క్రికెట్ ఆటలో ఫన్నీ ఇన్సిడెంట్‌లకు కొదవ ఉండదు. ఒక్కోసారి ప్లేయర్లు చేసే విన్యాసాలు భలేగా నవ్వులు తెప్పిస్తాయి. ముఖ్యంగా ఫీల్డర్లు క్యాచ్‌లను పట్టే క్రమంలో ఎంతో ఫన్ క్రియేట్ అవుతుంది. అలాంటి సరదాగా ఘటన ఒకటి విలేజ్ క్రికెట్ టోర్నీలో జరిగింది. ఓ ఫీల్డర్ చేతులోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఆరు ప్రయత్నించి.. ఏడోసారి వదిలేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంగ్లండ్‌లోని విలేజ్ క్రికెట్‌లో భాగంగా తాజాగా సందర్‌స్టీడ్ క్లబ్, మెర్టన్ బోర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మెర్టన్ బోర్స్ బ్యాటర్ మార్క్ బార్బర్ భారీ షాట్ ఆడగా.. బంతి లాంగ్-ఆన్‌లో గాల్లోకి లేచింది. సందర్‌స్టీడ్ ఫీల్డర్ స్టూ ఎల్లెరీ క్యాచ్ పట్టేందుకు ముందుకు పరుగెత్తుకొచ్చాడు. ఆరుసార్లు క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించాడు. ఏడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. దాంతో మైదానంలో నవ్వులు పూశాయి. క్యాచ్‌ను రిప్లేలో చూసి ఎల్లెరీ కూడా తెగ నవ్వుకున్నాడు.
Also Read: Gold Price Today: మగువలకు శుభవార్త.. వరుసగా రెండోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
స్టూ ఎల్లెరీ మిస్ చేసిన క్యాచ్‌కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. క్రికెట్ ఫ్యాన్స్, నెటిజెన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘గొప్ప డ్రాప్డ్ క్యాచ్’, ‘క్యాచ్‌ను వదిలేసేందుకు ఫీల్డర్ చాలా కష్టపడ్డాడు’, ‘పాకిస్తాన్ ఫీల్డింగ్‌ను గుర్తుకుతెచ్చాడు’ అంటూ ఎల్లెరీ క్యాచ్ డ్రాప్‌పై కామెంట్స్ వస్తున్నాయి. వీడియో మీరు చూసి తెగ నవ్వుకోండి.
The greatest dropped catch of all time 😂 pic.twitter.com/ZtIBZ06nUn
— Out Of Context Cricket (@GemsOfCricket) August 21, 2024
