Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Annamayya District Tomoto Price All Time High In Madanapalle Tomato Rate Touches 224 A Kg In Madanapalle Market

Tomoto Price Today: కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!

Published Date :August 2, 2023 , 8:29 am
By Sampath Kumar
Tomoto Price Today: కిలో టమాటా రూ.224.. మదనపల్లిలో నయా రికార్డు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Tomato Price Touches All Time High in Madanapalle: గత కొన్ని రోజులుగా ‘టమాటా’ ధర పైపైకి దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా 2 నెలలుగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని మార్కెట్‌లలో కిలో టమాటా రూ. 200 పైనే పలుకుతోంది. దీంతో టమాటాలను కొనాలంటే జనాలు భయపడుతున్నారు. చాలామంది టమాటా బదులుగా చికెన్ కొనేసుకుంటున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా టమాటా ధర గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర కొత్త రికార్డు సృష్టించింది.

మదనపల్లె నియోజకవర్గంలోని అంగళ్లు మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 1) నాణ్యమైన టమాటా రికార్డు స్థాయిలో కిలో రూ. 224 పలికింది. 2-3 రోజుల క్రితం కిలో టమాటా 200 ఉండగా.. ఇప్పుడు 224గా ఉంది. మంగళవారం దాదాపుగా పది వేల క్రేట్ల సరకు రాగా.. వేలంలో క్రేటు ధర రూ. 5600 పలికిందట. ఈ విషయాన్ని టీవీఎస్‌ మండీ యజమాని బాబు, మేనేజర్‌ షామీర్‌ మీడియాతో తెలిపారు. ఇక్కడికి వచ్చిన టమాటాను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లు వారు తెలిపారు.

Also Read: ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ షెడ్యూల్‌లో మార్పులు.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడంటే?

మరోవైపు అనంతపురం జిల్లా కక్కలపల్లి టమాటా మార్కెట్‌లో 15 కిలోల బుట్ట రూ. 3,200కు అమ్ముడుపోయింది. కిలో టమాటా రూ. 215 పలికింది. మార్కెట్‌ చరిత్రలోనే ఇది అత్యధిక ధర అని వ్యాపారులు అంటున్నారు. కనగానపల్లి మండలం పాతపాలెం గ్రామ రైతు బళ్లారి రాజు మంగళవారం మార్కెట్‌కు 90 బుట్టల టమాటాలు అమ్మకానికి తేగా.. నాణ్యత బాగుండటంతో 79 బుట్టలు రూ. 3200 చొప్పున అమ్ముడుపోయాయి. 2 ఎకరాల పొలంలో లక్ష పెట్టుబడితో టమాటా వేశానని, మంచి దిగుబడి వచ్చిందని యువ రైతు రాజు తెలిపారు.

Also Read: WI vs IND: 200 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన వెస్టిండీస్‌.. టీమిండియాదే వన్డే సిరీస్‌!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Madanapalle
  • Madanapalle Tomoto Price
  • Tomatoes
  • tomoto
  • Tomoto Price

తాజావార్తలు

  • RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో ఆర్‌సీబీ విధ్వంసం!

  • Moringa Powder: జిమ్‌కి వెళ్లక్కర్లేదు.. రోజుకు రెండు ముద్దల ఈ పొడి తింటే కొవ్వు కరగాల్సిందే!

  • US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్‌లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..

  • Axis Bank : నమ్మితే నట్టేట ముంచాడు.. NRI ఖాతా నుంచి రూ. 7 కోట్లు కొట్టేసిన బ్యాంక్ మేనేజర్.!

  • Chanakya Niti: మీ మాటకు విలువ పెరగాలంటే ఏం చేయాలి? ఆచార్య చాణక్యుడు చెప్పిన బెస్ట్ టిప్స్ ఇవే..

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions