Site icon NTV Telugu

Tollywood : పాన్ వరల్డ్.. భారీ బడ్జెట్ కాదు.. కంటెంట్‌ కావాలి మాకు

Tolly Wood

Tolly Wood

ఇటీవల సినిమా మేకర్స్‌ తమ ప్రాజెక్ట్‌ల గురించి విపరీతమైన స్టేట్‌మెంట్‌లు ఇవ్వడం ఒక ట్రెండ్‌లా మారిపోయింది. ఎక్కడ చూసినా “ఇంత భారీ బడ్జెట్”, “ఇంతవరకు ఎప్పుడూ చేయని విజువల్ ఎఫెక్ట్స్”, “పాన్ వరల్డ్ రిలీజ్”, “రికార్డులు బ్రేక్ చేయబోతున్నాం” వంటి మాటలే వినిపిస్తున్నాయి. కానీ ఈ పెద్ద పెద్ద హామీలు ప్రేక్షకులలో అంచనాలను పెంచడం తప్ప అసలు సినిమాకే నష్టం చేస్తున్నాయని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

Also Read : Rashi Khanna : హీరో ఆధిపత్యంపై రాశీ ఖన్నా సెన్సేషనల్ కామెంట్స్

ప్రచారం కోసం చెప్పే ఈ “టాల్ స్టేట్‌మెంట్స్” వాస్తవానికి సినిమాపై అనవసరమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. కంటెంట్ కంటే ముందే బడ్జెట్, వసూళ్లు, స్టార్ కాంబినేషన్స్, బిగ్ సెట్‌లు వంటి విషయాలు చర్చకెక్కుతుండడంతో, ప్రేక్షకులు కూడా సినిమాను చూసే ముందు గాల్లో ఎక్కడికో తీసుకెళ్తున్నారు. కానీ విడుదలైన తర్వాత ఆ అంచనాలు నెరవేరకపోతే, వెంటనే ట్రోలింగ్ మొదలై నెగటివ్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఇదే చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డ్యామేజ్ అయ్యేందుకు ప్రధాన కారణమవుతుంది.

ఈ నేపథ్యంలో, “మాటల హైప్ కన్నా కంటెంట్‌ హైప్ ఇవ్వాలి” అనే అవగాహన సినీ పరిశ్రమలో పెరుగుతుంది. మంచి కథ, బలమైన నిర్మాణం, జాగ్రత్తగా ప్లాన్ చేసిన ప్రమోషన్ – ఇవే సినిమాను నిలబెట్టే నిజమైన స్తంభాలు. బడ్జెట్ బాంబులు పేల్చడం, అసంభవమైన అంచనాలు పెంచడం కంటే, సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులే మాట్లాడేలా ఔట్‌పుట్ ఇవ్వడం మేకర్స్‌కు గౌరవం తెస్తుంది. అలాగే మొత్తం పరిశ్రమకు కూడా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం వృద్ధి చెందుతుంది.

Exit mobile version