NTV Telugu Site icon

Vijay Devarakonda Photo: ఎలా ఉండే వాడు, ఎలా అయ్యాడు.. విజయ్ దేవరకొండను గుర్తుపట్టడం కష్టమే!

Vijay Devarakonda Vd 12

Vijay Devarakonda Vd 12

Vijay Devarakonda’s New Look Shakes Internet from VD 12: టాలీవుడ్ యంగ్ హీరో ‘విజయ్ దేవరకొండ’ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న రోల్స్ చేసి.. స్టార్ హీరోగా ఎదిగారు. ‘పెళ్లి చూపులు’ సినిమా విజయ్‌కు హిట్ ఇస్తే.. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. నోటా, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ నిరాశపర్చినా.. ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు పర్వాలేదనిపించాయి. ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ‘జెర్సీ’ డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరితో విజయ్‌ ఓ సినిమా చేస్తున్నాడు.

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘వీడీ 12’ (వర్కింగ్ టైటిల్). ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. విజయ్ గన్ పట్టుకుని ఉన్న పోస్టర్‌ను గత నెలలో విజయ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్నారు. తాజాగా విజయ్‌కు సంబందించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైక్‌పై వెనకాల కూర్చొని తీక్షణంగా చూస్తున్నాడు. గడ్డం, పొట్టి షార్ట్ హెయిర్ స్టైల్‌లో గుర్తుపట్టలేకుండా ఉన్నాడు. ఇది చూసిన నెటిజెన్స్.. ‘ఎలా ఉండే వాడు.. ఎలా అయ్యాడు’, ‘విజయ్ దేవరకొండను గుర్తుపట్టడం కష్టమే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Hyper Aadi: వారంతా ఒక్కటే.. అల్లు అర్జున్‌ను ట్రోల్ చేయడం ఆపండి!

స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా వీడీ 12 తెరకెక్కుతోంది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరో సత్యదేవ్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, వైజాగ్‌లలో జరుగుతోంది.