NTV Telugu Site icon

Lok Sabha Elections: నేడు ఇండియా కూటమి కీలక సమావేశం

India Alliance

India Alliance

భారత్ లో మరో రెండు నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇక, ప్రతిపక్ష కూటమి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (I.N.D.I.A.) నాయకులు ఇవాళ వర్చువల్ గా కీలక సమావేశం కానున్నారు. ఇక, రేపు మణిపూర్ నుంచి ముంబై వరకు భారత్ జోడో న్యాయ్ యాత్ర అధికారికంగా ప్రారంభం అవుతుండటంతో ఈ రోజు సమావేశం కొనసాగనుంది.

Read Also: Traffic Diversions: కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్.. 3 రోజులు అక్కడ ట్రాఫిక్‌ ఆంక్షలు

అయితే, ఇవాళ ఉదయం 11:30 గంటలకు జూమ్‌లో ఇండియా కూటమికి చెందిన అన్ని పార్టీల నేతలు సమావేశమవుతారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. సీట్ల పంపకాలపై చర్చలతో పాటు ఇంఫాల్ సమీపంలోని తౌబాల్ నుంచి ప్రారంభం కానున్న భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనడం, ఇతర ముఖ్యమైన అంశాలపై వారు సమీక్షించనున్నారు. ఇక, ఎన్నికలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం కాగానే, ఇండియా కూటమికి సమన్వయకర్తగా ఉండాలని భారతదేశంలోని అనేక పార్టీలు కాంగ్రెస్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.

Read Also: Taiwan: తైవాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు చైనా దాడులు..

అలాంటి పరిస్థితిలో భారత కమిటీ నేతలు వర్చువల్ సమావేశంలో సమన్వయకర్తను నిర్ణయించేందుకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్‌ను భారత కమిటీ కన్వీనర్‌గా చేయాలనే వాదన వినిపిస్తోంది. రేపటి నుంచి ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు ఒక రోజు ముందు ఈ మీటింగ్ జరుగుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఉదయం 11.30 గంటలకు భారత నాయకుల వర్చువల్ సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ సమావేశాన్ని దృష్టిలో ఉంచుకుని.. శుక్రవారం, ఢిల్లీలో లోక్‌సభ స్థానాల సమన్వయానికి సంబంధించి ఉత్తరప్రదేశ్‌లో ఎస్‌పీతో జరిగే కాంగ్రెస్ సమావేశం వాయిదా పడింది.