NTV Telugu Site icon

Today Stock Market Roundup 27-03-23: టాప్‌లో నిలిచిన విజయా డయాగ్నాస్టిక్స్‌

Today Stock Market Roundup 27 03 23

Today Stock Market Roundup 27 03 23

Today Stock Market Roundup 27-03-23: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌ ఈ వారాన్ని ఫ్లాట్‌గా ప్రారంభించింది. ఇవాళ సోమవారం ఉదయం ఇంటర్నేషనల్‌ మార్కెట్‌ నుంచి మిశ్రమ సంకేతాలు అందటంతో సూచీలు ఊగిసలాడాయి. తర్వాత లాభాల బాట పట్టాయి. కానీ.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. రెపో రేటును పావు శాతం పెంచే అవకాశాలున్నాయంటూ వార్తలు రావటంతో ఇన్వెస్టర్లు స్టాక్స్‌ కొనుగోళ్ల వైపు మొగ్గుచూపలేదు.

దీంతో ఇండెక్స్‌లు సాయంత్రం స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకున్నాయి. చివరికి.. సెన్సెక్స్‌.. 126 పాయింట్లు పెరిగి 57 వేల 653 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ.. స్వల్పంగా 40 పాయింట్లు పెరిగి 16 వేల 985 వద్ద క్లోజ్‌ అయింది. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో రిలయెన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, ఐటీసీ, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌ మంచి పనితీరు కనబరిచాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, మహింద్రా అండ్‌ మహింద్రా, నెస్లే ఇండియా వెనకబడ్డాయి.

read more: TCS New CEO Krithivasan: టీసీఎస్‌ CEOగా సరైనోడే. కృతివాసన్‌పై అందరిదీ ఇదే మాట

నేషనల్‌ స్టాక్స్‌ ఎక్స్ఛేంజ్‌లో అపోలో హాస్పిటల్స్, దివిస్ ల్యాబ్స్, కొటక్ మహింద్రా, ఇన్ఫోసిస్‌ రాణించగా.. అదానీ పోర్ట్స్‌, మహింద్రా అండ్‌ మహింద్రా, టాటా మోటార్స్‌, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ నేలచూపులు చూశాయి. రంగాల వారీగా చూస్తే.. బీఎస్‌ఈలో అదర్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సంస్థల స్టాక్స్‌ వ్యాల్యూ పెరిగింది. నిఫ్టీలో ఇండస్ట్రియల్‌ అండ్‌ అదర్‌ సెక్టార్ల కంపెనీల షేర్ల విలువలు పెరిగాయి.

వ్యక్తిగత స్టాక్స్‌ను పరిశీలిస్తే.. బీఎస్‌ఈలో లాభాలు పొందిన సంస్థల జాబితాలో యూనో మిండా టాప్‌లో నిలవగా ఎన్‌ఎస్‌ఈలో విజయా డయాగ్నాస్టిక్స్‌.. అగ్రస్థానాన్ని పొందింది.
10 గ్రాముల బంగారం ధర 445 రూపాయలు తగ్గింది. గరిష్టంగా 58 వేల 828 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. కేజీ వెండి రేటు కూడా దాదాపు ఇదే స్థాయిలో 440 రూపాయలు పడిపోయింది.

అత్యధికంగా 69 వేల 971 రూపాయలు పలికింది. క్రూడాయిల్‌ ధర నామమాత్రంగా 22 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్‌ ముడి చమురు 5 వేల 750 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 6 పైసలు బలపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 38 పైసల వద్ద స్థిరపడింది.