Site icon NTV Telugu

KTR: విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం.. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోం

Ktr

Ktr

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నిన్న నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నేడు కేటీఆర్ సిట్ ముందు మరికాసేపట్లో విచారణకు హాజరుకానున్నారు. సిట్ కార్యాలయానికి వెళ్ళేముందు తెలంగాణ భవన్ లోపల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు లు.. ఆతర్వాత కేటీఆర్ మీడియా తో మాట్లాడారు. ఈ కేసులో ఏమీ లేదు. మాకు ఏం సంబంధం లేదని కేటీఆర్ తెలిపారు. పదిసార్లు పిలిచినా హాజరవుతా.. అటెన్షన్ డైవర్షన్ కోసమే ఈ కుట్రలు అని మండిపడ్డారు.

Also Read:Subhas Chandra Bose Jayanti: “జై హింద్”.. నేతాజీ గురించి ఆసక్తికర విషయాలు..

రేవంత్.. తన మంత్రులతో సహా మా అందరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు అని కేటీఆర్ ఆరోపించారు. రూ.50 లక్షలతో నోటుకు ఓటులో దొరికిన ఒక దొంగ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లే.. ఈ రాజకీయ కక్ష సాధింపులు అని అన్నారు. 6 గ్యారెంటీల మోసం, 420 హామీల దగా, సింగరేణి బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఈ కుతంత్రాలు అని ఫైర్ అయ్యారు. నాలుగు కోట్ల ప్రజలను నయవంచన చేసిన ముఖ్యమంత్రిని వదిలిపెట్టం.. కాంగ్రెస్ ను బొంద పెట్టేదాకా నిద్రపోం అని కేటీఆర్ తెలిపారు. విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని వెల్లడించారు.

ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోంది.. కెసిఆర్ సైనికులు గా ఉద్యమం నుంచి ఉద్భవించిన నాయకత్వం బీఆర్ఎస్ ది అని అన్నారు. కెసిఆర్ నాయకత్వంలో పదేళ్లు అధికారంలో ఉన్నాము
మేము ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదు.. మేము టైం పాస్ రాజకీయాలు చేయలేదు.. ప్రతిపక్షాలను వేధించ లేదన్నారు. విచారణ లకు భయపడే వారు ఎవరూ లేరని తెలిపారు. రాష్ట్రంలో పాలన పిచ్చోడి చేతిలో రాయి లాగా మారిందని ఎద్దేవ చేశారు. రోజుకో అంశం తో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. పుట్టిన భూమి సాక్షిగా అక్రమ, అనైతిక పనులు నేను చేయలేదు. నేను డ్రగ్స్ తీసుకుంటానని.. నాకు హీరోయిన్ లతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేశారన్నారు.

Also Read:High Tension in Tadipatri: జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రిలో హై టెన్షన్‌..!

మా కుటుంబాలను ఇబ్బంది పెట్టారు.. అయినా నేను ఎప్పుడూ భయపడలేదు.. హీరోయిన్ ల ఫోన్ లు ట్యాప్ అయ్యాయని మీరే లీకులు ఇచ్చారు.. మళ్ళీ ఏమి లేదని మీరే అన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఫోన్ లు ట్యాప్ అవ్వడం లేదని పోలీసులు చెబుతారా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ విషయంపై డీజీపీ శివదర్ రెడ్డి మీడియా ముందు చెబుతారా అని ప్రశ్నించారు. బొగ్గు స్కాం ను హరీష్ రావు బయట పెట్టారు.. మంత్రులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదు.. హరీష్ రావు కు నోటీసులు ఇచ్చి పిలిస్తే.. వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పాడని తెలిపారు. రాష్ట్రంలో దోపిడి దొంగల ముఠా ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలో కొందరు పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Exit mobile version