Site icon NTV Telugu

Megha Akash: ప్రియుడిని పెళ్లాడిన టాలీవుడ్ హీరోయిన్.. ఫొటోలు వైరల్

Megha Akash

Megha Akash

Megha Akash: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాశ్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. తన ప్రియుడు సాయివిష్ణును పెళ్లాడారు. ఆదివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రముఖ ఫంక్షన్‌హాల్‌లో వీరి వివాహం జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read Also: Tollywood : సండే సూపర్ – 8 బ్లాక్ బస్టర్ సినిమా న్యూస్..

శనివారం సాయంత్రం నిర్వహించిన రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హాజరయ్యారు. ‘లై’ సినిమాతో కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయమైన మేఘా ఆకాశ్.. ఛల్ మోహన్ రంగా, పేట, కుట్టి స్టోరీ, డియర్ మేఘ, రాజ రాజ చోర వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు. రిసెప్షన్ ఫోటోలు షేర్ చేసిన మేఘా ఆకాశ్.. జీవితంలో తనకెంతో ఇష్టమైన అధ్యాయం ఇదేనని పేర్కొన్నారు. రాజకీయ కుటుంబానికి చెందిన సాయి విష్ణుతో ఆమె ఎంతో కాలం నుంచి ప్రేమలో ఉన్నారు.

Exit mobile version