Geetha Madhuri and Nandu Welcome Baby Boy: టాలీవుడ్ సింగర్ గీతా మాధురి రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని స్వయంగా ఆమె చెప్పారు. ఫిబ్రవరి 10న తనకు కుమారుడు పుట్టాడని శనివారం (ఫిబ్రవరి 17) ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో గీతా మాధురి పేర్కొన్నారు. విషయం తెలిసిన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతా మాధురి, హీరో నందు 2014లో ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి 2019లో దాక్షాయణి ప్రకృతి జన్మించింది.
గీతా మాధురి తెలుగులో ఎన్నో సినిమాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్ పాడారు. రొమాంటిక్, మాస్, ఐటమ్ సాంగ్స్ మాత్రమే కాదు.. డివోషనల్ సాంగ్స్ కూడా పడుతూ అభిమానులను అలరిస్తున్నారు. గీతా మాధురి గాత్రానికి, ఆమె పాటలకు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ ఉంది. ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె కొన్నాళ్లుగా పాటలు పాడడం లేదు. తాను మరోసారి తల్లి కాబోతున్నాని జనవరిలో గీతా మాధురి చెప్పారు. సీమంతం ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇక ఫిబ్రవరి 10న బాబు జన్మించాడని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు. ప్రస్తుతం గీతా మాధురి తన కుమారుడితో శారద సమయం గడుపుతున్నారు.
గీతా మాధురి సింగర్‌గా రాణిస్తోంటే.. నందు హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. సరైన బ్రేక్ కోసం నందు ఎంతో కష్టపడుతున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఓటీటీలో వెబ్ సిరీస్‌లు చేస్తున్నాడు. అంతేకాకుండా క్రికెట్ యాంకర్‌గా సత్తాచాటుతున్నాడు. నందు, అవికా గోర్ కలిసి చేసిన ‘వధువు’ వెబ్ సిరీస్ పర్వాలేదనిపించింది. 25కి పైగా సినిమాల్లో హీరోగా నటించిన నందు ఖాతాలో బొమ్మ బ్లాక్ బస్టర్, సవారి, శివరంజని, ఇంతలో ఎన్నెన్ని వింతలో లాంటి హిట్స్ ఉన్నాయి.