NTV Telugu Site icon

dlines @1PM : టాప్‌ న్యూస్‌

Top Headlines @ 1 Pm

Top Headlines @ 1 Pm

విద్యుత్ రంగంలో ఏపీని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం

విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ జెన్ కో ఎండీ చక్రధర్ బాబు, ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి తదితరులు హాజరయ్యారు.

ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటులో ఫేమస్ విలన్ కన్నుమూత

సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇండస్ట్రీ మరో అద్భుత నటుడిని కోల్పోయింది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రముఖ విలన్ మోహన్ రాజ్ కన్నుమూశారు. 72ఏళ్ల వయసున్న ఆయన గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆయనకు వెంటిలేటర్ మీద చికిత్స అందజేశారు. అయినప్పటికీ పరిస్థితి మెరుగుపడలేదు. గురువారం మధ్యాహ్నం ఆయన చనిపోయినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు.

లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ.. రాజకీయంగా లడ్డూ విషయంపై వ్యాఖ్యలు చేయొద్దన్న సుప్రీం

సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరపాల్సిందిగా కోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం అందించిన విచారణలో వెలువడింది, ఇది ఈ రోజు ఉదయం జరిగింది. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సమీక్షించడం జరిగింది. సిట్ దర్యాప్తు కొనసాగించాలని లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలకు దర్యాప్తును అప్పగించాలా అనే అంశంపై అభిప్రాయం అడిగారు. జవాబుగా, తుషార్ మెహతా సిట్ విచారణపై తమకు ఎలాంటి సందేహాలు లేవని చెప్పారు. అయితే, సిట్‌పై పర్యవేక్షణ ఉండాలని, ఇది మరింత సమర్థవంతంగా ఉండేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రయాణికులకు శుభవార్త.. 644 ప్రత్యేక రైళ్లు..

దసరా పండుగ సెలవులతో నగరంలోని ప్రధాన స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగింది. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వైపునకు వెళ్లే రైళ్లలో నిలబడి వెళ్లేందుకూ చోటు ఉండని పరిస్థితి ఏర్పడింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే శాఖ అలర్ట్ అయ్యింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్దమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నెల 15 వరకు 644 ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని శుభవార్త చెప్పింది. సికింద్రాబాద్, కాచిగూడ, మహబూబ్ నగర్, తిరుపతి రైల్వే స్టేషన్ల నుంచి ముఖ్యమైన రూట్లలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

నేను ఒక నియంత.. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద పోస్టర్లు కలకలం..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎదుట గ్రూప్-1 పోస్టర్లు కలకలం సృష్టించాయి. కమిషన్ కార్యాలయం గోడలు, గేట్లపై కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడి ఫొటోలతో కూడిన పోస్టర్లు వెలిశాయి. నాంపల్లిలోని టీజీపీఎస్సీ ఎదుట, హైదరాగూడలోని తెలుగు అకాడమీ ఎదుట గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఆ పోస్టర్లలో తెలుగు అకాడమీ పుస్తకాలు పోటీ పరీక్షలకు ప్రామాణికంగా లేవని.. ప్రభుత్వం కోర్టుకు చెప్పిన నేపథ్యంలో ఎవరూ కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే టీజీపీఎస్సీ ఎదుట నేను ఒక నియంత అంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అంతేకాదు గ్రూప్-1లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 150 ప్రశ్నలను ఎందుకు సిద్ధం చేయలేదని సిగ్గు సిగ్గు అని పోస్టర్లు వెలిశాయి. ఉదయాన్నే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ఈ పోస్టర్లు దర్శనం ఇవ్వడంతో కమిషన్ సిబ్బంది దీనిని తొలగించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టర్లు ఎవరు వేశారు అని ఆరా తీస్తున్నారు.

హాస్పిటల్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్ డిశ్చార్జ్..!

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్య సమస్యలతో ఇటీవల చెన్నైలోని అపోలో హాస్పటల్ లో చేరారు. నాలుగు రోజులుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నరజనీకాంత్ కు వైద్యులు శస్త్రచికిత్స చేసి గుండెలో స్టెంట్‌ వేశారు. రజనీకాంత్‌ గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడింది. దీనికి ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా వైద్యులు చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. .ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.. నిన్న రాత్రి 12 గంటల సమయంలో ఆయన చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్నారు. అభిమానులకు అభివాదం చేస్తూ ఇంటికి వెళ్లారు.వారంపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యుల సూచించారని తెలుస్తోంది.

దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు..

సమాజం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా.. ఆధునిక పరిజ్ఞానంతో ఎన్ని ఆవిష్కరణలు చేసినా.. కొన్ని ప్రాంతాలు మాత్రం ఇంకా మూఢనమ్మకాలనే నమ్ముతూ అంధకారంలోనే మగ్గిపోతున్నాయి. ముఖ్యంగా క్షుద్రశక్తుల కోసం చంపడమో.. చావడమో.. లాంటి పనులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి పనులు చేశారా లేదా అని నిర్దారించుకోకుండానే ప్రాణాలు తీస్తున్నారు. మంత్రాలు చేస్తుందనే నెపంతో మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం కత్రియాల గామంలో కలకలం రేపుతుంది. కత్రియాల గామంలో ద్యాగల ముత్తవ్వ తన కొడుకు, కోడలితో నివాసం ఉండేది. అయితే ఆమె రోజూ ఇంటింటికి వెళ్లి పలకరించేది. అయితే గ్రామస్తులు ముత్తవ్వపై అనుమానం పెంచుకున్నారు. ముత్తవ్వ ఇళ్ల ముందుకు వచ్చి ఏదో మంత్రాలు చేస్తుందని ఆమెను అనుమానించడం మొదలు పెట్టారు. అందుకే వారి ఇళ్లలో కీడు జరుగుతుందని ఆమెను ఎలాగైనా చంపేయాలని ప్లాన్ వేసుకున్నారు. ఇలా ముగ్గురు తోడై ముత్తవ్వను చంపాలని ప్లాన్ వేసుకున్నారు. గురువారం అర్థరాత్రి ముత్తవ్వ ఇంటికి వెళ్లారు. ఆమె ఇంట్లో ఉండగా మంత్రాలు చదువుతుందని అనుమానంతో వారి వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమె పై వేశారు.

శ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం

సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణ జరపాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయం జస్టిస్ బీఆర్ గవాయ్ , జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం అందించిన విచారణలో వెలువడింది, ఇది ఈ రోజు ఉదయం జరిగింది. ఈ కేసు గురించి సుప్రీంకోర్టు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సమీక్షించడం జరిగింది. అయితే.. దీనిపై మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామన్నారు. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు.

దారుణం.. ప్రమాదంలో 10 మంది కార్మికులు మృతి!

ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్ జిల్లాలో గురువారం అర్థరాత్రి ట్రక్కు, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో 10 మంది కూలీలు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వార్త అందిన వెంటనే పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. అనంతరం సహాయ, సహాయక చర్యలు ప్రారంభించారు. మిర్జాపూర్ – వారణాసి సరిహద్దులోని కచ్వాన్, మీర్జామురాద్ మధ్య జిటి రోడ్డులో తెల్లవారుజామున 1 గంటలకు ప్రమాదం జరిగిందని మిర్జాపూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్‌పి) అభినందన్ తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.., భదోహి జిల్లాలో నిర్మాణ పనులు చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ ట్రాలీలో 13 మంది కార్మికులు ఉన్నారు. వారి వాహనాన్ని వెనుక నుండి ట్రక్కు ఢీకొట్టింది. దాని కారణంగా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో ప్రయాణిస్తున్న 13 మందిలో 10 మంది మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ట్రామా సెంటర్, వారణాసికి పంపారు. అక్కడ వారి పరిస్థితి సాధారణంగా ఉందని సమాచారం. ప్రమాదం తర్వాత ట్రక్కు బాగా దెబ్బతిన్నదని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) ఓపీ సింగ్ తెలిపారు. ఇటాహ్ జిల్లా నుంచి వస్తున్న ట్రక్కులో గాజు షీట్లు లోడ్ చేశారు. ఘటన తర్వాత లారీ డ్రైవర్‌, సహాయకులు అక్కడి నుంచి పరారయ్యారు.

నా ఫామ్ హౌజ్ పక్కనే సబితా, పొంగులేటి ఫామ్ హౌజ్ లు ఉన్నాయి..

సబితా ఇంద్రారెడ్డికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇద్దరికి నా ఫామ్ హౌజ్ పక్కనే ఫామ్ హౌజ్ లు ఉన్నాయని తెలంగాణ శాసనమండలి చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్, హరీష్, సబితా ఇంద్రారెడ్డికి చెప్పేది ఒకటే.. నా ఫామ్ హౌజ్ రూల్స్ ప్రకారం ఉందన్నారు. రూల్ ప్రకారం లేదంటే నేనే దగ్గర ఉండి కూల్చివేస్తా అన్నారు. ప్రతీ సారి నా పేరు తీసుకుని విమర్శలు చేస్తున్నారు. నేను మంత్రిగా పని చేసిన.. భాద్యత ఉన్న వ్యక్తిని అని గుర్తు చేశారు. నిబంధనల మేరకే ఫామ్ హౌజ్ ఉందని అధికారులు నాకు నివేదిక ఇచ్చారన్నారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లో నా ఫామ్ హౌజ్ నిర్మాణం చేయలేదన్నారు. రింగ్ రోడ్డు మీద నుంచి చూస్తే గుట్టల మీద ఉంటది. నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తోందని క్లారిటీ ఇచ్చారు. నా ఫామ్ హౌజ్ 20 ఏళ్ల క్రితం కట్టామన్నారు.