NTV Telugu Site icon

Raj Tarun-Lavanya: లావణ్య కేసు.. రాజ్‌ తరుణ్‌ను ఏ-1గా చేర్చిన పోలీసులు!

Raj Tarun Lavanya

Raj Tarun Lavanya

Police included Malvi Malhotra as A-2 in Lavanya Case: టాలీవుడ్ హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్య కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తోంది. రాజ్‌ తరుణ్‌ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ కారణంగా వదిలేసి వెళ్లిపోయాడని ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్‌లో లావణ్య ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రాజ్‌ తరుణ్‌ను పోలీసులు ఏ-1గా చేర్చారు. ఏ-2గా మాల్వి మల్హోత్రా, ఏ-3గా మయాంక్‌ మల్హోత్రాల పేర్లను చేర్చారు.

Also Read: Champions Trophy 2025: పాకిస్థాన్‌కు అస్సలు వెళ్లం.. వేదిక మార్చండి: బీసీసీఐ

‘2010లో రాజ్‌ తరుణ్‌ నాకు ప్రపోజ్‌ చేశాడు. 2014లో పెళ్లి చేసుకున్నాడు. రాజ్ తరుణ్‌ను మా కుటుంబం అన్ని విధాలుగా ఆదుకుంది. అతడికి ఇప్పటివరకు రూ.70 లక్షలు ఇచ్చాం. రాజ్‌ తరుణ్‌ 15 కుక్కల కారణంగా 6 సంవత్సరాల్లో 6 ఇల్లులు మార్చాం. 2016లో రాజ్‌ తరుణ్ వల్ల గర్భవతిని అయ్యా. రెండో నెలలో నాకు సర్జరీ చేశారు. ఆస్పత్రి బిల్లులు అతడే చెల్లించాడు. రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా కలిసి నన్ను డ్రగ్స్‌ కేసులో ఇరికించారు’ అని లావణ్య చెప్పారు. తనను మోసం చేసిన రాజ్‌ తరుణ్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆమె కోరారు. తనను చంపుతామని బెదిరించిన మాల్వీతో పాటు ఆమె సోదరుడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను లావణ్య కోరారు.

Show comments