NTV Telugu Site icon

రక్ష బంధన్‌ స్పెషల్‌ : భారీగా పడిపోయిన బంగారం ధరలు

గత కొన్ని రోజులుగా భారీగా పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు ఇవాళ త‌గ్గుముఖం ప‌ట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 44,150 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 తగ్గి రూ. 48,170 కి చేరిది. దేశీయంగా మార్కెట్లు తిరిగి క్రమంగా పుంజుకోవ‌డంతో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇక బంగారం ధ‌ర‌లు దారిలోనే వెండి ధ‌ర‌లు కూడా తగ్గిపోయాయి. కిలో వెండి ధ‌ర రూ. 5300 తగ్గి రూ. 61,700 వ‌ద్ద కొనసాగుతోంది. ఇవాళ రక్ష బంధన్‌ పండుగ ఉన్న నేపథ్యంలో బంగారం మరియు వెండి ధరలు తగ్గడం శుభ సూచకమని నిపుణులు అంటున్నారు. ఇక అటు ధరలు తగ్గడంతో… బంగారం దుకాణాలకు క్యూ కడుతున్నారు.