NTV Telugu Site icon

Amaravathi : నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటన

Amaravati

Amaravati

నేడు రాజధాని అమరావతిలో రెండో రోజు ఐఐటీ నిపుణుల పర్యటించనున్నారు. ఐకానిక్‌ భవనాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించనున్నారు ఐఐటీ ఇంజనీర్లు. ఇంజనీర్లు నివేదిక ఇచ్చిన తర్వాత నిర్మాణ పనులపై స్పష్టత రానుంది. అయితే.. ఎన్జీవో నివాస సముదాయాల్లో ఇనుప చువ్వలు భారీగా తుప్పుపట్టాయి. వీటి విషయంలో ఏం చేయాలన్నది ఇప్పుడే చెప్పలేమని నిపుణులు తెలిపారు. చువ్వలను పూర్తిగా తొలగించిన తర్వాత, లేదా శుభ్రం చేసిన తర్వాతే పనులు ప్రారంభించాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. పూర్తి స్థాయి పరీక్షలు చేసిన తర్వాతే సామర్థ్యం తేలుతుందని చెప్పారు. ఈ సమస్యను నిశితంగా పరిశీలించిన తర్వాతే ముందుకు సాగాలని, ఇందుకు చాలా సమయం పడుతుందని అన్నారు. విభాగాధిపతుల బంగ్లాల్లో ఇనుప చువ్వలు తుప్పు పట్టి, స్తంభాలు పలు చోట్ల పగుళ్లు ఏర్పడ్డాయని తెలిపారు. కట్టడాల పటిష్ఠతను అంచనా వేసేందుకు మట్టి పరీక్షలతో పాటు నాన్‌-డిస్ట్రక్టివ్, కోర్‌ కటింగ్‌ పరీక్షలు నిర్వహించాలని సీఆర్డీఏ (CRDA) అధికారులకు నిపుణులు సూచించారు.