Site icon NTV Telugu

Exclusive : యంగ్ హీరో కెరీర్‌ భారీ బడ్జెట్ సినిమాకు ఆర్థిక ఇబ్బందులు

Tollywood

Tollywood

టాలీవుడ్‌లో ప్రస్తుతం వినిపిస్తున్న ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒక మిడ్ రేంజ్ యంగ్ హీరో కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ఒక భారీ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల కావడం కష్టమని తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Also Read : Mohanlal : స్టార్ హీరోలు మోహన్ లాల్ ని చూసి నేర్చుకోండి

నిర్మాణ వ్యయం అనుకున్న దానికంటే మించిపోవడం దానికి తోడు సమయానికి నిధులు సర్దుబాటు కాకపోవడంతో మేకర్స్ అయోమయంలో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ నాటికి సినిమాను సిద్ధం చేసి థియేటర్లలోకి తీసుకురావాలని ముందుగా భావించినా ప్రస్తుత పరిస్థితులు అందుకు సహకరించేలా లేవు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పాన్-ఇండియా ట్రెండ్ నడుస్తుండటంతో చిన్న తప్పు జరిగినా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అందుకే తొందరపడి విడుదల చేయడం కంటే ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుని వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమాను రిలీజ్ చేయడమే ఉత్తమమని నిర్మాతలు భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే డిసెంబర్ బాక్సాఫీస్ బరిలో ఒక భారీ పోటీ తగ్గినట్లే అవుతుంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Exit mobile version