హైదరాబాద్-తిరుపతి మార్గంలో డైనమిక్ టికెటింగ్ సిస్టం.. రద్దీని బట్టి పెరగనున్న ఛార్జీలు
తిరుపతి వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి హైదరాబాద్-తిరుపతి రూట్లలో డైనమిక్ టికెట్ ధరల విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ విధానం వల్ల ప్రయాణికుల డిమాండ్, సీట్ల ఆక్యుపెన్సీ, టికెట్ బుకింగ్ ధరలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. దీని కోసం ప్రయాణికులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. విజయవాడ, బెంగళూరుతో పాటు పలు రూట్లలో ఇప్పటికే డైనమిక్ టికెటింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న టీఎస్‌ఆర్టీసీ.. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే హైదరాబాద్-తిరుపతి మధ్య నడిచే బస్సుల్లో డైనమిక్ ప్రైసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో తిరుపతి వెళ్లే బస్సుల్లో టిక్కెట్ చార్జీలు మరింత పెరగనున్నాయి. హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో శ్రీవారి భక్తులు తిరుమలకు వస్తుంటారు. దీంతో ఈ మార్గంలో వెళ్లే బస్సులు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణీకుల డిమాండ్ సాధారణంగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి టిక్కెట్ ధరలు పెరుగుతాయి.
నేడు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్.. విద్యారంగ పరిష్కారించాలని ఏఐఎస్‌ఎఫ్ డిమాండ్
నేడు రాష్ట్రంలో వామపక్ష విద్యార్థి సంఘం (ఏఐఎస్‌ఎఫ్) పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. తెలంగాణ జిల్లాలన్నింటిలో పాఠశాలల బంద్ పాటించనున్నారు. విద్యార్థుల నుంచి అనధికారికంగా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నాయని వామపక్ష విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బంద్ నిర్వహించనున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ఫీజులపై పరిమితి లేనందున ప్రభుత్వం ఫీజుల కట్టడిపై పరిమితి విధించాలని విద్యార్థులు పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో విద్యారంగ సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చారు. ఇది కాకుండా,ప్రభుత్వ పాఠశాలల్లో MEO, DSC పోస్టులకు సుమారు 15,000 మంది ఉపాధ్యాయులను నియమించాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) డిమాండ్ చేసింది.
తెలంగాణలో దంచికొడుతున్న వర్షాలు.. రాబోయే ఐదు రోజులు వానలే..
తెలంగాణలో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. చిన్నపాటి వర్షానికే నగరం తడిసి ముద్దయింది. పలు చోట్ల రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో మంగళవారం కూడా వర్షం కురిసింది. అయితే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వచ్చే వారం పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ నిన్న రాత్రి వాతావరణ బులెటిన్‌ను విడుదల చేసింది. పలు జిల్లాల్లో ఐదు రోజుల పాటు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సెల్ఫీ కోసం ఎగబడ్డ ఫాన్స్.. అభిమాని చేసిన పని షాక్ తిన్న రష్మిక మందన్న!
‘కిరిక్ పార్టి’ అనే కన్నడ చిత్రంతో రష్మిక మందన్న సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి వరుస ఆఫర్స్ వచ్చాయి. గీతాగోవిందం, దేవ్ దాస్, సరిలేరు నీకెవ్వరూ, సుల్తాన్, పుష్ప, సీతారామం లాంటి భారీ హిట్లు రష్మిక ఖాతాలో ఉన్నాయి. అందం, అభినయం ఉన్న రష్మిక.. తెలుగులో వరుస హిట్స్ కొడుతూ సౌత్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ అయ్యారు.
రష్మిక మందన్న నటించిన ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా లెవల్లో భారీ విజయం అందుకోవడంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది. నేషనల్ క్రష్‌గా పేరొందిన రష్మిక.. బాలీవుడ్‌లోనూ నటిస్తున్నారు. వరుసగా అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం కన్నడ సోయగం రష్మిక పుష్ప-2, యానిమల్, రెయిన్ బో చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నారు. అయితే ఓ షూటింగ్ సందర్భంగా అభిమానులు చేసిన పనికి రష్మిక షాక్ అయ్యారు.
నేపాల్ ప్రధాని భార్య అనారోగ్యంతో కన్నుమూత
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ భార్య సీతా దహల్(69) బుధవారం కన్నుమూశారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని, ఆ తర్వాత మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. 8.33 గంటలకు ఆయన మరణించినట్లు ఆసుపత్రి ప్రకటించింది. రెండేళ్ల క్రితం పుష్ప్ కమల్ దహల్ ప్రచండ కూడా తన భార్యకు వైద్యం చేయించుకునేందుకు ముంబై వచ్చారు. ఆయన భార్య సీతా దహల్ చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నారు. ఆమె పార్కిన్సన్స్ లాంటి లక్షణాలతో బాధపడుతోంది. ప్రోగ్రెసివ్ సూపర్న్యూక్లియర్ పాల్సీ (PSP) అనేది అరుదైన మెదడు వ్యాధి. ఇది కదలిక, సమతుల్యత, కంటి కదలికలతో సమస్యలను కలిగిస్తుంది. ఇది మెదడులోని నాడీ కణాలను ప్రభావితం చేస్తుంది. సమాచారం ప్రకారం, సీతా దహల్ ఆరోగ్యం క్షీణించడంతో గత ఏడాది అక్టోబర్‌లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో చేర్చబడింది. తదుపరి చికిత్స కోసం భారత్‌తో పాటు నేపాల్‌లోని పలు ఆసుపత్రులకు తీసుకెళ్లినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. వైద్యుల ప్రకారం, పీఎస్‌పీ ఒక అరుదైన వ్యాధి. లక్ష మందిలో 5-6 మందిలో మాత్రమే కనిపిస్తుంది.
పవర్ ఫుల్ యాక్షన్ తో అదరగొట్టిన మెగా ప్రిన్స్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ అవసరం. గతేడాది ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్నా.. అది వరుణ్ లెక్కలోకి రాదు. సింగిల్ గా హిట్ అందుకోవడం కోసం వరుణ్ చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో గాండీవధారి అర్జునతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు అయిన ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో వరుణ్ సరసన ఏజెంట్ భామ సాక్షి వైద్య నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ప్రీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రీ టీజర్ అయినా కూడా ఆద్యంతం ఆసక్తి రేపుతోంది.
నేటి నుంచి ఏపీలో ఫీవర్ సర్వే
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందకు ఏపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా కార్యకర్తలు, 19 వేల మంది ఏఎన్‌ఎంలు నేటి నుంచి ఇంటింటికీ వెళ్లి జ్వర బాధితులను గుర్తించాలని ఆదేశించింది. రాష్ట్రంలో గతంలో ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి జ్వర బాధితులను గుర్తించారు. అంతేకాకుండా వారికి వెంటనే పరీక్షలు చేసి.. అవసరమైన చికిత్స, సూచనలు, సలహాలు అందించిన సంగతి తెలిసిందే. ఫీవర్ సర్వేలో భాగంగా ప్రతి ఆశా కార్యకర్త తన పరిధిలో ఉన్న ఇళ్లకు వెళ్లి ఎవరికైనా జ్వరం లక్షణాలు ఉన్నాయో, లేదో తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంటింటికి వెళ్లనున్న వైద్యశాఖ సిబ్బంది.. డెంగ్యూ, మలేరియా వ్యాధులున్నవారి గుర్తించనున్నారు.
నోట్ల మార్పిడి వ్యవహారంలో కొందరిని బెదిరించి డబ్బులు గుంజిన కేసులో ఏఆర్ సీఐ స్వర్ణలత అరెస్టు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. రూ.2వేల నోట్ల మార్పిడి కేసులో విశ్రాంత నేవీ అధికారులను బెదిరించి డబ్బులు వసూలు చేసిన కేసులో పోలీసులు కోర్టుకు అందజేసిన రిమాండ్ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. రూ.90 లక్షలు విలువ చేసే రూ.500 నోట్లను ఇస్తే రూ.కోటి విలువ చేసే రూ.రెండు వేల నోట్లను ఇచ్చేందుకు విశ్రాంత నేవీ అధికారులతో గ్యాంగ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే.. నేవీ అధికారులు తెచ్చింది 90 లక్షలు కాదు…రూ.12 లక్షలేనంటు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
ఢిల్లీలో ఘోరం.. ఫ్లైఓవర్ సమీపంలో మహిళ శరీర భాగాలు లభ్యం
దేశ రాజధానిలో మహిళ హత్య కలకలం సృష్టిస్తోంది. ఏడాది క్రితం జరిగిన శ్రద్ధా వాకర్ ఘటనను మరువక ముందే.. అదే తరహా ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలోని గీతా కాలనీలో గల ఫ్లైఓవర్ సమీపంలో ముక్కలు చేయబడిన మహిళ శరీర భాగాలు లభ్యమయ్యాయి. ఉదయం 9.15 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. ఫ్లైఓవర్ సమీపంలో పలుచోట్ల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. బాధితురాలి శరీర భాగాలు, తల వంటి కొన్ని భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన శరీర భాగాలను వెలికితీసేందుకు పోలీసు బృందం ఫ్లైఓవర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తోంది. మహిళ ఎవరూ, ఆమెను ఎందుకు, ఎవరు హత్య చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మిగిలిన శరీర భాగాల కోసం పలు బృందాలు కాలనీలోని పలు చోట్ల వెతుకుతున్నాయి.
నిన్న ధరణి తీసేస్తం అన్నాడు.. నేడు 3 గంటల కరెంట్ చాలు అంటున్నాడు..
రైతులకు మూడు గంటల కరెంటు ఇస్తే 24 గంటల ఉచిత కరెంటు అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ నోటి రైతులకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయ్యిందని అంటున్నారు. నిన్న కాంగ్రెస్ వస్తే ధరణి తొలగిస్తానని రాబందువు అన్నాడని తెలిపాడు. వ్యవసాయాన్ని చంద్రబాబు దండగ అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ముమ్మాటికీ సన్న, చిన్నకారు రైతును అవమానించడమే అని స్పష్టం చేశారు. నోట్లరద్దు తప్ప రైతుల పాట్లు తెలియని రాబందును నమ్మితే రైతు నోట్లో మట్టి కొట్టుడు ఖాయమని వ్యాఖ్యానించారు.
చిన్న రైతులు అంటే చిన్న చూపు అని కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతుందన్నారు. చిన్న రైతులు అంటే సవతి తల్లి ప్రేమ. ఏడు గంటల కరెంటు ఇవ్వడానికి నిరాకరించిన కాంగ్రెస్ నేడు ఉచిత విద్యుత్ దోపిడీకి కుట్ర చేస్తోందన్నారు. మూడెకరాల పొలాన్ని మూడు గంటల్లో చదును చేయాలంటే బాహుబలి మోటార్లు బిగించాలని కోరాడు. అరికాళ్లలో మెదళ్లను నమ్ముకుంటే రైతుల బతుకు ఆగిపోతుందన్నారు. మళ్లీ 3 గంటల పాటు రాబందు కొడితే రైతుల చేతిలో ఆవు విరుచుకుపడుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రైతులకు ఇది పరీక్షా సమయమని కేటీఆర్ అన్నారు. రైతును రాజును చేసే మనసున్న సీఎం కేసీఆర్ కావాలా? పోకిరీ రాబందు అవసరమా కాదా అని తేల్చేందుకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని సూచించారు. మూడు పంటలు అన్నది కేసీఆర్ నినాదమని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ విధానం మూడు గంటలు. బీజేపీ విధానం మతం పేరుతో నిప్పు. మూడు పంటలు కావాలా? మూడు గంటలు కావాలా? మతం పేరుతో నిప్పు కావాలా? తెలంగాణ రైతాంగం తేల్చుకోవాల్సిన సమయం ఇదేనని అన్నారు.
విపక్షాల సమావేశానికి సోనియా.. 24 పార్టీలకు ఆహ్వానం!
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ జూలై 17-18 తేదీల్లో బెంగళూరులో జరిగే విపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతారని, దీనికి 24 పార్టీలను ఆహ్వానించినట్లు పలు వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐక్యతను పెంపొందించడానికి ప్రతిపక్ష పార్టీల మొదటి సమావేశం జూన్ 23న బీహార్‌లోని పాట్నాలో జరిగింది. 24 రాజకీయ పార్టీల నాయకులు జూలై 17న బెంగళూరులో సమావేశం కానున్నట్లు సమాచారం. ఆ మరుసటి రోజు మరిన్ని అధికారిక చర్చలు జరుగుతాయి. ఈ సమావేశంలో పార్టీల మధ్య విస్తృత అంగీకారానికి సంబంధించిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఎనిమిది కొత్త పార్టీలు.. మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం (MDMK), కొంగు దేశ మక్కల్ కట్చి (KDMK), విడుతలై చిరుతైగల్ కట్చి (VCK), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి) పార్టీలు జూలై 17న సమావేశంలో చేరే అవకాశం ఉంది. మహారాష్ట్రలో శరద్ పవార్‌పై అజిత్ పవార్ తిరుగుబాటు చేయడంతో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)లో చీలిక తర్వాత సమావేశం జులై 13 నుంచి జులై 17కి వాయిదా పడింది.
న్యూఢిల్లీలో మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం.. కిషన్ రెడ్డి రెండోసారి డుమ్మా..!
నేడు న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అయితే ..కేంద్ర మంత్రివర్గ సమావేశానికి కిషన్ రెడ్డి కూడా హాజరుకాలేదు. గత వారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి కూడా ఆయన హాజరుకాలేదు. ఈ సమావేశానికి కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఈ నెల 4వ తేదీన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి నియమితులయ్యారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కొనసాగుతున్న బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే వరకు మంత్రిగా కొనసాగుతానని కిషన్ రెడ్డి వారం రోజుల క్రితం ప్రకటించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత కిషన్ రెడ్డి పార్టీ కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించారు.
నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదు
గుంటూరు ఏటి అగ్రహారం లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్ యూనియన్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా Ntv తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని ఆయన వెల్లడించారు. నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన వెల్లడించారు. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని ఆయన అన్నారు.
వైసీపీ నాలుగేళ్ల ప్రభుత్వంలో రెండేళ్లు కరోనా కష్ట కాలం ఉందని, కరోనా తో ప్రపంచం అంత స్తంభించి పోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటి సమయంలో కూడా ఏపీ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసిందని ఆయన అన్నారు. క్షేత్రస్థాయిలో రైతుల కోసం పంట కొనుగోలు కేంద్రాలు, నాణ్యమైన విత్తనాల సరఫరాలో కొన్ని సమస్యలు నా దృష్టికి వచ్చాయని అంబటి రాయుడు తెలిపారు. నా పరిధిలో వాటికి పరిష్కారానికి అవసరమైన సూచనలు చేస్తానని ఆయన అన్నారు. వాలంటీర్ వ్యవస్థ పై ప్రజలు సంతృప్తి గా ఉన్నారని ఆయన వెల్లడించారు.