Union Minister Kishan Reddy in Munugodu: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోన్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు మునుగోడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బయలుదేరనున్నారు. రేపు అమిత్ షా భారీ బహిరంగ సభ నేపథ్యంలో మునుగోడుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. రేపు జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభా స్థలిని పరిశీలించనున్నారు. సభలో జనసమీకరణపై పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేసే అవకాశం. ఇవాళ ఉదయం 11 గంటకు మనుగోడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.
ఇవాళ సీఎం కేసీఆర్ మునుగోడు మండల కేంద్రంలో జరిగే ప్రజా దీవెన బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. నగరం నుంచి రహదారి మార్గంలో భారీ కాన్వాయ్‌తో మధ్యాహ్నం రెండు గంటలకు మునుగోడుకు చేరుకుని, అక్కడే మంత్రి జగదీశ్‌రెడ్డితో పాటూ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యనేతలతో సీఎం సమావేశమైన తరువాత భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి రావాలని సీపీఐని సీఎం కేసీఆర్ కోరారు. దీంతో మునుగోడు సభకు సీపీఐ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఇక సీఎం వాహనంతోనే, చాడ వెంకటరెడ్డి మునుగోడు వెళ్లనున్నారు. టీఆర్ఎస్, సీపీఎం పార్టీలో మునుగోడులో బరిలోకి దిగనున్నారు. ఈరోజు మునుగోడుకు సీఎం వెళ్లనున్న నేపథ్యంలో.. చాడ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ తో సీపీఐ మునుగోడు సభకు సిద్దమని స్పష్టం చేయడంతో మునుగోడు ఉపఎన్నిక సభ ఊహంచనిరీతిలో ఊపందుకోనుంది.
రేవంత్ రెడ్డి మునుగోడు పర్యటన
స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మునుగోడు నియోజక వర్గంలో మన మునుగోడు, మన కాంగ్రెస్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున ఏర్పాటు చేసారు కాంగ్రెస్ శ్రేణులు. 175 గ్రామాల్లో కాంగ్రెస్ శ్రేణులు పాదయాత్ర చేయాలని నిర్ణయించాయి. ఆరు మండలాలు, ఒక ప్రతిపాదిత మండల కేంద్రాల్లో జరిగే పాదయాత్రల్లో పీసీసీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పొర్లుగడ్డతండాలో జరిగే పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. పాదయాత్ర సందర్భంగా మన మునుగోడు – మన కాంగ్రెస్ కరపత్రాలను ప్రతి బూత్‌లో అంటించాలని పార్టీ శ్రేణులకు పీసీసీ నేతలు పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు మునుగోడు బాట పట్టడంతో.. మునుగోడులో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎటువంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. ముందస్తు చర్యలు చేపట్టారు. నేతలందరూ ఇవాళ సీఎం కేసీఆర్ తోపాటు చాడ వెంకట్‌రెడ్డి, టీపీసీసీ రేవంత్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మునుగోడు వెళ్లనున్న నేపథ్యంలో.. ఉత్కంఠ నెలకొంది. రేపు అమిత్ షా రానున్న విషయం తెలిసిందే. షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ చేరునున్న విషయం తెలిసిందే.
Drink More Alcohol: మద్యం తాగండి ప్లీజ్.. సర్కార్ రిక్వెస్ట్..!
