NTV Telugu Site icon

Sharath Babu: సీనియర్ నటుడు శరత్ బాబుకు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు

Sharath

Sharath

Sharath Babu: సీనియర్ సినీ నటుడు శరత్ బాబు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఏఎంజీ ఆసుపత్రికి తరలించారు. కొంత కాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బెంగళూరు లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఐసీయూలో ఉండి ట్రీట్ మెంట్ తీసుకున్నారు. బెంగళూరు ఆసుపత్రిలో ఆయన కొంత వరకు కోలుకున్నారని ఆయన సన్నిహితులు ప్రకటించారు. ఐసీయూ నుంచి సాధారణ విభాగానికి శరత్ బాబును మార్చినట్టు తెలుస్తోంది. అయితే బెంగళూరు హాస్పిటల్ లో ఉండగానే మరోసారి ఆయన పరిస్థితి విషమించినట్టు తెలిసింది. దాంతో శరత్ బాబును బెంగళూరు నుంచి హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు.

Read Also: PS-2: కమల్ చెప్తే చూసేస్తారా? ఇంకా తమిళ సినిమాగానే ప్రమోట్ చేస్తున్నారు

ప్రస్తుతం శరత్ బాబు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో ఆయనను ఐసీయూ నుంచి జనరల్ రూంకు షిఫ్ట్ చేశారు. ఈ విషయం తెలిసి శరత్ బాబు అభిమానులు కాస్త కుదుటపడ్డారు. దక్షిణాదిలోని దాదాపు అన్ని భాషల్లో నటించారు శరత్ బాబు. తెలుగు సినిమాలతో మొదలు పెట్టి.. తమిళ, కన్నడ మలయాళ సినిమాల్లో శరత్ బాబు లీడ్ క్యారెక్టర్లు చేశారు. 1973లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్ బాబు ఇప్పటి వరకు 250కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆయనకు ఉత్తమ సహాయ నటుడిగా మూడు నంది పురస్కరాలు కూడా దక్కాయి.

Read Also: Adipurush: ఇది కదా ఆదిపురుష్ నుంచి మనకి కావాల్సిన స్టఫ్…

Show comments