దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి. ఓవైపు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చినప్పటికీ., ఇండెక్స్ గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఇన్వెస్టర్లు లాభాలను తీసుకోవాలనుకున్నారు. దాంతో ముక్యంగా హెచ్‌డిఎఫ్‌సి, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్స్ అమ్మకాలు ఎక్కువగా జరగడంతో.. సెన్సెక్స్ ఒక దశలో 600 పాయింట్లకు పైగా నష్టపోయినా., ఆ తర్వాత కాస్త కోలుకొని చివరకి నిఫ్టీ 22,300 పాయింట్లను తాకింది.
Also Read: Sai Pallavi : కోట్లు ఇచ్చిన ఆ పని చెయ్యనని చెప్పేసిన సాయి పల్లవి..
ఉదయం స్వల్పంగా లాభపడిన సెన్సెక్స్ 73,973.30 వద్ద ప్రారంభమైంది. ఇది రోజువారీ ట్రేడింగ్ లో 73259.26 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. చివరకు కోలుకుని 383.69 పాయింట్లు పతనమై 73,511.85 వద్ద ముగిసింది. ఐకమరోవైపు నిఫ్టీ 140.69 పాయింట్లు నష్టపోయి 22,302.50 వద్ద నిలిచింది. ఇక డాలర్ తో రూపాయి మారకం విలువ నేడు 83.52 వద్ద కొనసాగుతుంది. ఇకఅంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 83.16 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది.
Also Read: Swathi: కలర్స్ స్వాతిని ‘ఛీ.. నీ బతుకు.. ‘ అంటూ మెసేజ్.. రిప్లై గట్టిగా ఇచ్చిందిగా..
ఇక నేడు ఇంట్రాడే లో బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్ గా హిందుస్థాన్ యూనిలీవర్ (5.51%), టెక్ మహీంద్రా (2.37%), నెస్లే ఇండియా (2.06%), టీసీఎస్ (1.36%), ఐటీసీ (1.55%) లు ఉండగా., మరోవైపు టాప్ లూజర్స్ గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-3.62%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.05%), టాటా మోటార్స్ (-2.72%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-2.41%), ఎన్టీపీసీ (-2.16%) లు ఉన్నాయి.