Tody (22-12-22) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్.. నిన్న బుధవారం మాదిరిగానే.. ఇవాళ గురువారం కూడా లాభాలతో ప్రారంభమై నష్టాలతో ముగిసింది. వరుసగా రెండో రోజూ కొవిడ్ భయాలు కొనసాగాయి. ఇన్వెస్టర్లు కొత్త షేర్ల కొనుగోలు కన్నా అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో రెండు సూచీలూ నేల చూపులు చూశాయి. సెన్సెక్స్ 241 పాయింట్లు తగ్గి 60 వేల 826 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 71 పాయింట్లు కోల్పోయి 18 వేల 127 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 60 వేల 637 పాయింట్లకి, నిఫ్టీ 18 వేల 68 పాయింట్లకి పడిపోయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 సంస్థల్లో 24 కంపెనీలు నష్టాలను చవిచూడగా 6 సంస్థలు మాత్రమే లాభాలు పొందాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ సున్నా పాయింట్ ఏడు ఏడు శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఒకటీ పాయింట్ ఎనిమిది శాతం డౌన్ అయ్యాయి.
read also: Subscribers Want Free Content On OTTs: ఓటీటీలో ఉచిత కంటెంట్ వైపే ప్రేక్షకుల మొగ్గు
నిఫ్టీలో ఆటోమొబైల్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్‌లు, రియల్ ఎస్టేట్ రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. వ్యక్తిగత షేర్ల విషయానికొస్తే.. యూపీఎల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్, బీపీసీఎల్, మహింద్రా అండ్ మహింద్రా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ వ్యాల్యూ రెండున్నర శాతానికన్నా పైగానే పడిపోయింది.
10 గ్రాముల బంగారం ధర 73 రూపాయలు మైనస్ అయి 54 వేల 998 రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 498 రూపాయలు పడిపోయి 69 వేల 211 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ మరో 4 పైసలు తగ్గింది. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 68 పైసల వద్ద ఉంది.