ్, రెహన్ అనే ముగ్గురు దుండగులు రిసీవ్ చేసుకున్నారు. నగర శివార్లలోని వెలిచాల గ్రామ సమీపంకు తీసుకు వెళ్లారు.

అయాన్ కురుషి రౌడి షీటర్ హత్య.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నాంపల్లి నిలోఫర్ కేఫ్ సమీపంలో అయాన్ కురుషి రౌడి షీటర్ ను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయాన్ ను హత్య చేశాక సంతోషకర వార్త అంటూ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పిన నిందితులు. నేడు మీడియా సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు పోలీసులు. తన అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో బావ మునావర్ ను 2020 లో హత్య చేసిన అయాన్ కురుషి. అప్పటి నుంచి కోర్ట్ కేస్ కు హాజరు అవుతున్నాడు అయాన్.

తమ భూమిని కబ్జా చేశారు.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదంటూ జవాన్ సెల్ఫీ వీడియో

దేశ సంపద, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్న జవాన్లను కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జవాన్ల భూములను కబ్జా చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తమ ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందంటూ జవాన్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ జవాన్ తమ భూమిని కొందరు వ్యక్తులు కబ్జా చేశారంటూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జమ్మూకాశ్మీర్ లో ఆర్మీ జవాన్ గా పని చేస్తున్న సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి (మం) చౌదరిపల్లి గ్రామానికి చెందిన రామస్వామి.

కార్లు రెంటుకు తీసుకొని 50 లక్షల టోకరా!

పేకాట, ఆన్​లైన్​ బెట్టింగ్​లకు అలవాటుపడిన ఎంతో మంది యువకుల జీవితాలు మధ్యలోనే ఆగిపోతున్నాయి. చాలామంది పేకాట, బెట్టింగ్​లో డబ్బులు పోగొట్టుకొని అప్పులపాలవుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుండగా.. మరికొందరు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పేకాట, ఆన్‌లైన్‌ బెట్టింగ్, మద్యంకు బానిసైన ఓ వ్యక్తి కార్లు రెంటుకు తీసుకొని.. యజమానులకు టోకరా వేశాడు. ఈఘటన విజయవాడలో చోటుచేసుకుంది.


కుట్రలు, కుతంత్రాలు దేశాన్ని ఏమీ చేయలేవు!

ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో దేశ సైనికులకు కృతజ్ఞతలు తెలుపుతూ అనంతపురంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. త్రివిధ దళాల సైనికులకు సంఘీభావంగా.. జాతీయ జెండా చేత పట్టుకుని నగర వీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్.. ఎమ్మెల్యేలు దగ్గుపాటి, పల్లె సింధూర, బండారు శ్రావణి ఇతర ప్రజా ప్రతినిధులు సహ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీష్ ,మాజీ సైనికులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ నుండి సప్తగిరి సర్కిల్ వద్ద ఉన్న జాతీయ జెండా స్తంభం వరకు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ తిరంగా యాత్ర నిర్వహించారు.

పెళ్లి ఇష్టం లేక ప్రియుడితో కలిసి పారిపోయిన అక్క.. అక్క స్థానంలో పెళ్లికి సిద్ధమైన చెల్లి.. చివరకు

ఇద్దరి ఇష్టాలతో జరిగితేనే ఆ పెళ్లికి ఓ అర్థం. ఆ జంట నిండు నూరేళ్లు అన్యోన్యంగా జీవిస్తుంది. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరికి ఇష్టం లేకపోయినా వారి దాంపత్య జీవితం నిత్య నరకమే. అందుకే అబ్బాయి, అమ్మాయి ఇష్టాయిష్టాలు తెలుసుకున్నాకే ముందుకు సాగుతుంటారు పెద్దలు. ఇదే విధంగా ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు పెళ్లి కుదిర్చారు. అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించేందుకు సిద్ధమయ్యారు. పెళ్లి ఏర్పాట్లలో బిజీ అయిపోయారు. ఇక పెళ్లి ముహూర్తం రానే వచ్చింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చింది వధువు. తనకు పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టం లేకపోవడంతో తాను ప్రేమించిన ప్రియుడితో పారిపోయింది. విషయం తెలిసి ఇరు కుటుంబ సభ్యులు షాక్ కు గురయ్యారు.

గోల్డ్ లవర్స్ కు బిగ్ రిలీఫ్.. నేటి బంగారం ధరలు ఇవే

పసిడి ప్రియులకు నేటి బంగారం ధరలు బిగ్ రిలీఫ్ ఇచ్చాయి. నిన్న, మొన్న పెరుగుతూ తగ్గుతూ షాకిచ్చిన గోల్డ్ ధరలు నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. పుత్తడి ధరల్లో ఇవాళ ఎలాంటి మార్పు లేదు. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 513, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,720 వద్ద ట్రేడ్ అవుతోంది.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ నగరంలో ప్రజల మధ్యకు వెళ్లి ప్రత్యక్షంగా వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయలక్ష్మీ , రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ కలిసి RTC బస్సులో సాధారణంగా టికెట్ తీసుకొని ప్రయాణించారు. పంజాగుట్ట నుంచి లక్డికపూల్ వరకు బస్సు ప్రయాణం చేస్తూ, వారు ఇతర ప్రయాణికులతోపాటు మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహా లక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉద్యోగానికి వెళ్లే మహిళలు, అవసరాల నిమిత్తం ప్రయాణించే వారు ఈ పథకంతో ఎంతో లబ్ధి పొందుతున్నారని చెప్పారు. బస్సులో ప్రయాణిస్తున్న మహిళలతో మాట్లాడిన మంత్రి, వారి అభిప్రాయాలను స్వయంగా వినడంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు.

చైనా పై రేణు దేశాయ్ హాట్ కామెంట్స్.. ?

నటి రేణు దేశాయ్ గురించి పరిచయం అవసరం లేదు. తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ తో ప్రేమ వివాహం, విడాకుల అనంతరం చాలా రోజుల తర్వాత రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. టీవీ షోలు, సినిమాలలో నటిస్తోంది. ఇక కెరీర్ విషయం పక్కన పెడితే రేణు దేశాయ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు, తన పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా జరిగిన భారత్ – పాకిస్తాన్ యుద్ధం గురించి మాట్లాడారు.

 

Exit mobile version