Site icon NTV Telugu

Harika Narayan : పెళ్లి చేసుకున్న స్టార్ సింగర్.. బిగ్ బాస్ విన్నర్ సందడి..

Harikaa

Harikaa

టాలీవుడ్ సింగర్ హారిక నారాయణ్ ఎన్నో సినిమాల్లో పాటలు పాడింది.. ఆ పాటలు సూపర్ హిట్ అయ్యాయాని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇ తెలుగులోనే కాదు తమిళ్ సినిమాల్లో కూడా ఆమె ఎన్నో పాటలను పాడింది.. సినిమాల్లో సాంగ్స్ తో మెప్పిస్తునే టీవీ షోలలో, ప్రైవేట్ ఆల్బమ్స్లలో కూడా పాడింది.. అతి చిన్న వయస్సులోనే స్టార్ సింగర్ గా ఎదిగింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హారిక తన లేటెస్ట్ పాటల గురించి మాత్రమే కాదు.. లేటెస్ట్ ఫోటోలను కూడా షేర్ చేస్తుంది. ఇటీవలే ఆమె ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ఒక పోస్ట్ చేసింది..

ఇక హారిక నారాయణ్, పృథ్వినాథ్ వెంపటి అనే వ్యక్తితో హారిక ప్రేమలో ఉంది.. ఏడేళ్లు వీరిద్దరూ ప్రేమించుకొని ఇన్నేళ్లకు పెళ్లితో ఒక్కటయ్యారు.. తాజాగా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.. అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగింది.. ఈ వేడుకకు బిగ్ బాస్ విన్నర్ సింగర్ రేవంత్ హాజరయ్యారు.. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

హారికా కేరీర్ విషయానికొస్తే.. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకుంది.. సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాటలను పాడింది.. నిహారిక ‘సూర్యకాంతం’ మూవీతో గాయనిగా కెరీర్ మొదలుపెట్టిన హారిక.. దళపతి విజయ్ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో ఎంట్రీ సాంగ్స్ పాడి అలరించింది.ఇక హారికకు హీరో మహేశ్‌బాబు అంటే మాటల్లో చెప్పలేనంత అభిమానం. ఓ సినిమాలో నటించినట్లు గతంలో హారిక తెలిపారు. తన అభిమాన హీరో సినిమా అయిన ‘సర్కారువారి పాట’లో టైటిల్‌ ట్రాక్‌ ను హారిక పాడారు.. ప్రస్తుతం ఆల్బమ్ సాంగ్స్ ను పాడుతున్నారు..

Exit mobile version