వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 20వ రోజు విజయవంతంగా ముగిసింది. ఇక.. రేపు (మంగళవారం) జరగబోయే యాత్రకు సంబంధించి షెడ్యూల్ వచ్చింది. సీఎం జగన్.. ఉదయం 9 గంటలకు ఎండాడ MVV సిటీలో యాత్ర నిర్వహిస్తారు. ఆ తర్వాత మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుంటారు. చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్ద సోషల్ మీడియా కార్యకర్తలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత భోజన విరామం తీసుకుని.. బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.
Read Also: Padma Vibhushan: పద్మ విభూషణ్ ను అందుకున్న వెంకయ్య నాయుడు..
బస్సు యాత్రలు, రోడ్‌షోలు, ముఖాముఖిలు నిర్వహిస్తూనే.. బస్సు యాత్రలో భాగంగా వైసీపీ భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిస్తోన్న విషయం విదితమే.. సీఎం జగన్‌పై రాయి దాడి తర్వాత పోలీసులు మరింత భద్రత కల్పిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డులో సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. కాగా, ఎన్నికల ప్రచారంలో ఇడుపులపాయలో మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్.. ఇచ్చాపురం వరకు చేరుకోనున్న విషయం విదితమే.
Read Also: MI vs RR: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై..