NTV Telugu Site icon

Top Headlines @1PM : టాప్ న్యూస్

Top Headlines @1pm

Top Headlines @1pm

బంగ్లాదేశ్‌లో దేవాలయాలను రక్షించడానికి రాత్రంతా నిలబడిన విద్యార్థులు

బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు తర్వాత హిందూ వ్యతిరేక హింస కొనసాగుతోంది. ఢాకాలోని ఖిల్‌గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిందూ దేవాలయాలు, ఇళ్లపై దాడులు జరిగాయి. ఛాందసవాదులు ఇళ్లను ధ్వంసం చేసి దోచుకున్నారు. ఇంతలో విషయం తీవ్రం కావడంతో ఎవరూ హాని చేయవద్దని మసీదుల నుండి ప్రజలు ప్రకటించారు. కొన్ని చోట్ల, దేవాలయాల భద్రత కోసం విద్యార్థులను మోహరించారు. వారు రాత్రంతా ఆలయాలను కాపలాగా ఉంచారు. బంగ్లాదేశ్‌లోని మసీదు లోపల నుంచి లౌడ్ స్పీకర్‌లో ప్రత్యేక ప్రకటన చేశారు. ఒక వ్యక్తి లౌడ్ స్పీకర్ ద్వారా ‘దేశంలో అశాంతి ఉన్న ఈ సమయంలో, మనమందరం మత సామరస్యాన్ని కాపాడుకోవాలని విద్యార్థులమైన మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. హిందూ మైనారిటీలకు రక్షణ కల్పించాలి. దుర్మార్గులు, దుష్ట శక్తుల నుండి వారి జీవితం, వారి సంపద రక్షించబడాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఈ విషయంలో మనమందరం జాగ్రత్తగా ఉందాం.

సినిమా పరిశ్రమ ఎవడబ్బ సొత్తుకాదు..ఇక్కడ టాలెంట్ ముఖ్యం..

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగ‌స్ట్ 9న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్రీ రిలిజ్ ఈవెంట్ నిరహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరోలైన వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, అడివి శేష్ లు గెస్ట్ లుగా హాజరయ్యారు. వారితో పాటు నిర్మాత కొణిదెల నిహారిక తండ్రి నాగబాబు కూడా ఈవెంట్ లో పాల్గొన్నారు.

బంగ్లా మాజీ కెప్టెన్ ఇళ్లు తగులబెట్టిన ఆందోళనకారులు!

రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా.. దేశం విడిచి ఉన్నపళంగా భారత్‌కు వచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో గల హిండన్ ఎయిర్‌బేస్‌లో తలదాచుకుంటున్నారు. సైనికాధిపతి జనరల్‌ వకార్‌-ఉజ్‌-జమాన్‌ నేతృత్వంలో బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.

షేక్ హసీనా భారత్‌కు వచ్చాక బంగ్లాదేశ్‌లో మరింత విధ్వంసకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. హసీనాకు చెందిన అధికారిక నివాసాన్ని ఆందోళనకారులు స్వాధీనం చేసుకున్నారు. నివాసంలోకి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వంట వండుకుని తిని.. బెడ్ మీదే పడుకున్నారు. విలువైన వస్తువులను తమ వెంట పట్టుకెళ్లారు. అక్కడితో ఆగకుండా ఆవామీ లీగ్ పార్టీ ఎంపీ, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫే మోర్తజా నివాసాన్ని కూడా ధ్వంసం చేశారు. ముందుగా దాడి చేసిన ఆందోళనకారులు.. విలువైన వస్తువులను చోరీ చేశారు. ఆపై బంగళాను తగులబెట్టారు. ఇందుకు సంబందించిన వీడియోస్, ఫొటోస్ నెట్టింట వైరల్ అయ్యాయి.

తెనాలికి చెందిన వీధి వ్యాపారి గణేష్‌కు రాష్ట్రపతి ఆహ్వానం

గుంటూరు జిల్లా తెనాలి బాలాజీరావు పేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్ కు రాష్ట్రపతి ఆహ్వానం అందింది …పాని పూరీ కార్నర్ నడుపుతున్న మెఘావత్ చిరంజీవికి న్యూఢిల్లీలో ఈ నెల 15న నిర్వహించనున్న స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. ఆహ్వాన ప్రతిని తపాలా కార్యాలయ అధికారులు శనివారం ఆయనకు అందజేశారు. చిరంజీవి బాలాజీరావుపేట రైల్వేస్టేషన్ వీధిలో పానీపూరి దుకాణం నడుపుతుంటారు. వ్యాపార వృద్ధికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేద రిక నిర్మూలన విభాగం 2021లో రూ.10 వేలు, 2022లో రూ.20 వేలు, 2023లో రూ. 50 వేల చొప్పున రుణాలిచ్చింది. బకాయిలను సకాలంలో చెల్లించడంతోపాటు డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించినందుకు ప్రోత్సాహకంగా ఈ ఆహ్వానం అందినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. మెప్మా సహకారం వల్ల అధిక వడ్డీ లకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందన్నారు. అరుదైన ఆహ్వానం తెనాలివాసిగా తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు.

టీజీ ఆర్టీసీ గుడ్ న్యూస్.. ఎంజీబీఎస్ నుంచి నేరుగా డీలక్స్ బస్సులు..

జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తుండటంతో పది గేట్లు ఎత్తిన అధికారులు దిగువ సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో అధికారులు సోమవారం ఉదయం ఆరు గేట్లను ఎత్తి 60 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. రాత్రికి డ్యాం నిండిపోవడంతో 10 గేట్లను ఎత్తారు. అయితే మంగళవారం ఉదయం వరకు శ్రీశైలం నుంచి వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో అప్రమత్తమైన అధికారులు సాగర్‌ 22 గేట్లను ఎత్తారు. ఇందులో 4 గేట్లను 5 అడుగులు, 16 గేట్లను 10 అడుగుల మేర, ఇవాళ మరో రెండు క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్ కు ఇన్ ఫ్లో 3,00,530 క్యూసెక్కులుగా ఉంది. క్రస్ట్ గేట్ల ద్వారా ఔట్ ఫ్లో 2,54,460 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 585.80 అడుగుల మేర నీరు నిల్వ ఉంది. మరోవైపు 312.5 టీఎంసీల పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 296.85 టీఎంసీలకు చేరింది.

స్కూల్లో చికెన్ తిని ఆస్పత్రి పాలైన 97మంది విద్యార్థులు

ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలోని ఒక పాఠశాలలో చికెన్ తిని 97 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గురైన ఈ విద్యార్థులందరినీ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న వైద్యులు వారికి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో 47 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కొంతమంది ప్రథమ చికిత్స అనంతరం ప్రమాదం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. విషమంగా ఉన్న విద్యార్థులు మెరుగైన చికిత్స అనంతరం పెద్ద ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన ఆదివారం రాత్రి ఆశ్రమ విద్యాలయంలోని మెస్‌లో చోటుచేసుకుంది.

సమాచారం మేరకు.. ఈ పాఠశాలలోని మెస్‌లో ఆదివారం మధ్యాహ్నం చిన్నారులందరికీ చికెన్, పూరీ, అన్నం వడ్డించారు. మధ్యాహ్నానికి సిద్ధం చేసిన చికెన్ విద్యార్థులందరూ తిన్న తర్వాత కూడా మిగిలిపోయింది. అందుకే పాఠశాల యాజమాన్యం రాత్రి కూడా పిల్లలకు అన్నం, పప్పుతో పాటు వడ్డించింది. ఇది తిన్న కొద్దిసేపటికే విద్యార్థుల ఆరోగ్యం ఒక్కొక్కరిగా క్షీణించడం ప్రారంభించింది. ఈ విద్యార్థులందరూ మొదట కడుపునొప్పితో ఫిర్యాదు చేశారు. వెంటనే వారందరూ వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. దీని తరువాత పాఠశాల యాజమాన్యం పిల్లలకు కొన్ని మందులు ఇచ్చింది. అయితే సోమవారం ఉదయం పిల్లలందరికీ తీవ్రమైన జ్వరం వచ్చింది.

ఆయన పాట ప్ర‌జా యుద్ధ నౌక.. గ‌ద్ద‌ర్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నసీఎం..

పొడుస్తున్న పొద్దు మీద న‌డుస్తున్న కాల‌మా… పోరు తెలంగాణ‌మా అంటూ ప్ర‌త్యేక రాష్ట్ర ఉద్య‌మానికి ఆయువుప‌ట్టుగా నిలిచిన వ్య‌క్తి గ‌ద్ద‌ర్ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. గ‌ద్ద‌ర్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి స్మ‌రించుకున్నారు. పేద కుటుంబంలో పుట్టి ఇంజినీరింగ్ విద్య‌ను అభ్య‌సించిన గ‌ద్ద‌ర్‌ ఉన్న‌త కొలువుల వైపు దృష్టిసారించ‌కుండా ప్ర‌తి ఒక్క‌రికి కూడు, గూడు, నీడ ల‌భించాలనే ల‌క్ష్యంతో జీవితాంత త‌న పాట‌ల‌తో ప్ర‌జ‌ల‌ను చైత‌న్య‌ప‌ర్చార‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు.

దారుణం.. కారు ప్రమాదంలో తెగిపడ్డ తల..

శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న వ్యక్తిని కారు ఢీకొట్టడంతో.. కారు అద్దంలో ఇరుక్కుపోయిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంలో కారు వెనకాల సీట్ లో మృతుడి తల తెగిపడటంతో భయాందోళన వాతావరణ నెలకుంది. మృతుడు శంషాబాద్ మున్సిపాలిటీ ఉట్ పల్లి గ్రామానికి చెందిన తోట్ల అంజయ్యగా గుర్తించారు. శంషాబాద్ ఓటర్ రింగ్ రోడ్డు వద్ద అంజయ్య అనే వృద్ధుడు రోడ్డు పై వెళుతున్నాడు. మితిమీరిన వేగంతో కారు ఒక్కసారిగా అంజయ్యను ఢీ కొట్టింది. దీంతో అంజయ్య అద్దంలో ఇరుక్కుపోయాడు. కారు ఓవర్ స్పీడ్ ఉండటంతో ఆపకుండానే కారులో వున్న వ్యక్తి అలాగే నడిపాడు. దీంతో అంజయ్య మొడ తెగి కారు వెనకాల సీట్ లో పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంజయ్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అంజయ్య మృతితో కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్

కొడాలి నాని, వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడంటూ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. శవం లేస్తే తప్ప జగన్ ఏపీకి రావట్లేదంటూ కొల్లు రవీంద్ర ఫైర్ అయ్యారు. గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. తన భద్రత పెంచాలని జగన్ అంటుంటే.. జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని, ఏపీలో ఎవరైనా చనిపోయి శవం కనిపిస్తే.. గద్దలా వాలటానికి జగన్ వస్తున్నాడని ఆయన మండిపడ్డారు. పులివెందుల ఎమ్మెల్యేకి సీఎం తరహా సెక్యురిటి, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని, రాబందులా ఐదేళ్లు రాష్ట్రాన్ని పీక్కు తిన్న జగన్ అండ్ కో చంద్రబాబు చేసే అభివృద్ధిని చూసి తట్టుకోలేకపోతోందన్నారు కొల్లు రవీంద్ర.