NTV Telugu Site icon

Director Passed Away : ఇండస్ట్రీని వీడని విషాదాలు.. ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Madan

Madan

Director Passed Away : సినీ ఇండస్ట్రీని విషాదాలు వెన్నంటుతున్నాయి. సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని మరిచిపోకముందే వరుసగా టాలీవుడ్ కు మరో షాక్ తగిలింది. తెలుగులో క్లాసిక్ సినిమాలకు దర్శకత్వం అందించిన డైరెక్టర్ మదన్ హఠాన్మరణం పాలయ్యారు. నాలుగు రోజుల క్రితం దర్శకుడు మదన్ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారని, దీంతో ఆయన కుటుంబ సభ్యులు అపోలో ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 1.41గంటలకు ఆయన తుదిశ్వాస విడిచినట్లు చెబుతున్నారు.

Read Also: Youth Marries Dead Girlfriend : ప్రేమంటే ఇదేరా.. ప్రేయసి శవాన్ని పెళ్లి చేసుకున్నాడు

డైరెక్టర్ మదన్ ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లిలో పుట్టి పెరిగారు. ఆయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో తన విద్యను పూర్తి చేశారు. కాలేజీ రోజుల్లోనే నాటకాలలో మంచి ప్రావీణ్యం సంపాదించిన ఆయన తర్వాత సినిమాల మీద మక్కువతో హైదరాబాద్ మకాం మార్చారు. అసిస్టెంట్ కెమెరామెన్ గా ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర పనిచేసిన ఆయన తర్వాత కొన్ని సినిమాలకు సహ రచయితగా వ్యవహరించారు. తెలుగులో ఆ నలుగురు అనే సినిమాతో ఆయన మొదటి సారిగా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమాకి ఆయన స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. అనంతరం ‘పెళ్లయిన కొత్తలో’ చిత్రాన్ని తెరకెక్కించారు. కాఫీ విత్ మై వైఫ్, ప్రవరాఖ్యుడు, గరం, గుండె ఝల్లుమంది, గాయత్రి వంటి చిత్రాలను డైరెక్షన్ చేశారు. మదన్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.