చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పరిశీలనకు చంద్రబాబు వెళ్లిన సమయంలో ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. ఈ ఘర్షణలకు చంద్రబాబు కారణమని ఆరోపిస్తూ కేసులు నమోదయ్యాయి. చంద్రబాబుతో పాటు 20మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఘర్షణలు జరిగాయి. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వైసీపీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశారు. అయితే.. ఈ నేపథ్యంలో పుంగనూరు ఆంగళ్లు కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది.
Also Read : Health Tips: రాత్రిపూట ఇడ్లీ, దోసెలు తింటున్నారా? ఎంత ప్రమాదమో తెలుసా..
అయితే.. ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లు అల్లర్ల కేసులో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురయింది. ఈ కేసులో నిందితులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు… హైకోర్టు తీర్పును సమర్థించింది. హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ విషయంలో జోక్యం చేసుకోబోమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ కేసులో ఒక పోలీసు అధికారి గాయపడ్డారని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు పట్టించుకోలేదు.
Also Read : CM KCR : రేపటి నుండి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల
