Paris Olypics 2024 India Schedule Today: పారిస్ ఒలింపిక్స్ 2024లో 13వ రోజు కొనసాగుతోంది. ఈ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు భారత్ 3 పతకాలు మాత్రమే సాధించింది. ఈ మూడు పతకాలు కూడా షూటింగ్‌లో సాధించినవే. అయితే ఈరోజు పతకాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ‘గోల్డెన్ బాయ్’ నీరజ్ చోప్రా జావెలిన్ త్రోలో బంగారు పతకం కోసం గురువారం పోటీ పడబోతున్నాడు. అన్నీ కలిసొస్తే స్వర్ణం, లేదా ఏదో ఒక పతకం అయినా నీరజ్ గెలుస్తాడని అంచనా.
హాకీలో భారత పురుషుల జట్టు కాంస్య పతక పోరులో స్పెయిన్‌తో తలపడనుంది. భారత్ ఫామ్ చూస్తే కాంస్యం ఖాయంగా కనబడుతోంది. ఈరోజు భారత్‌కు అత్యంత ముఖ్యం అని చెప్పొచ్చు. నేడు అథ్లెటిక్స్, గోల్ఫ్, రెజ్లింగ్, హాకీ మ్యాచ్‌లు జరగనున్నాయి. నేటి పూర్తి భారతీయ షెడ్యూల్ తెలుసుకోండి.
Also Read: Neeraj Chopra: నేడు జావెలిన్ త్రో ఫైనల్.. మరో స్వర్ణంపై నీరజ్ చోప్రా గురి! గెలిస్తే చరిత్రే
నేటి భారత షెడ్యూల్ ఇదే:
గోల్ఫ్:
మహిళల వ్యక్తిగతం: అదితి అశోక్ మరియు దీక్షా దాగర్ – మధ్యాహ్నం 12.30
అథ్లెటిక్స్:
మహిళల 100 మీటర్ల హర్డిల్స్ రెపెచేజ్ రౌండ్: జ్యోతి యారాజీ – మధ్యాహ్నం 2.05
పురుషుల జావెలిన్ త్రో ఫైనల్: నీరజ్ చోప్రా – రాత్రి 11.55
రెజ్లింగ్:
పురుషుల ఫ్రీస్టైల్ 57 కేజీలు (ప్రీ క్వార్టర్ ఫైనల్): అమన్ సెహ్రావత్ – 2.30 మధ్యాహ్నం
మహిళల ఫ్రీస్టైల్ 57 కేజీలు (ప్రీ-క్వార్టర్ ఫైనల్): అన్షు మాలిక్ – మధ్యాహ్నం 2:30
హాకీ:
పురుషుల కాంస్య పతక మ్యాచ్: భారత్ vs స్పెయిన్: సాయంత్రం 5.30